563fb8c5378e4ec50efddef13f8c61142480fa8f6548dd531f268bf9a54c7e01

High Court of Telangana · 17 Jan 2022
M. R. Sha
Civil Appeals Nos. 1363-1364 of 2023 @ SLP(C) Nos. 9504-9505 of 2022
civil appeal_allowed Significant

AI Summary

The Supreme Court set aside the High Court’s order granting extension of time for payment under a sale agreement, cancelled the agreement under Section 28 of the Specific Relief Act due to unexplained delay, and clarified the strict judicial discretion in granting such extensions.

Full Text
Translation output
ప్రచురణ యోగ్యమైన
భారత సర్వోన్నత న్యాయస్థా నము
సివిల్ అప్పీలు అధికార పరిధి
సివిల్ అప్పీలు నెంబర్లు .1363-1364/2023
(ఎస్.ఎల్.పి.(సి)నెం.9504-9505/2022 )
పి.శ్యామల .....అప్పీలుదారు
మరియు
గుండ్లూ ర్ మస్తా న్ ......ప్రతివాది
తీర్పు
ఎమ్.ఆర్.షా. న్యాయమూర్తి
JUDGMENT

1. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థా నము, హై దరాబాద్ ప్రస్తు త అప్పీలుదారు వేసిన, సి.ఆర్.పి.నెం.2374/2019 మరియు 2304/2019 లలో తేదీ.17-01- 2022 న కొట్టి వేయబడిన సవాలు చేయబడుతున్న తీర్పు మరియు ఉత్తర్వుల వలన వ్యధ చెంది మరియు అసంతృప్తు లై, అసలు రివిజన్ పిటిషనరు ప్రస్తు త అప్పీళ్లను ఎన్నుకొన్నారు.

2. ప్రస్తు త అప్పీళ్ళకు దారి తీసిన వాస్తవాలు క్లు ప్తముగా ఈ క్రింది విధముగా: ప్రస్తు త ప్రతివాది-అసలు వాది, అప్పీలుదారు అసలు ప్రతివాది తల్లిపై – 09-05-2012 తేదీ గల క్రయ ఒప్పందము యొక్క షరతుల ప్రకారం అమలు కొరకు సివిల్ సూట్ నెం.291/2013 వేసెను. క్రయ ఒప్పందములో అప్పీలుదారుని చనిపోయిన తల్లి దావా ఆస్తిని రూ.23,00,000/- అమ్మటానికి అంగీకరించేను. అందులో రూ.8,00,000/- లు బయానాగా వాది చెల్లించెను. 2.[1] విచారణ కోర్టు 12-10-2013 న ఏక పక్ష తీర్పు మరియు డిక్రీలను జారీ చేసెను మరియు 09-05-2012 తేదీ క్రయ ఒప్పందము యొక్క షరతుల ప్రకారం అమలు కొరకు డిక్రీ జారీ చేసెను. దావాలో డిక్రీని జారీ చేస్తూ, విచారణ కోర్టు ప్రతివాది-అసలు వాదిని, మిగతా క్రయ మొత్తము రూ.15,00,000/- లను విచారణ కోర్టు లో రెండు వారాలు లోగా జమ చేయవలెనని అదేశించేను. మిగతా క్రయ మొత్తమును అందుకొని, ప్రతివాది క్రయ దస్తా వేజును అమలు చేయని పక్షంలో, వాదికి, దానిని న్యాయప్రక్రియ ద్వారా నెరవేర్చుకొను స్వేచ్చ కలదని కూడా విచారణ కోర్టు పేర్కొన్నది. అందువలన 12-10-2013 డిక్రీ క్రింద, తీర్పు మరియు డిక్రీ తేదీ.12-10-2013 నుండి రెండు వారాలలోగా రూ. 15,00,000/- లు నాది జమ చేయవల్సియుండును. ఆవిధముగా 12-10-2013 తీర్పు మరియుడిక్రీ ప్రకారం ప్రతివాది అసలు వాది – 12-10-2013 తేదీన లేక ముందుగా మిగతా క్రయ మొత్తము రూ.15,00,000/- చెల్లింపు/జమ చేయవల్సియుండును. కానీ, ప్రస్తు త ప్రతివాది- అసలు వాది, విచారణ కోర్టు ఆదేశించినట్లు గా మిగతా క్రయ మొత్తమును చెల్లించుట/జమచేయుటలో విఫలమయ్యేను. 2.[2] విచారణ కోర్టు తీర్పు మరియు డిక్రీలను జారీ చేసిన 12-10-2013 తేదీ నుండి 853 రోజుల వ్యవధి తరువాత, విచారణ కోర్టు లో సివిల్ ప్రొసీజర్ కోడ్, సెక్షన్ 148 క్రింద (క్లు ప్తముగా సి.పి.సి) మరియు స్పెసిఫిక్ రిలీఫ్ ఏక్టు సెక్షన్ 28 క్రింద, 12-10- 2013 నాటి తీర్పు మరియు డిక్రీల ప్రకారము, 21-10-2013 న లేక ముందుగా, వాది ద్వారా జమ చేయవల్సియున్న మిగతా క్రయ మొత్తమును, కాలా పరిమితి పొడిగింపు కోరుతూ, అసలువాది-ప్రతివాది ఓ.ఎస్.నెం,291/2013 లో ఐ.ఏ.నెం.732/2016 ను దరఖాస్తు ను దాఖలు చేసెను. ఈ దశలో ఏక పక్ష తీర్పు మరియు డిక్రీల తరువాత అప్పీలుదారు-అసలు ప్రతివాది తల్లి 13-01-2015 న మృతి చెందినదనియు, అసలు ప్రతివాది యొక్క చట్టబద్ద వారసులైనందు వలన ప్రస్తు త అప్పీలుదారు రికార్డు లోనికి తీసుకు రాబడ్డా రు. అదే సమయంలో, అప్పీలుదారు అసలు ప్రతివాది యొక్క చట్టబద్ద ప్రతినిధిగా 09-05-2012 నాటి క్రయ ఒప్పందాన్ని, రద్దు చేయవలెనని నిర్దిష్ట, పరిహార చట్టం, 1963 సెక్షన్ 28 క్రింద ఓ.ఎస్.నెం.291/2013 లో ఐ.ఏ.నెం.914/2017 ను దాఖలు చేసెను. 2.[3] విచారణ కోర్టు లోఐ.ఏ.నెం.732/2016 కు మద్దతుగా వాది తాను 01-11- 2013 నుండి 05-01-2014 వరకు, తాను కామెర్ల వ్యాధితో జబ్బు పడినట్లు, మరియు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు మరియు బయటకు వచ్చిన తరువాత కూడా, హై బి.పి (అధిక రక్త పోటు), మధుమేహము (షుగర్) మరియు ఇతర వ్యాధులతో ఇంట్లోనే ఉండిపోయినాడు, వాది యొక్క కేసు కూడా చివరకు 09-06-2016 న న్యాయవాదిని సంప్రదించగా,12-10-2013 నాటి తీర్పు మరియు డిక్రీల గురించి మరియు దానిలోని ఆదేశముల గూర్చి తెలియవచ్చినట్లు ఆయన తెలిపారు. కేసు అందువలన 853 రోజుల జ్యాప్యాన్ని మన్నించవలసిందిగా మరియు మిగతా క్రయ మొత్తమును చెల్లింపుకు సమయం పొడిగించాలని అభ్యర్ధించారు.

2.4. సదరు దరఖాస్తు ను అప్పీలుదారుడు వ్యతిరేకించెను. నిర్ధిష్ట పరిహార చట్టం, సెక్షన్ 28 క్రింద దరఖాస్తు కు మద్ధతుగా అప్పీలుదారుని తరపున వ్యాజ్యమేమంటే, వాది ఉద్దేశ్య పూర్వకం గానే మిగతా క్రయ మొత్తా న్ని చెల్లించ లేదని, నిర్ధిష్ట పరిహారం చట్టం సెక్షన్-28 క్రింద, 09-05-2012 నాటి క్రయ ఒప్పందము రద్దు చేయవల్సియుండును. ఆరోపించబడిన రుగ్మత అబద్ధము మరియు సృష్టించబడిందని కూడా అప్పీలుదారుని వాదన. ఉమ్మడి ఉత్తర్వు ద్వారా 29-06-2019 న విచారణ కోర్టు ఐ.ఎ.నెం.732/ 2016 ను అనుమతించి, ఒక నెలలోగా, డిక్రీ తేది.12-10- 2013 నుండి చెల్లించు తేది వరకు సంవత్సరానికి 18 శాతం చొప్పున వడ్డీతో సహ మిగతా క్రయ మొత్తం రూ.15,00,000/- జమ చేయవలెనని ఆదేశించెను. ఫలితంగా నిర్ధిష్ట పరిహార, చట్టం సెక్షన్-28 క్రింద అప్పీలుదారుడు వేసిన ఐ.ఎ.నెం.914/2017 ను విచారణ కోర్టు కొట్టివేసెను

2.5. ఐ.ఎ.నెం.732/2016 మరియు ఐ.ఎ.నెం.914/2017 లో 29-06- 2019 న విచారణ కోర్టు జారీ చేసిన ఉమ్మడి ఉత్తర్వు వలన వ్యధ చెంది మరియు అసంతృప్తు లైన ప్రస్తు త అప్పీలుదారుడు, ఉన్నత న్యాయస్థా నంలో ప్రస్తు త రివిజన్ పిటిషన్ దాఖలు చేసెను. సదరు రివిజన్ పిటిషన్లలను సవాలు చేయబడిన ఉమ్మడి తీర్పు మరియు ఉత్తర్వుల ద్వారా కొట్టివేసినది. అందువలన ప్రస్తు త అప్పీళ్లు వచ్చినవి దాఖలు చేయబడినవి.

3. కేసు వాస్తవాలు మరియు పరిస్థితులలో, మిగతా క్రయ మొత్తమును జమ చేయుటకు, వ్యవధిని పొడిగించుచూ, అసలు వాది దాఖలు చేసిన దరఖాస్తు ను అనుమతించుట ద్వారాను మరియు నిర్ధిష్ట పరిహార చట్టం, సెక్షన్-28 క్రింద అప్పీలు దారుని ద్వారా దాఖలు చేయబడిన దరఖాస్తు ను కొట్టివేయుట ద్వారా విచారణ కోర్టు తీవ్రమైన పొరపాటు చేసిందని, అప్పీలుదారుని తరపున హాజరైన ప్రాజ్ఞ న్యాయవాది శ్రీ మిధున్ శశాంక్ బలంగా నివేదించారు.

3.1. సిపి.సి. సెక్షన్ 148 మరియు నిర్ధిష్ట పరిహార చట్టం, సెక్షన్-28 క్రింద సొమ్మును జమ చేయుకాల పొడిగింపు దరఖాస్తు దాఖలు చేయుటలో తీవ్రమైన 853 రోజుల జాప్యమున్నదని అతి తీవ్రంగా నివేదించబడినది. 12-10-2013 నాటి తీర్పు మరియు డిక్రీ ప్రకారం, మిగతా క్రయ మొత్తా న్ని డిక్రీదారు ఎందుకు చెల్లించ లేకపోయినది సంజాయిషీ ఇవ్వలేదు మరియు సరియైన కారణాన్ని చూపలేదు లేక మిగతా క్రయ మొత్తా ని చెల్లించుటకు గడువు పొడిగింపు కోరుతూ నిర్ధిష్ట పరిహార చట్టం, సెక్షన్ 28 క్రింద ఎటువంటి దరఖాస్తు చేయలేదని నివేదించబడినది.

3.2. అసలు వాది ప్రకారం కూడా, కామెర్ల వ్యాధితో అనారోగ్యానికి గురియైనట్లు మరియు 01-11-2013 నుండి 2014 వరకు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు గా, అతి తీవ్రతతో నివేదించబడింది. ఆత్వరాత, అధిక(బి‌ పి) రక్తపోటు, మధుమేహం(షుగర్) మరియు ఇతర వ్యాధులతో దాదాపు 2 సంవత్సరములు ఇంటికే పరిమితమైనట్లు చెప్పటం ఏ మాత్రము నమ్మకశ్యం కాదని పేర్కొన్నబడింది. విచారణ కోర్టు జారీ చేసిన తీర్పు మరియు డిక్రీ ప్రకారం, మిగతా క్రయ మొత్తా న్ని జమ చేయుటకు గడువు పోడిగింపు కొరకు దరఖాస్తు వేయుటలో జరిగిన 853 రోజుల తీవ్ర జాప్యమును, నమ్మదగిన సంజాయిషీ లేకుండా విచారణ కోర్టు క్షమించవల్సింది కాదని నివేదించ బడింది. అందువలన, రివిజన్ పిటిషన్లలను కొట్టివేయుటలో ఉన్నత న్యాయస్థా నము చాలా తీవ్రమైన పొరపాటు చేసిందని నివేదించబడినది.

3.3. ఆవిధంగా అసలు వాది 12-10-2013 నాటి ఏకపక్ష తీర్పు మరియు డిక్రీని పొందాడని కూడా అప్పీలుదారుని తరపున హాజరైన ప్రాజ్ఞ న్యాయవాది నివేదించెను. అప్పీలుదారు అసలు ప్రతివాది–తల్లి 13-01-2015 న చనిపోయినట్లు పేర్కొనబడింది. ఆమె చనిపోయే వరకు రూ.15,00,000/- మిగతా క్రయ మొత్తా న్ని జమ చేయుటకు వాది ఎటువంటి ప్రయత్నం చేయలేదు. విచారణ కోర్టు ఆదేశించినట్లు గా మిగతా క్రయ మొత్తా న్ని చెల్లించలేదు లేదా, క్రయ దస్తా వేజు అమలుకు అసలు-వాదిచే ఎటువంటి చర్యలు తీసుకోలేదని నివేదించ బడినది. పైన పేర్కొన్న అసలు-వాది యొక్క ప్రవర్తన, మిగతా క్రయ మొత్తం జమ చేయుటకు గడువు పొడిగింపు పరిహారమునకు అతనిని అనర్హుని చేయునని, మరియు అందువలన 9-5- 2012 నాటి క్రయ ఒప్పందమును నిర్దిష్ట పరిహార చట్టం, సెక్షన్ 28 క్రింద అధికార వినియోగంలో విచారణ కోర్టు రద్దు చేసి ఉండాల్సిందని నివేదించబడింది. ఈ కోర్టు యొక్క వి.ఎస్. పళనిచామి చెట్టియర్ ఫ్రేమ్ వర్సెస్ సి.అలగప్పన్ మరియు ఇంకొకరు (1999) 4 ఎస్.సి.సి.702 (పేరాలు 14, 16 మరియు 17) కేసులోని తీర్పు పై బలంగా ఆధారపడేను.

3.4. న్యాయం కూడా అప్పీలుదారుని పక్షాన వున్నదని కూడా నివేదించబదడినది. 2013 సంవత్సరం నాటి ఏకపక్ష తీర్పు మరియు డిక్రీ, వివాదంలోని వ్యవసాయ భూములు ధరలు రూ.[3] కోట్లకు పెరిగినవి. తీర్పు మరియు డిక్రీ అయినా కూడా తీర్పు మరియు డిక్రీ తేదీ.12-10-2013 నుండి రెండు వారాల సకాలంలోగా రూ.15,00,000/- ల మిగతా మొత్తా న్ని జమ చేయకపోవుట, ఏవిధమైన పొడిగింపు కోరుటకు వాదిని అనర్హుని చేయును మరియు, విచారణ కోర్టు ఆదేశించినట్లు కూడా వాది సిద్ధంగా లేడని మరియు ఒప్పందంలోని తన పాత్రను నిర్వహించుటకు ఒప్పుకొనుట లేదని మరియు అందువలన నిర్దిష్ట పరిహార చట్టంలోని సెక్షన్-28 క్రింద అధికార వినియోగంలో 09-05-2012 నాటి అమ్మకం ఒప్పందమును రద్దు చేయుటకు ఇది ఒక యోగ్యత గల కేసు. 3.[5] పై అభ్యర్ధనలు చేస్తూ మరియు పైన పేర్కొన్న తీర్పుపై ఆధారపడుతూ, ప్రస్తు త అప్పీళ్లను అనుకూలంగా పరిష్కరించాలని ప్రార్ధించబడింది.

4. అసలు - వాది తరపున హాజరౌవుతున్న ప్రాజ్ఞ న్యాయవాది శ్రీ హర్షిత్ తోలియా ప్రస్తు త అప్పేళ్లను వ్యతిరేకించెను. 4.[1] సి‌.పి.‌ సి సెక్షన్ 148 క్రింద మరియు నిర్ధిష్ట పరిహార చట్టం సెక్షన్-28 క్రింద దరఖాస్తు లో విచారణ కోర్టు జారీ చేసిన ఉత్తర్వు స్వభావ రీత్యా వివేచనాత్మకమైనదనియు మరియు విచారణ కోర్టు వాది పక్షములో వివేచనను వినియోగించినపుడు మరియు రివిజన్ పిటిషన్లలను ఉన్నత న్యాయస్థా నంచే కొట్టివేయబడినపుడు, దానిలో ప్రస్తు త కోర్టు జోక్యము చేసుకోరాదని, అసలు వాది తరపున హాజరైన ప్రాజ్ఞ న్యాయవాది శ్రీ తోలియా తీవ్రంగా నివేదించేను. 4.[2] వాది ద్వారా 853 రోజుల జాప్యమును సమృద్ధి గానే వివరణ ఇవ్వబడిందని కూడా నివేదించబడింది. వాది కామెర్ల వ్యాధితో అనారోగ్యమైనట్లు మరియు 1-11- 2013 నుండి 5-1-2014 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు నివేదించబడింది. ఆ తర్వాత తను బటయకు వచ్చిన పిమ్మట అతను అధిక రక్తపోటు మరియు మధుమేహంతో మరియు ఇతర వ్యాధులతో ఇంటికే పరిమితమైనట్లు, వాటికి వైద్య రికార్డు ల మద్దతు ఉన్నది. ఇది సి‌ పి‌ సి సెక్షన్ 148 మరియు నిర్ధిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 క్రింద దరఖాస్తు వేయుటలో జాప్యమును వివరిస్తూ వాది తరపున నివేదించిన వివరణను విచారణ కోర్టు ఆమోదించినదని మరియు ఆతర్వాత విచారణ కోర్టు సమయాన్ని పొడిగించినపుడు మరియు సంవత్సరానికి 18% వడ్డితో రూ.15,00,000/- ల మిగతా క్రయ మొత్తా న్ని జమ/చెల్లింపు చేయాలని వాదిని ఆదేశించగా మరియు అది ఉన్నత న్యాయస్థా నంచే ధ్రు వీకరించబడినదని, దానిలో ప్రస్తు త కోర్టు జోక్యం తగదని నివేదించ బడినది. 4.[3] సమతుల్య కొరకు, రూ.15,00,000/-లను మిగతా క్రయమ మొత్తమును 18% వడ్డితో 12-10-2013 తీర్పు మరియు, డిక్రీ తేది నుండి, వాస్తవంగా చెల్లింపు చేయు వరక జమ చెల్లింపు చేయవలెనని విచారణ కోర్టు వాదిని ఆదేశించెనని నివేదించబడినది. 4.[4] పై నివేదనలు సమర్పించుచూ మరియు కిశోర్ ఘన్ శ్యాంసా పరలేకర్ (డి) చట్టబద్ధ వారసులద్వారా వెర్సస్ బాలాజి మందిర్ సంస్థా న్ మంగ్రూల్ (నాధ్) మరియు ఇంకొకరు (సివిల్ అప్పీల్ నం.3794/2022, 9-5-2022 న పరిష్కరించబడిన) అను ఈ కోర్టు యొక్క ఇటీవలి తీర్పుపై ఆధారపడుతూ, ప్రస్తు త అప్పిళ్లను కొట్టివేయాలని ప్రార్ధించబడినది.

5. మేము సంబంధిత కక్షిదారుల, విద్యావంతులైన న్యాయవాదుల వాదనలను సుదీర్ఘంగా వినినాము. మొదట గుర్తించవలసినది, 12-10-2013 ఏకపక్ష తీర్పు మరియు డిక్రీ ద్వారా, 9-5-2012 అమ్మకం కొరకు ఒప్పందము యొక్క షరతుల ప్రకారం అమలు కొరకు విచారణ కోర్టు డిక్రీ జారీ చేసినది. అమ్మకంకొరకు ఒప్పందములో మొత్తం క్రయ మొత్తము రూ.23,00,000/-, అందులో రూ.8,00,000/- బయానాగా చెల్లించబడింది. 12-10-2013 నాటి ఏకపక్ష తీర్పు మరియు డిక్రీ ద్వారా మిగతా క్రయ మొత్తా న్ని రూ.15,00,000/- పేర్కొన్న తేదీ నుండి జమ/చెల్లింపు రెండు వారాలలోగా చేయాలని వాది ఆదేశించబడినాడు, అది 21-10-2013 న ముగిసినది. మిగతా క్రయ మొత్తా న్ని జమ చేయుటకు సమయం, పొడిగింపు కోరుతూ 853 రోజుల తీవ్ర జాప్యముతో, 07-06-2017/19-06-2017 న సి‌ పి‌ సి సెక్షన్ 148 మరియు నిర్ధిష్ట పరిహార చట్టం సెక్షన్-28 క్రింద ప్రస్తు త దరఖాస్తు వరకు, రూ.15,00,000 ల మిగతా క్రయ మొత్తా న్ని జమ/ చెల్లించుటకు, వాది చర్యలు తీసుకున్నట్లు గా గానీ, లేక 12-10-2013 న విచారణ కోర్టు చే జారీ చేయబడిన తీర్పు మరియు డిక్రీల ప్రకారం క్రయ దస్తా వేజు అమలు కోసం ప్రతివాదిని సంప్రదించినట్లు గా గానీ ఏమీ రికార్డు లో లేదు. జాప్యానికి కారణములు పైన వివరించబడినవి. పైన పేర్కొన్నట్లు గా, వాది ఇచ్చిన వివరణ, తీర్పు మరియు డిక్రీ ప్రకారం మిగతా క్రయ మొత్తా న్ని వాది ఎందుకు చెల్లించలేదో సరియైన చాలినంత వివరణ కాదు, లేక చెల్లింపు చేయుటకు సమయం పొడిగింపు కోరుతూ, సి‌ పి‌ సి సెక్షన్-148 క్రింద మరియు నిర్ధిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 క్రింద, తగిన సమయంలోగా కూడా దరఖాస్తు వేయలేదు. మిగతా క్రయ మొత్తము నిమిత్తం చెల్లించవల్సియున్న సొమ్ముతో, వాది సిద్ధంగా ఉండి వుంటే జమ/చెల్లింపు తర్వాత, అధికార దత్తపత్రము (పవర్ ఆఫ్ అటార్నీ) ద్వారా అతను క్రయ దస్తా వేజును అమలు పర్చుకుని ఉండే వాడు. తగినంత ఎలాంటి వివరణ లేకుండా, విచారణ కోర్టు, అలాంటి 853 రోజుల తీవ్ర జాప్యాన్ని క్షమించి ఉండాల్సింది కాదు.

6. వి.ఎస్.పళనిస్వామి చెట్టి మార్ ఫ్రేమ్ (పైన ఉదహరించిన) కేసులో, ఈ కోర్టు పరిశీలించి, ఒక ఒప్పందము యొక్క షరతుల క్రింద అమలు జారీ చేయుటకు నిబంధనలు అతి కఠినమైనవని తీర్పు చెప్పినది దీనిలో న్యాయమైన అంశాలు కూడా ఉన్నవి. క్రయ ఒప్పందం క్రింద కొనుగోలు దారుడు సరియైన విధంగానే అతను వ్యవహరించినట్లయితే అందులోని అన్ని పరిస్థితులను కోర్టు చూడవల్సిన యుండును. అందువలన మామూలు అంశముగా డిక్రీ షరతులలో, మిగతా క్రయ మొత్తమును చెల్లింపు చేయుటకు కాల పొడిగింపును కోర్టు అనుమతించరాదని గుర్తించినది. డిక్రీ ప్రకారం, మిగతా క్రయ మొత్తమును ఎందుకు చెల్లించలేదో లేక, చెల్లింపు చేయుటకు గడువు పొడిగింపు కోరుతూ నిర్ధిష్ట పరిహార చట్టం సెక్షన్ -28 క్రింద దరఖాస్తు ఎందుకు వేయలేదో డిక్రీ దారుని ఎలాంటి వివరణ లేకుండా డిక్రీదారుని పక్షంలో, విచక్షణాధి కారాన్ని వినియోగించరాదని న్యాయం కోరుతున్నదనియు, మరియు డిక్రీని పాటించుటకు గడువు పొడిగింపు వారికి ఇవ్వరాదని కూడా పరీశీలించబడినది.

7. ప్రస్తు తం, ప్రతివాది తరపున నమ్మక ముంచిన ఈ కోర్టు యొక్క కిషోర్ ఘన్ ష్యామ్ పరాలి కర్ (డి) చట్టబద్ధ వారసుల ద్వారా (పైన పేర్కొన్న)- కేసులోని ఈ కోర్టు తీర్పుకు సంబంధించి ఈ కోర్టు ముందున్న ఈ కేసులో మొత్తం క్రయ మొత్తము రూ.8,78,500/-లు కొనుగోలు దారుడు వెనువెంటనే రూ.7,31,000/- చెల్లించెను. అతను మిగిలిన మొత్తం రూ.1,47,500/-లను రాజీ డిక్రీ తేది నుండి ఒక నెల కాలంలోగా చెల్లించవల్సియుండెను. మిగిలిన మొత్తం రూ.1,47,500/-లు చెల్లించుటలో కేవలం ఐదు రోజు జాప్యము మాత్రమే ఉన్నది. అందువలన, నిర్ధిష్ట పరిహార చట్టం, సెక్షన్ -28 క్రింద అధికార వినియోగంలో మిగిలిన క్రయ మొత్తమును చెల్లించుటకు డిక్రీదారుని పక్షంలో గడువు పొడిగింపును అనుమతించెను. సదరు తీర్పులో, పేరా11 లో, ఈ క్రింది విధంగా పరిశీలించబడినది: “11. నిర్ధేశించిన గడువులోగా కొనుగోలు డబ్బు చెల్లించుటలో అమ్మకందారు లేక కౌలు దారుడు విఫలమైనచో, షరతులపై అమలు కొరకు దావా డిక్రీ అయిన ఎడల, అదే దావాలో, సిరాస్థి యొక్క అమ్మకము లేక కౌలు కొరకు ఒప్పందమును రద్దు ను కోరు హక్కు, ఈ సెక్షన్ అమ్మకం దారునకు లేక కౌలు కిచ్చువారికి హక్కును కలుగచేయును. వేరు న్యాయ ప్రక్రియను ఆశ్రయించ వల్సిన అవసరం లేకుండా, సదరు దావాలో, షరతుల ప్రకారం అమలు డిక్రీ షరతులలో, ఇద్దరు కక్షిదారులకు పూర్తి పరిహారము అందించుటను ఈ సెక్షన్ కోరుతున్నది. అందువలన, డిక్రీ జారీ చేయుటతోనే, షరతుల ప్రకారం అమలు దావా ముగింపుకు రాదు మరియు డిక్రీ జారీయైన తర్వాత కూడా షరతుల ప్రకారం అమలు డిక్రీని జారీ చేసిన కోర్టు ఆ డిక్రీపై నియంత్రణను కలిగి యుండును. సెక్షన్-28, తీర్పు రుణగ్రస్తు నికి –, ఒప్పందము రద్దు కోరుటకు అనుమతించుట కాక, సొమ్ము చెల్లించుటకు గడువు పొడిగింపునకు అనుమతించును ఈ సెక్షన్ క్రింద అధికారము వివేచనా పూర్వకమైనది మరియు కేసులో న్యాయము కోరినట్లైతే కోర్టు ఉత్తర్వును జారీ చేయవల్సియుండును. సమ్మత డిక్రీలో కూడా క్రయ మొత్తము చెల్లింపుకు గడువును పెంచవచ్చననునది కూడా పరిష్కరించబడినది. శ్రీమతి పెరియక్కల్ మరియు ఇతరులు వర్సెస్ శ్రీమతి దాక్షాయినిలో న్యాయమూర్తి చిన్నప్పరెడ్డి మాట్లా డుతూ, ఈ కోర్టు రాజీ డిక్రీలో కూడా, స్పష్టమైన అన్యాయమును నిరోధించుటకు, మరియు నష్టపడిన కక్షిదారునికి జప్తు నిబంధనకు వ్యతిరేకంగా పరిహారము నిచ్చుటకు గడువును పొడిగించవచ్చును. కోర్టు క్రింది వాటిని పరిశీలించినది: “4....... ఏది ఏమైనా, కక్షిదారులు రాజీ కుదుర్చుకుని రాజీ షరతులలో ఉత్తర్వును కోర్టు కు స్వాగతించారు, అది కోర్టు నిర్వర్తించింది. కక్షిదారులు నిర్దేశించిన చెల్లింపు గడువు, కోర్టు ఆమోదించిన గడువుగా మారింది. మరియు ఇది సరియైన వ్యాఖ్యములలో గడువు పెంచుటకు కోర్టు ను అధికార పరిధిని ఇచ్చింది. కేవలం అడిగినంత మాత్రాన, సాధారణంగా గడువు పొదగించబడదు. స్పష్టమైన అన్యాయాన్ని నిరోధిo చుటకు అరుదైన వ్యాఖ్యములలో అది అనుమతించబడును. కక్షిదారుల మధ్య ఒప్పందమును కోర్టు తిరిగి వ్రాయదనునది వాస్తవమే కానీ జప్తు షరతును వ్యతిరేకంగా కోర్టు విముక్తినిచ్చును. మరియు కక్షిదారుల మధ్య ఒప్పందము ఎక్కడైతే కోర్టు ఉత్తర్వులో విలీనమైనాయో, న్యాయ లక్ష్యాన్ని వ్యాప్తి చేయుటలో, కోర్టు యొక్క స్వాత్రంతాన్ని నిశ్శయంగా తగ్గించలేరు. అందువలన, నిర్దిష్టపరిహార చట్టం సెక్షన్ 28 క్రింద అధికారాలు వివేచనా పూర్వకమైనది మరియు ఈ కోర్టు పరిశీలించినట్లు గా న్యాయానికి కావల్సినట్లు గా కోర్టు ఉత్తర్వు జారీ చేయవల్సియుండునని.

8. ఈ కోర్టు పైన పేర్కొన్న తీర్పులో చెప్పిన చట్టా న్ని, ప్రస్తు త కేసులోని వాస్తవాలను అన్యయించుట ద్వారా మరియు నిర్దిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 ను పరిగణించుచూ, వాది పక్షములో వివేచనను వినియోగించుట ద్వారా విచారణ కోర్టు పొరపాటు చేసిందనియు, మరియు మిగతా క్రయ మొత్తమును రూ. 15,00,000/-లు జమ చేయుటకు, 853 రోజుల తీవ్ర జాప్యాన్ని, పైన పేర్కొన్నట్లు ఎలాంటి సరియైన వివరణ లేకుండా, వాది పక్షములో గడువు పొడగించాలని వివేచనను వినియోగించుటలో, పొరపాటు చేసిందనే అభిప్రాయంలో మేమున్నాము. పైన గమనించినట్లు గా, 12-10- 2013 నాటి ఏక పక్ష తీర్పు మరియు డిక్రీ తేదీ నుండి రెండు వారముల కాలం లోగా మిగతా క్రయ మొత్తము జమ చేయవలెనని వాది ఆదేశించబడిన తర్వాత, అట్లు జమ చెల్లించుటలో వాది విఫలమయ్యేను, ఆ తర్వాత సమంజనమైన కాలంలోగా, సి.పి.సి సెక్షన్ 148 మరియు నిర్దిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 క్రింద గడువు పొడిగింపు దరఖాస్తు వేయలేదు మరియు 853 రోజుల తర్వాత వేసెను. తీర్పు మరియు డిక్రీ ప్రకారం మిగితా క్రయ మొత్తా న్ని జమ/చెల్లించిన మీదట, క్రయ ఒప్పందాన్నీ అమలు చేయమని ప్రతివాదికి నోటీసు ఇచ్చినట్లు ఏ ఆధారము లేదు. మిగతా క్రయ మొత్తా న్ని జమ చేయుటకు గడువు పొడగింపు కోరుతూ సి‌ పి‌ సి సెక్షన్ 148 మరియు నిర్ధిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 క్రింద వాది దాఖలు చేసిన దరఖస్తూ నిరాశ కల్గించునంతగా ఆలస్యం చేయబడింది. పైన గమనించినట్లు గా, నిర్దిష్ట పరిహారం, సెక్షన్ 28, షరతుల ప్రకారం ఒప్పందం డిక్రీ షరతులలో, ఇరూ పార్టీలకు సంపూర్ణ ఉపశమనాన్ని ఇవ్వాలని కోరుతున్నది. అందువలన, విచారణ కోర్టు ప్రతివాదికి అనుకూలంగా వివేచన నివేదనతో వినియోగించుటలో విఫలమైంది, మరియు వాది పక్షంలో వివేచనాధికారము వినియోగించుటలో పొరపాటు చేసింది, అది కూడా 853 రోజుల జాప్యములో, హై కోర్టు దానిని నిర్దిష్టము చేయుటలోను మరియు రివిజన్ పిటిషన్లలను కొట్టి వేయుటలోను తప్పిదం చేసెను, పరిస్థితులలో మిగితా క్రయ మొత్తమును జమ చేయుటకు గడువు పొడగింపు కోరుతూ వాది దరఖాస్తు అయిన ఐ‌ ఎ.నెం.732/2016 అనుమతించుచూ విచారణ కోర్టు జారీ చేసిన ఉత్తర్వు కొట్టివేయబడుటకు అర్హమైనది మరియు తేదీ 09.05.2015 గల అమ్మకం ఒప్పందంను రద్దు చేయాలని ప్రతివాది-అప్పీలుదారు, నిర్ధిష్ట పరిహార-చట్టం సెక్షన్ 28 క్రింద వేసిన ఐ‌ ఏ నెం.914/2017 అనుకూలంగా స్వీకరించుటకు అర్హమైనది. కానీ, అదే సమయంలో, ఇరు కక్షిదారుల మధ్య సమతుల్యత కొరకు, వాది, బయానాగా చెల్లిo చిన రూపాయలను 8,00,000/- సోమ్మును నేటి నుండి ఆరు వారాల లోగా, 9-5-2012 నుండి చెల్లించు వరకు సంవత్సరానికి 12% వడ్డీతో వాదికి తిరిగి ఇవ్వవలెను అట్లు చెల్లించని యెడల సంవత్సరానికి 18% వడ్డీతో చెల్లించాలి.

9. పైన పేర్కొన్న కారణాల దృష్ట్యా ఈ రెండు అప్పీళ్ళు విజయవంతమైనాయి రివిజన్ పిటిషన్లలను కొట్టివేస్తు హై కోర్టు జారీ చేసిన 17.01.2022 తేదిన సవాలు చేయబడిన ఉమ్మడి తీర్పు మరియు ఉత్తర్వు, మరియు 853 రోజుల తీవ్ర జాప్యముతో గడువు పొడిగింపు కోరుతూ వాది దాఖలు చేసిన ఐ‌ ఏ నెం.732/2016 ను అనుకులంగా స్వీకరించుచు 29.06.2019 న విచారణ కోర్టు జారీచేసిన ఉమ్మడి ఉత్తర్వు క్రయం కొరకు తేదీ 09.5.2012 ఒప్పందమును రద్దు చేయమని ప్రతివాది యొక్క ఐ‌ పినెం.914/2017 లు ఇందు మూలంగా తిరస్కరించ బడినవి మరియు రద్దు చేయబడినవి. వాది ద్వారా సి‌ పి‌ సి సెక్షన్ 148 మరియు నిర్దిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 కింద, 853 రోజుల తీవ్ర జాప్యముతో, మిగితా క్రయ మొత్తమును జమ చేయుటకు గడువు పొడిగింపు కోరుతూ దాఖలు చేసిన ఐ.ఏ.నెం.732/2016 కొట్టి వేయబడినది. 12-10-2013 నాటి ఏకపక్ష తీర్పు మరియు డిక్రీ తేదీ నుండి వాది ద్వారా రెండు వారాల కాలంలోగా జమ చెల్లించవలసి యుండి, మిగతా క్రయ మొత్తము చెల్లించక/జమ చేయకపోయిన మీదట అప్పీలుదారు-ప్రతివాది, నిర్దిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 క్రింద 09-05-2012 తేదీ గల క్రయం కొరకు ఒప్పందమును రద్దు చేయవలెనని దాఖలు చేసిన ఐ.ఏ.నెం.914/2017 అనుకూలంగా స్వీకరించబడినది. నిర్దిష్ట పరిహార చట్టం సెక్షన్ 28 క్రింద అధికార వినియోగములో 09-05-2012 తేదీ క్రయం కొరకు ఒప్పందమును రద్దు చేయబడినది. కానీ, రూ.8,00,000/- సొమ్మును, నేటి నుండి ఆరు వారాలలోగా 09-05-2012 నుండి అసలు చెల్లింపు వరకు, 12% వడ్డితో వాదికి చెల్లించాలని, అప్పీలుదారుడు ఇందుమూలముగా ఆదేశించ బడినాడు, చెల్లించుటలో విఫలమైన ఎడల దానిపై సంవత్సరానికి 18% వడ్డితో చెల్లించవలెను.

18,323 characters total

10. పైన పేర్కొన్న షరతులలో ప్రస్తు త అప్పీళ్ళు, ఆ ప్రకారంగా అనుకూలమముగా స్వీకరించబడినవి. ఖర్చులు లేవు.