Full Text
భారత సర్వోన్నత న్యాయస్థా నము
క్రిమినల్ అప్పీలు అధికార పరిధి
క్రిమినల్ అప్పీలు నంబరు.534/2023
(స్పెషల్ లీవ్ పిటిషన్ (క్రిమినల్) నంబరు.8260/2021)
ది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ ...అప్పీలుదారు(లు)
మరియు
యం.గోపాల్ రెడ్డి మరియు ఇంకొకరు ...ప్రతివాదు(లు)
తీర్పు
ఎమ్.ఆర్.షా. న్యాయమూర్తి
JUDGMENT
1. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.ఏ), 2002 (ఇందులో ఇక మీదట చట్టం ‘ 2002’ గా పేర్కొన్నబడుతుంది)లోని సెక్షన్-3 క్రింద నమోదయి సదరు చట్టంలోని సెక్షన్-4 క్రింద శిక్షర్హమైన నేరానికి అసిస్టెంట్ డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ఇందులో ఇక మీదట ఈడీ గా పేర్కొన్నబడుతుంది ‘ ’ ) ఎఫ్.నం. ఈసిఐఆర్/హై జో/36/ 2020 తేదీ.15-12-2020 1 వ ప్రతివాది పైన నమోదు చేయబడిన కేసుకు సంబంధించి హై దరాబాదులోని తెలంగాణ ఉన్నత న్యాయ స్థా నము, హై దరాబాదులో క్రిమినల్ పిటిషను నంబరు.1148/ 2021 లో 1 వ ప్రతివాది ముందస్తు బెయిల్ దరఖాస్తు ను అనుమతిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసి, ఒకవేళ అతని పైన నమోదైన కేసులో గనుక అతను అరెస్టయితే అతన్ని బెయిల్ పై విడుదల చేయాలంటూ తేది.02- 03-2021 తేదీన వెలువరించిన తీర్పు మరియు ఉత్తర్వులను సవాలు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ సదరు ఉత్తర్వు పట్ల వ్యధ చెంది అసంతృప్తతతో ప్రస్తు త అప్పీలు దాఖలు చేశారు.
2. ఆర్ధిక నేరాల విభాగం (ఈ ఓ డబ్ల్యు), భోపాల్ 10-04-2019 తేదీన ప్రధమ సమాచార నివేదిక (ఎఫ్ ఐ ఆర్) న o బరు.12/2019 నమోదు చేయబడింది. అందులో 20 మంది వ్యక్తు లను/కంపెనీలను సదరు కుంభ కోణంలో అనుమానితులుగా పేర్కొన్నారు. మెస్సర్స్ మాక్స్ మంతెన మైక్రో జెవి, హై దరాబాద్, అందులో ఒకటిగా చూపబడింది. 2.[1] ప్రథమ సమాచార నివేదిక ప్రకారం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రోక్యూర్ – మెంట్ పోర్టల్ ను మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రా నిక్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఎంపీయస్ఈడీసీ) నిర్వహిస్తోంది. మెస్సర్స్ ఆ o ట-రెస్ సిస్టమ్స్ లిమిటెడ్, బెంగుళూరు మరియు మెస్సర్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి సి ఎస్) లకు సదరు పోర్టల్ నిర్వహించడానికి మరియు అమలు పరచడానికి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇవ్వబడింది. అయితే ఎంపీయస్ఈడీసీకి చెందిన కొందరు అధికారులు పోర్టల్ నిర్వహణ మరియు పరీక్షల బాధ్యతలను అప్పగించిన సంస్థలైన మెస్సర్స్ ఆస్మో ఐటీ సొల్యుషన్స్ మరియు మెస్సర్స్ ఆంటరెస్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థలలో కుమ్ముకై అక్రమంగా ఈ టెండర్ పోర్టల్ చొరవతో కొందరు ప్రైవేట్ – బిడ్డర్లకు భారీగా ముడుపులు చెల్లించేందుకు వీలుగా బిడ్డింగ్ ప్రక్రియను రిగ్గింగ్ (ధరల తగ్గింపు) చేసింది. 2.[2] దర్యాప్తు సంస్థ ప్రకారం, పోలీసులు చేసిన ప్రాధమిక దర్యాప్తు లో వివిధ ఈ- టెండర్లను అక్రమంగా యాక్సెస్ చేశారని, ఇదే కాకుండా, కొన్ని కంపెనీల బిడ్లను కూడా చట్ట వ్యతిరేకంగా కనిష్టంగా నిర్ధా రించారని తేలింది. 2.[3] ఆర్ధిక నేరాల విభాగం (ఈ ఓడబ్ల్యు), భోపాల్ దాఖలు చేసిన ప్రాథమిక ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ ఐ ఆర్)లో పేర్కొన్న టెండర్లతో పాటుగా నంబర్లు 91, 93, 94 (జలవనరుల శాఖ); 2 పిడబ్ల్యు.డి టెండర్ నంబర్లు.49985 మరియు 49982; టెండర్ నంబరు.49813, యంపిఆర్డీసీ టెండర్ నంబరు.786; మరియు టెండర్ నంబర్లు. 10030 మరియు 10044, ద్వారా, ఇదే తీర్పులో మోడస్ ఆపరెండి అనేక ఇతర టెండర్లు కూడా తారుమారు చేయబడ్డా యని అనుమానించబడింది. హై దరాబాద్ కు చెందిన మెస్సర్స్ మంతెన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఈ టెండర్ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారుగా – అనుమానిస్తు న్నారు. ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) అభియోగ పత్రం (చార్జ్ షీట్) ప్రకారం, మంతెన గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన మెస్సర్స్ మాక్స్ మంతెన మైక్రో జేవి రూ.1020 కోట్లు విలువ చేసే ట్యాం పర్డ్ ఈ – టెండర్ నంబరు.10030 యొక్క ప్రతక్ష్య లబ్ధిదారు. 2.[4] దర్యాప్తు సంస్థ ప్రకారం, భారతీయ శిక్షాస్మృతి (ఐ పి సి) సెక్షన్ 120 బి, 420, 471 మరియు అవినీతి నిరోధక చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) లోని సెక్షన్-7 తో చదువబడు సెక్షన్ 13 (2) ప్రకారం దర్యాప్తు కొనసాగుతోంది. మరియు చట్టం 2002 ప్రకారం సదరు నేరాలు అనుసూచిత నేరాలు (షెడ్యూల్డ్ అఫెన్సెస్) ఫైల్ నంబరు ఈసీఐఆర్/హై జో/36/2020 లో అక్రమ నగదు చలామణీ నిరోధక దర్యాప్తు ను ఈడీ ప్రారంభించింది. 2.[5] ఈడీ ప్రకారం, సాక్ష్యాలు సేకరించడానికి పీయంఎల్ఏ, 2002 లోని సెక్షన్-17(1) నిబంధనలననుసరించి సోదాలు నిర్వహించడం జరిగింది. తదనుసారం, 18 ప్రమోటర్ల నివాస ప్రాంతాలు, మరియు మెస్సర్స్ మంతెన కన్స్ స్ట్రక్షన్స్ లిమిటెడ్, మెస్సర్స్ ఆంటరెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ ఒస్మో ఐ టి సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ ఆర్ని ఇన్ఫ్రా వంటి ప్రమోటర్ల కార్యాలయాలు శోధించడంతో పెద్ద మొత్తంలో నేరారోపణ పత్రాలు మరియు అంకాత్మక పరికరాలను (డిజిటల్ డివైసెస్) స్వాధీనం చేసుకుని సాక్ష్యం సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఈడీ దర్యాప్తు లో ఈ- టెండర్లను అక్రమంగా దక్కించుకునేందుకు హై దరాబాద్ స్థా వరంగా చేసుకున్న మౌళిక సదుపాయాల కంపెనీలు (ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్), కొందరు ప్రభుత్వ అధికారులు మరియు ఐటీ మేనేజ్ మెంట్ సంస్థలతో కుమ్ముకై ఓ క్రమబద్ధమైన కుట్రను అమలు పరచినట్టు గా ఈడీ దర్యాప్తు లో స్పష్టమైంది. ఇంకా పెద్ద మొత్తంలో లంచాల రూపంలో కోట్లా ది రూపాయలు హవాలా మార్గాల ద్వారా చేతులు మారాయి. ఇంతే కాదు, అభివృద్ధికి నిర్ధేశించిన ప్రభుత్వ నిధులు వ్యక్తిగత అక్రమ సంపద కోసం మరియు అక్రమ ల o చాల చెల్లింపుల నిమిత్తం మళ్లిo చడం జరిగింది. అప్పీలుదారు డిపార్ట్మెంట్ పెట్టు బడి ఎంపిక (ఫండ్ ట్రయల్) సాక్ష్యాలను వెలికి తీసి బోగస్ మరియు ఇన్ఫ్రా కంపెనీల ఓవర్ బిల్లింగ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన నల్లధనాన్ని స్వాధీన పర్చుకుంది. 2.[6] సంబంధిత సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జలవనరుల శాఖలో అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1 వ ప్రతివాదిని మెస్సర్స్ మంతెన కన్ స్ట్రక్షన్ టెండర్ల కేటాయింపులో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అతనున్న సమయంలో జరిగిన ఆకస్మిక పెరుగుదల గురించి వివరించడానికి ఈడీ పిలిపించింది. 2.[7] ఈడీ కేసుకు సంబంధించి చట్టం 2002 క్రింద అనుసూచిత (షెడ్యూల్డ్) నేరం విషయంలో తనను ఎక్కడ అరెస్ట్ చేస్తా రోనని 1 వ ప్రతివాది నేర శిక్షాస్మృతి (సి ఆర్ పి సి) సెక్షన్ 438 క్రింద ముందస్తు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థా నంలో ప్రస్తు త దరఖాస్తు సమర్పించారు. చట్టం 2002 లోని సెక్షన్-45 యొక్క తీవ్రత/ప్రతిబంధకం పరిశీలించ కుండా, నికేష్ తారా చంద్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్ (2018)11 యస్.సీ.సీ.[1] కేసులో ఈ న్యాయస్థా నం తీర్పు ప్రకారం నేర శిక్షాస్మృతి (సి ఆర్ పి సి)లోని సెక్షన్ 438 నిబంధనలకు వర్తించవన్న విషయాన్ని పరీక్షించకుండా ఉన్నత న్యాయస్థా నం ముందస్తు బెయిల్ దరఖాస్తు ను అనుమతిస్తూ ఒకవేళ ఈడీ కేసులో గనక అతను అరెస్టయితే అతనికి బెయిల్ మంజూరు చేయవలసిందని. ఆదేశించింది. 2.[8] ఈడీ కేసులో 1 వ ప్రతివాదికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థా నం వెలువరించిన తీర్పు ఉత్తర్వును సవాలు చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) సదరు ఉత్తర్వుపట్ల వ్యధ చెంది మరియు అసంతృప్తతతో ప్రస్తు త అప్పీలు దాఖలు చేసింది.
3. ఈడీ-అప్పీలుదారు తరపున విద్యావంతుడైన ఏయస్.జీ శ్రీ కె.ఎం. నటరాజ్ బలంగా తన వాదనలను వినిపిస్తూ కేసు వాస్తవాంశాలు, పరిస్థితుల దృష్ట్యా ఉన్నత న్యాయస్థా నం చట్టం 2002 క్రింద ఈడీ కేసుకు సంబంధించి 1 వ ప్రతివాదికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ బెయిల్ అప్లికేషన్ అనుమతించడంలో తీవ్ర తప్పిదానికి పాల్పడిందన్నారు. 3.[1] ఉన్నత న్యాయస్థా నం చట్టం 2002 సెక్షన్ 45 లోని నిబంధనలు నేరశిక్షాస్మృతి (సి ఆర్ పి సి) లోని సెక్షన్ 438 కు వర్తించన్న అభిప్రాయానికి రావడంలో విశేషంగా పొరబడిందని వెల్లడించారు. ఆ కారణంగా నికేష్ తారా చంద్ షా (పైన పేర్కొనబడినది) కేసులో ఈ న్యాయస్థా నం వెలువరించిన తీర్పును ఆధారం చేసుకోవడంలో ఉన్నత న్యాయస్థా నం పొరపాటు పడిందన్నారు. ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ డాక్టర్ వి.సి.మోహన్ (2022 యస్.సి.సి. ఆన్ లైన్ యస్.సి.452)- (క్రిమినల్ అప్పీలు నంబరు.21/2022) కేసులో నికేష్ తారా చంద్ షా (పైన పేర్కొన్నబడింది) కేసును తప్పుగా చదవడం కారణంగా చట్టం 2002 సెక్షన్ 45 నిబంధనలు ముందస్తు బెయిల్ నిబంధనలకు వర్తించవని ఈ న్యాయస్థా నం సృష్టీకరించిందని నివేదించారు. డాక్టర్ వి.సి. మోహన్ (పైన పేర్కొనబడినది) కేసులో చట్టం 2002 నేరాలకు సంబంధించి సెక్షన్ 45 వర్తిస్తుంది మరియు నేర శిక్షాస్మృతి (సి ఆర్ పి సి) లోని సెక్షన్ 438 కింద దరఖాస్తు ఉన్నప్పటికి చట్టం 2002 లోని సెక్షన్ 45 వర్తిస్తుందని వెల్లడించారు. అందువల్ల ఉన్నత న్యాయస్థా నం వెలువరించిన సవాలు చేయబడ్డ తీర్పు మరియు ఉత్తర్వు డాక్టర్ వి.సి. మోహన్ (పైన పేర్కొనబడినది) కేసులో ఈ న్యాయస్థా నం వెలువరించిన తీర్పుకు స్వల్ప ప్రతి కూలమంటూ నివేదించారు. 3.[2] ఈడీ తరపున శ్రీ కె.ఎం. నటరాజ్ విద్యావంతుడైన ఎ.యస్.జీ వాదనలను కొనసాగిస్తూ ఇతరత్రా కూడా ముందస్తు బెయిల్ జారీ చేసే సందర్బంలో ఉన్నత న్యాయస్థా నం చట్టం 2002 లోని అనుసూచిత (షెడ్యూల్డ్) నేరాల తీవ్రతను సరియైన రీతిలో గుర్తించడం గాని పరిశీలించడం గాని చేయలేదన్నారు. ఉన్నత న్యాయస్థా నం ముందస్తు బెయిల్ దరఖాస్తు ను భారతీయ శిక్షాస్మృతి (ఐ పి సి) కింద సాధారణ నేరాల ప్రకారంగా భావిస్తూ ముందస్తు బెయిల్ అభ్యర్ధన విషయంలో కూడా అదేవిధంగా వ్యవహరించిందని వెల్లడించారు. 3.[3] విద్యావంతుడైన ఎ.యస్.జీ వాదనలను కొనసాగిస్తూ దర్యాప్తు సమయంలో శ్రీనివాసరాజు మంతెన మరియు ప్రస్తు త 1 వ ప్రతివాది మధ్యన సంబంధం ఉన్నట్టు గా ఈడీ దర్యాప్తు నిర్ధా రించిందని అందువల్ల ఈ విషయమై విస్తృత దర్యాప్తు చేయవలసిన అవసరముందని పెర్కోన్నారు. 3.[4] 1 వ ప్రతివాది మరియు అక్రమ నగదు చలమాణీ నేరాలకు పాల్పడిన శ్రీనివాస రాజు మంతెనకు మధ్య సంబంధాలున్నట్లు ఈడీ సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని వివరించారు. 1 వ ప్రతివాదిని ఈడీ పిలిపించిందని, అయితే ఆయన ఐఓ ముందు హాజరవడానికి బదులు ఉన్నత న్యాయస్థా నంలో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వును పొందారని వెల్లడించారు. ఆయన ఈడి ముందు హాజరయ్యారని మరియు చట్టం 2002 లోని సెక్షన్ 50 ప్రకారం ఆయన వాంగ్మూలం (స్టేట్ మెంట్) నమోదు చేయబడిందని తెలిపారు. అయితే ఈ రెండు సందర్భాల్లోను ఆయన పూర్తిగా తప్పించుకోనే ప్రయత్నం చేయడం, సహకరించకపోవడం వంటి ప్రక్రియలు అవలంబించారు. అందువల్ల ఆయనను కస్టడీలో విచారించాల్సిన అవసరముo దని పేర్కొన్నారు. 3.[5] 1 వ ప్రతివాది గత ఏడాదిలోనే పలు సందర్భాలలో మంతెన విలాసవంతమైన విమానం వినియోగించుకొని ఉచిత ప్రయాణాలకు ఆస్వాదించినట్లు దర్యాప్తు సందర్భంగా ఈడీ గుర్తించినట్లు విద్యావంతమైన ఎయస్.జీ వెల్లడించారు. దర్యాప్తు సమయంలో 1 వ ప్రతివాది తన కుమారుడి కోసం హవాలా మార్గాల ద్వారా విదేశీ మారక (ద్రవ్యం) ప్రాపకం వంటి అనేక ఇతర ప్రోత్సాహకాలను కూడా శ్రీనివాస్ రాజు మంతెన నుండి పొందినట్లు గా తేలిందని వెల్లడించారు. 3.[6] 1 వ ప్రతివాదికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంలో ఉన్నత న్యాయస్థా నం సరియైన సమయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసే 1 వ ప్రతివాది పైన ఆరోపిత నేరారోపణల స్వభావాన్ని మరియు తీవ్రతను పరిశీలించలేదు. 3.[7] పైన పేర్కొన్న వాదనలను సమర్పిస్తు మరియు పైన వివరించిన తీర్పును, అదే విధంగా పి.చిదంబరం వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్, (2019) 9 యస్ సి సి 24 కేసులో ఈ కోర్టు తీర్పును ఇంకా వై. యస్.జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ సి బి ఐ; (2013)7 యస్.సి.సి 439 కేసులోని తీర్పుల ఆధారంగా, ప్రస్తు త అప్పీలును అనుమతిస్తూ సవాలు చేయబడిన తీర్పు మరియు ఉత్తర్వును రద్దు పరుస్తూ ఉన్నత న్యాయస్థా నం వెలువరించిన తీర్పును ఉత్తర్వును కొట్టి వేయాల్సిందని అభ్యర్థించారు.
4. 1 వ ప్రతివాది తరపున విద్యావంతుడైన న్యాయవాది శ్రీ విజయ అగర్వాల్ ప్రస్తు త అప్పీలును తీవ్రంగా వ్యతిరేకించారు. 4.[1] 1 వ ప్రతివాది తరపున విద్యావంతుడైన న్యాయవాది వాదనలను బలంగా వినిపిస్తూ కేసు అంశాలు మరియు సందర్భాలనుసరించి ఉన్నత న్యాయస్థా నం 1 వ ప్రతివాదికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంలో ఎలాంటి తప్పిదం చేయలేదన్నారు. 4.[2] ప్రస్తు త కేసులో ప్రధాన ప్రధమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) కు సంబంధిo చినంత వరకు, ఇతర నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు వదిలి వేయబడ్డా రని నివేదించారు. ఈ న్యాయస్థా నం ఇచ్చిన వివిధ తీర్పులో ఒక వ్యక్తి చివరకి అనుసూచిత ( షెడ్యూల్డ్ ) నేరం నుండి విడుదల చేయబడినా లేదా సమర్థవంతమైన అధికార పరధి గల న్యాయస్థా నం ద్వారా అతని పైన మోపబడిన క్రిమినల్ కేసు రద్దు చేయబడినట్లయితే, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా అక్రమ నగదు చలామణీ నేరం గాని లేదా అటువంటి ఆస్తిని పేర్కొన్న అనుసూచిత (షెడ్యూల్డ్) నేరానికి జోడించబడిన సదరు ఆస్తిని అతని ద్వారా క్లెయిమ్ చేసినా అక్రమ నగదు చలామణీ నేరంగా పరిగణించడానికి లేదని పేర్కొనబడిందని బలంగా వాదించారు. 4.[3] ప్రస్తు త కేసులో అనుసూచిత (షెడ్యూల్డ్) నేరానికి సంబంధించి 1 వ ప్రతివాది పేరు ప్రధమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్ )లో లేదని వెల్లడించారు. 4.[4] చట్టం, 2002 కింద నేరం భారతీయ శిక్షాస్మృతి ( ఐ పి సి ) యొక్క నిబంధనలతో సహా సాధారణ చట్టం అయిన ముందస్తు ఆరోపిత నేరం (ప్రేడికేట్ అఫెన్స్ ) పై ఆధారపడి ఉంటుందని వాదించారు. అందువల్ల, ఇతర నిందితులు ముందస్తు ఆరోపిత నేరం (ప్రేడికేట్ అఫెన్స్) నుండి విడుదలయి నందువల్ల వదిలి వేయబడినందువల్ల చట్టం 2002 క్రింద 1 వ ప్రతివాది పైన అక్రమ నగదు చలామణీ అభియోగం ప్రశ్న తలెత్తదని వెల్లడించారు. 4.[5] 1 వ ప్రతివాది తరపున విద్యావంతుడైన న్యాయవాది వాదనలను కొనసాగిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంలో ఉన్నత న్యాయస్థా నం నికేష్ తారా చంద్ షా (పైన పేర్కొనబడినది) కేసులో తత్సం బంధ సమయంలో వాడుకలో ఉన్న చట్టా న్ని ఆధారంగా చేసుకొని ఈ కోర్టు వెలువరించిన తీర్పును అనుసరించిందని నివేదించారు. 4.[6] డాక్టర్ వి.సి.మోహన్ (పైన పేర్కొనబడినది) కేసులో ఈ న్యాయస్థా నం వెలువరించిన నిర్ణయాన్ని త్రోసి పుచ్చింది కాబట్టి ఉన్నత న్యాయస్థా నం ముందస్తు జారీ చేస్తూ వెలువరించిన తీర్పు మరియు ఉత్తర్వును సవాలు చేసే సందర్భంలో ఆ తీర్పును బలమైన కారణంగా పరగణనలోకి తీసుకోవడానికి లేదని వాదనలు వినిపించారు. 4.[7] 1 వ ప్రతివాది తరపున విద్యా వంతుడైన న్యాయవాది వాదనలను కొనసాగిస్తూ ప్రస్తు త కేసులో ఉన్నత న్యాయస్థా నం 1 వ ప్రతివాదికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంలో సమాధాన పరిచే కారణాలు పేర్కొన్నారని మరియు 1 వ ప్రతివాది గతంలో ఐఓ/ఈడీ ముందు రెండుసార్లు హాజరయ్యారని, దర్యాప్తు కు సహకరించారని అందువల్ల ఉన్నత న్యాయస్థా నం ముందస్తు బెయిల్ జారీ చేసిన ఉత్తర్వులలో ఈ కోర్టు జోక్యం అవసరం లేదని వాదించారు.
5. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలన విన్నాము. అయితే మొదలు 1 వ ప్రతివాది అక్రమ నగదు చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 3 కింద మరియు సదరు చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం శిక్షర్హమైన ఈడీ ఫిర్యాదు / కేసుకు సంబంధించి, తను అరెస్టు కాబడతానేమోనన్న సంకోచం 1 వ ప్రతివాదికి కల్గిందన్న విషయం గమనించాల్సిన అవసరముంది. ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నంబరు.12/2019 కు సంబంధించి అనుసూచిత (షెడ్యూల్డ్) నేరానికి గాను 1 వ ప్రతివాది పైన దర్యాప్తు /విచారణ కొనసాగుతోంది. 1 వ ప్రతివాది పైన చట్టం, 2002 కు సంబంధించిన నేరం కింద ఒకసారి గనక దర్యాప్తు /విచారణ కొనసాగుతున్నట్లయితే సదరు చట్టంలోని సెక్షన్ 45 తీవ్రత ఆకర్షించబడుతుంది. సెక్షన్ 45 ఈ కింద విధంగా ఉంది:- “45. కేసు పెట్టదగిన మరియు జామినివ్వ(రా)ని నేరాలు:- (1) (నేర శిక్షాస్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 (1974 లో 2 వాది) లో ఏమి ఉన్నప్పటికీ ) నేరం మోపబడిన ఏ వ్యక్తిని (ఈ చట్టం ప్రకారం ) బెయిల్ పై లేదా అతని స్వ o త పూచీకత్తు పై తప్ప విడుదల చేయరాదు – (i) అటువంటి విడుదల కోసం దరఖాస్తు ను వ్యతిరేకించే అవకాశం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఇవ్వబడింది; మరియు (ii) పబ్లిక్ ప్రాసిక్యూటర్ దరఖాస్తు ను వ్యతిరేకించినప్పుడు, అతను అటువంటి నేరానికి పాల్పడలేదని మరియు బెయిల్ పై ఉన్నప్పుడూ అతను ఎలాంటి నేరం చేసే అవకాశం లేదని విశ్వసించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని కోర్టు సంతృప్తి చెందింది: అయితే, పదహారు సంవత్సరాలకంటే తక్కువ వయస్సున్న వ్యక్తి లేదా ఒక మహిళ లేదా అనారోగ్యంతో లేక బలహీనంగా ఉన్న వ్యక్తి తనకు తానుగా లేదా ఇతర సహానిందితులతో కలసి ఒక కోటి రూపాయలకంటే తక్కువగా అక్రమ నగదు చలామణీ చేసినందుకు నిందితునిగా ఉన్నప్పుడు ఒక వేళ ప్రత్యేక న్యాయస్థా నం ఆ విధంగా నిర్ధేశిస్తే బెయిల్ పై విడుదల కావచ్చు. దీనితో పాటు, వ్రాత పూర్వకంగా చేసిన ఫిర్యాదు పై తప్ప, సెక్షన్-4 కింద శిక్షార్హమైన ఏ నేరాన్ని ప్రత్యేక న్యాయస్థా నం పరిగణలోకి తీసుకోదు, వ్రాతపూర్వకంగా చేసిన ఫిర్యాదు పై తప్ప i. డైరెక్టర్; లేదా ii. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏ అధికారి అయినా, ఈ విషయమై చేయబడిన సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా అధికారమివ్వబడిన ఆ ప్రభుత్వపు అధికారి ఎవరైనా. [(1-ఏ) నేరా శిక్షాస్మృతి) (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)లో ఏది ఉన్నప్పటికి 1973(1974 లో 2 వది] లేదా ఏదైనా ఈ చట్టంలోని ఇతర నిబంధన ప్రకారం, ఏ పోలీసు అధికారి కూడా ఈ చట్టం కింద ఒక నేరం పై దర్యాప్తు చేయకూడదు, ఒక సాదారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు, మరియు నిర్దేశించబడిన షరతులకు లోబడి కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్ప ]
2. సబ్ సెక్షన్ (1) లో పేర్కొన్న విధంగా బెయిల్ మంజూరు చేయడం పై ఉన్న పరిమితి, నేర శిక్షాస్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), 1973 (1974 లో 2 వది) లేదా బెయిల్ మంజూరు చేసే సమయంలో అమలులో వున్న ఏదైనా ఇతర చట్టం క్రింద ఉన్న పరిమితులకు ఆదనంగా ఉంటుంది.” 5.[1] సవాలు చేయబడిన తీర్పు మరియు ఉత్తర్వులో, ముందస్తు బెయిల్ మంజూరు చేసేటపుడు చట్టం 2002 లోని సెక్షన్ 45 నిబంధనలు నేర శిక్షాస్మృతి (సి.ఆర్.పి.సి) సెక్షన్ 438 క్రింద ముందస్తు బెయిల్ దరఖాస్తు లకు వర్తించదని ఉన్నత న్యాయస్థా నం అభిప్రాయ పడింది. ఇందుకుగాను, నికేష్ తారా చంద్ షా (పైన పేర్కొనబడింది) కేసులో ఈ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థా నం ఆధారంగా చేసుకుంది. అయితే డాక్టర్ వి.సి. మోహన్ (పైన పేర్కొనబడింది) కేసులో ఈ న్యాయస్థా నం నిర్దిష్టంగా పరిశీలించి చట్టం 2002 లోని సెక్షన్ 45 యొక్క తీవ్రత నేర శిక్షాస్మృతి (సి.ఆర్.పి.సి) లోని సెక్షన్ 438 క్రింద వున్న ముందస్తు బెయిల్ దరఖాస్తు లకు వర్తించదని ఉన్నత న్యాయస్థా నం భావించడం తప్పుడు అవగాహనతో కూడుకున్నదని తీర్పులో పేర్కొంది. డాక్టర్ వి.సి. మోహన్ (పైన పేర్కొనబడినది) కేసులో ఈ న్యాయస్థా నం వెలువరించిన నికేష్ తారా చంద్ షా (పైన పేర్కొనబడినది) తీర్పు సందర్భానుసారంగా వాడబడింది. అయితే ఈ న్యాయస్థా నం ప్రత్యేకంగా గమనించిన విషయం ఏమిటంటే, చట్టం 2002 లోని సెక్షన్ 45 సాధారణ చట్టం క్రింద గల నేరాలకు ఆకర్షించబడదు, అయితే చట్టం 2002 నేరానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం అభ్యర్దించిన తర్వాత చట్టంలోని సెక్షన్ 45 యొక్క మూలాధారమైన సూత్రాలు మరియు తీవ్రత పట్ల ఆకర్షితులవుతారు, నేర శిక్షాస్మృతి (సి.ఆర్.పి.సి) లోని సెక్షన్ 438 క్రింద దరఖాస్తు ఉన్నప్పటికీ. కాబట్టి, చట్టం 2002 లోని సెక్షన్ 45 లోని నిబంధనలు నేర శిక్షాస్మృతి (సి.ఆర్.పి.సి) లోని సెక్షన్ 438 క్రింద ముందస్తు బెయిల్ దరఖాస్తు లకు వర్తించవన్న ఉన్నత న్యాయస్థా నం పరిశీలనలు డాక్టర్ వి.సి.మోహన్ (పైన పేర్కొనబడినది) కేసులోని నిర్ణయానికి విరుద్దంగా ఉండడమే కాకుండా నికేష్ తారా చంద్ షా (పైన పేర్కొనబడినది) కేసులోని తీర్పు పరిశీలనలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకసారి గనక చట్టం 2002 లోని సెక్షన్ 45 యొక్క తీవ్రత వర్తించే పక్షంలో 1 వ ప్రతివాదికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సవాలు చేయబడిన ఉన్నత న్యాయస్థా నం తీర్పు మరియు ఉత్తర్వు నిలువ జాలరు.
6. ఇంతే కాకుండా, కేసు పూర్వాపరాల (మెరిట్స్) ఆధారంగా కూడా 1 వ ప్రతివాదికి బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థా నం వెలువరించిన తీర్పు మరియు ఉత్తర్వు పొరపాటుతో కూడినది మరియు చెల్లనిది. 1 వ ప్రతివాదికి బెయిల్ మంజూరు చేసే సంధర్బంలో ఉన్నత న్యాయస్థా నం అక్రమ నగదు చలామణి మరియు చట్టం 2002 లోని నేరాల తీవ్రతను, ఆరోపణల స్వభావాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఆరోపణల స్వభావాన్ని గనక పరిశీలించినట్లైతే అక్రమ నగదు చలామణికి సంబంధించిన చాలా తీవ్రమైన ఆరోపణలుగా చెప్పవచ్చు. వీటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముంది. దర్యాప్తు సంస్థ ప్రకారం వారు శ్రీనివాస రాజు మంతెన నుండి అనుచిత లబ్ది పొందిన 1 వ ప్రతివాదికి సంబంధం కలిగించే కొన్ని ఆధారాలను సేకరించారు. ఉన్నత న్యాయస్థా నం భారతీయ శిక్షాస్మృతి (ఐ పి సి) క్రింద సాధారణ నేరానికి సంబంధించినదిగా పరిగణిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు గా సవాలు చేయబడిన తీర్పు మరియు ఉత్తర్వును బట్టి అవగతమవుతుంది. 6.[1] అనుసూచిత (షెడ్యూల్) నేరానికి సంబందించి 1 వ ప్రతివాది పేరు ప్రాథమిక సమాచార నివేధిక (ఎఫ్ ఐ ఆర్) లో పేర్కొనలేదు. మరియు ఇతర నిందితులు విడుదల చేయబడటానికి నిర్దోషులుగా విముక్తు లవడానికి సంబందించి 1 వ ప్రతివాది తరపున వాదనలు వినిపిస్తూ సదరు కారణంగా 1 వ ప్రతివాది పై దర్యాప్తు ను కొనసాగించరాదని నివేదించారు. ఇతర నిందితులు నిర్దోషులుగా విడుదల చేయబడినంత మాత్రాన 1 వ ప్రతివాది పైన దర్యాప్తు కొనసాగించరాదన్న వాదనకి అది ఆధారభూతం కాదు. అనుసూచిత (షెడ్యూల్) నేరాలకు సంబంధించి 1 వ ప్రతివాది పైన విచారణ/దర్యాప్తు కొనసాగుతోంది. అందువల్ల, ఇప్పటి వరకు కొనసాగిన విచారణ/దర్యాప్తు కూడా సరిపోతుంది. 6.[2] ముందస్తు బెయిల్ మంజూరు చేసే సందర్భంలో ఉన్నత న్యాయస్థా నం ప్రభావితం కాబడిన అంశాలు మరియు అది గమనించిన విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:- “పైన పేర్కొన్న న్యాయాత్మక స్థితిని మరియు ప్రస్తు త కేసులోని వాస్తవాలను జాగ్రతగా పరిశీలించినట్లైతే, నేరంలో పిటిషనరు ప్రమేయానికి సంబంధించి 1 వ ప్రతివాదికి సందేహం ఉంది మరియు దానిని బహిర్గతం చేయడానికి అతన్ని పిలుస్తా రని, మరియు అతను ఏదైనా విషయాన్ని బహిర్గతం చేయని పక్షంలో, సహాయ నిరాకరణ సాకుతో, 1 వ ప్రతివాది అతన్ని అరెస్టు చేయడానికి చర్యలు గైకొనవచ్చు. పిటిషనరు దాదాపు 60 సంవత్సరాలు వయసున్న రిటైర్డ్ ఉద్యోగి మరియు హై దరాబాద్ కు చెందిన శాశ్వత నివాసి. ఇంకా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పత్రాలు డిజిటల్ పరికరాలకు సంబంధించి దర్యాప్తు లో అధిక భాగం పూర్తయింది. అందువల్ల ఈ దశలో విచారణను తారుమారు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పిటిషనరు తరపున విద్యావంతుడైన సీనియర్ న్యాయవాది సూచించినట్లు గా, ఇతర నిందితుల పై ఇప్పటికే క్రిమినల్ కేసు దాఖలై భోపాల్ లోని ప్రత్యేక న్యాయస్థా నం లో పెండింగులో ఉందని నివేదించారు. 6.[3] పైన పేర్కొన్న వాస్తవాల దృష్ట్యా, ఉన్నత న్యాయస్థా నం 1 వ ప్రతివాది పైన ఆరోపిత నేరారోపణల స్వభావాన్ని మరియు తీవ్రతను పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. ఈ కోర్టు వెలువరించిన తీర్పులననుసరించి, మరీ ముఖ్యంగా, పి.చిదంబరం కేసు (పైన పేర్కొనబడినది) సమాజం పై ప్రభావం చూపుతున్న ఆర్థిక పరమైన నేరాల విషయంలో నేర శిక్షాస్మృతి (సి.ఆర్.పి.సి) లోని సెక్షన్ 438 ప్రకారం విచక్షణాధికారం అమలు పరచడంలో న్యాయస్థా నం చాలా నియంత్రించుకోవాలి.
7. కేసులోని మొత్తం వాస్తవాలు మరియు పరిస్థితులను పరిశీలించిన పిదప మరియు పైన పేర్కొనబడిన ఉన్నత న్యాయస్థా నం వెలువరించిన కారణాలు చట్టం 2002 లోని సెక్షన్ 45 యొక్క తీవ్రత నేర శిక్షాస్మృతి (సి.ఆర్.పి.సి) లోని సెక్షన్ 438 కింద దరఖాస్తు కు సంబంధించి కూడా వర్తిస్తుంది. అందువల్ల ప్రస్తు త 1 వ ప్రతివాదికి ఎఫ్.నెంబర్ ఈసీఐఆర్/హై జో/36/2020 తేదీ 15.12.2020 కి సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థా నం వెలువరించిన తీర్పు మరియు ఉత్తర్వు సమర్ధనీయం కాదు. పర్యవసానంగా, 1 వ ప్రతివాదికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థా నం వెలువరించిన తీర్పు మరియు ఉత్తర్వు రద్దు చేయబడింది మరియు కొట్టి వేయబడింది. 1 వ ప్రతివాది పట్ల చట్టబద్దంగా వ్యవహరించాలి. ఎది ఏమైనప్పటికీ, 1 వ ప్రతివాది అరెస్టు కాబడిన పిదప అతను సాధారణ బెయిల్ దరఖాస్తు దాఖలు చేసినట్లయితే విచారణ/ దర్యాప్తు లో సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం దానిని పరిశీలించాల్సిందిగా సృష్టీకరించడమైనది. ప్రస్తు త అప్పీలు తదనుసారంగా, అనుమతించడమైనది. ఖర్చులు లేవు.