Full Text
భారత దేశ సర్వోన్నత న్యాయస్థా నము
క్రిమినల్ అప్పీలు అధికార పరిధి
క్రిమినల్ అప్పీలు నెంబరు.1198/2023
(స్పెషల్ లీవ్ పిటిషన్ (క్రిమినల్) నెంబరు.1655/2023 నుంచి ఉత్పన్నమైనది)
సంజయ్ రఘునాథ్ అగర్వాల్ ..... అప్పీలుదారు
వర్సెస్
ది డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ ...... ప్రతివాది
తీర్పు
పంకజ్ మిత్తల్, న్యాయమూర్తి.
JUDGMENT
1. అనుమతి మంజూరైనది.
2. పార్టీల తరపున సీనియర్ న్యాయవాది శ్రీ ఆర్.బసంత్ మరియు విద్యావంతుడైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎ.ఎస్.జె) శ్రీ యస్. వి.రాజు వాదనలను వినిపించారు.
3. అప్పీలుదారుతో సహ ఆరుగురిపై సైబరాబాద్ పోలీసు ఠాణాలో భారత శిక్షాస్మృతి (ఐ పి సి) సెక్షన్లు 406, 407, 415 నుంచి 420, 120 బితో చదువబడు సెక్షన్ 34 క్రింద నేరాలకు గాను క్రిమినల్ కంప్లైంట్, ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ ఐ ఆర్) నెంబరు.664/2013 నమోదైంది. మైస్సర్స్ ఫార్మాక్స్ ఇండియా లిమిటెడ్ (ఇందులో ఇక మీదట ఫార్మాక్స్ గా పేర్కొన బడుతుంది ‘ ’ ) అనే పేరు గల కంపెనీ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న ఎం.శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ ఐ ఆర్) నమోదైంది. ఆ ఫిర్యాదు కథనం ప్రకారం.... 71.09 మిలియన్ అమెరికన్ డాలర్ లను (యు.యస్.డి) ప్రస్తు త భారత కరెన్సీ (ఐ.ఎన్.ఆర్)లో 318 కోట్ల రూపాయలకు సమానమైన గ్లోబల్ డిపాజిటరీ రసీదులను (జీ.డి.ఆర్) సమీకరించడంలో నిందితుని సేవలను ఫార్మాక్స్ పొందినదని; నిందితుడు సదరు మొత్తా న్ని సమీకరించనప్పటికీ, అతను కేవలం 0.[4] మిలియన్ అమెరికన్ డాలర్ లను (యు.యస్.డి) ప్రస్తు త భారత కరెన్సీలో (ఐ.ఎన్.ఆర్) 2.20 కోట్ల రూపాయలకు సమానమైన మొత్తా న్ని మాత్రమే ఫార్మాక్స్ కు బదిలీ చేశారని; మరియు బ్యాంకులో విచారించగా కుదవ పెట్టిన పత్రాల ఆధారంగా సంతకాలను ఫోర్జరీ చేయడం ద్వారా నిందితుడు మిగిలిన మొత్తా న్ని దుర్వినియోగ పరచినట్టు ఫిర్యాది కంపెనికి తెలిసింది.
4. శిక్షాస్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) 1973, సెక్షన్ 156(3) కింద రంగారెడ్డి జిల్లా మేడ్చల్, సైబరాబాద్ లోని 6 వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాల కనుగుణంగా పైన పేర్కొనబడిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ ఐ ఆర్) నమోదు చేయబడిందని ఇక్కడ పేర్కొనడం సముచితం.
5. ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ ఐ ఆర్) నమోదు చేసి తొమ్మిదేళ్లు గడిచినా ఇంత వరకు తుది నివేదిక దాఖలు కాలేదు. అయితే ఫార్మాక్స్ జి.డి.ఆర్. సమీకరించే విషయం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సంక్షిప్తంగా సెబీ ‘ ’) ద్వారా విచారణాంశము అయింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం, 1992 మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిసెస్ రిలేటింగ్ టు సెక్యూరిటీస్ మార్కెట్) రెగ్యులేషన్స్ 2003 లోని వివిధ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గా సెబీ 14-07-2020 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. మరీ ముఖ్యంగా, మోసపూరిత పథకాలకు సంబంధించి ఒకే విధంగా 14 జి.డి.ఆర్ అంశాల ద్వారా భారతీయ పెట్టు బడి దారులను తప్పుదోవ పట్టించి నందుకు అరుణ్ పంచారియాను మరికొందరిని సెబీ దొషులుగా గుర్తించింది.
6. పైన పేర్కొన్న దానికి అనుగుణంగా, నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పి.ఎం.ఎల్.ఏ), 2002 (సంక్షిప్తంగా పి.ఎం.ఎల్.ఏ) సెక్షన్ 3 కింద నగదు అక్రమ చలామణి నేరానికి పాల్పడినట్లు అనుమానించిన ఆరుగురు వ్యక్తు లను, తొమ్మిది సంస్థలను పేర్కొంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ.సి.ఐ.ఆర్. నెంబరు. హై జో/26/2022 తేది.05-05-2022 న సమాచార నివేదికను దాఖలు చేసింది.
7. ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ ఫర్ మేషన్ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 26-09-2022 తేదీన అప్పీలుదారును అరెస్టు చేసింది. అప్పీలుదారునికి రిమాండ్ విధిస్తూ, కస్టడికి అప్పగిస్తూ జ్యుడీషియల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హై దారబాద్ 27-09-2022 తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయస్థా నం కూడా అప్పీలుదారును 6 రోజులు అనగా 06-10-2022 నుంచి 11-10-2022 వరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతించింది.
8. ఆ తరువాత, నలుగురు వ్యక్తు లు మరియు రెండు సంస్థలపై అనగా (i) శ్రీ సంజయ్ అగర్వాల్, (ii) శ్రీ మోర్తా ల మల్లా రెడ్డి, (iii) శ్రీ అరుణ్ పంచారియా, (iv) శ్రీ ముఖేష్ చౌరాడియా (v) శ్రీ సంజయ్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహిస్తు న్న మెస్సర్స్ లా రీ చేస్సే అడ్ వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు (vi) శ్రీ అరుణ్ పంచారియా ప్రాతినిధ్యం వహిస్తు న్న మెస్సర్స్ వింటేజ్ ఎఫ్ జెడ్ ఈ, యూఏఈ, వీటిపై పీ.ఎం.ఎల్.ఏ సెక్షన్లు 44 మరియు 45 కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభియోగం దాఖలు చేసింది. ఫిర్యాదులోని సారాంశం ఈ విధంగా ఉంది. 71.09 మిలియన్ అమెరికన్ డాలర్ లను (యు.యస్.డి) ప్రస్తు త భారత కరెన్సీ (ఐ.యన్.ఆర్)లో 318 కోట్ల రూపాయలకు సమానమైన జి.డి.ఆర్.లను సమీకరించడంలో ప్రస్తు త అప్పీలుదారు మరియు ఇతర నిందితుల సేవలను ఫార్మాక్స్ వినియోగించుకుంది. 05-05-2020 తేదీ నాటి రుణ ఒప్పందం ప్రకారం, యురామ్ బ్యాంకు నుండి రుణాన్ని పొందిన తర్వాత, అరుణ్ పంచారియా యొక్క సంపూర్ణ యాజమాన్య సంస్థ అయిన వింటేజ్ ఎఫ్.జెడ్.ఈ ఒకటియే ఈ.జీ.డీ.ఆర్ లకు సభ్యత్వాన్ని పొందింది; యురామ్ బ్యాంక్ మంజూరు చేసిన రుణాన్ని పొందడానికి మొత్తం ఆదాయాన్ని కుదువ పెడుతామని హామీ ఇస్తూ ఫార్మాక్స్ యురామ్ బ్యాంక్ కు కుదువ ఒప్పందం రాసి ఇచ్చింది; ఫార్మాక్స్ జీ.డీ.ఆర్ లను జారీ చేసినప్పటికీ, వచ్చిన ఆదాయం భారత దేశంలో ఫార్మాక్స్ క్రెడిట్ కు జమ చేయబడలేదు, ఎందుకంటే అవి పూచీకత్తు గా వుంచబడ్డ కారణంగా. వింటేజ్ ఎఫ్.జెడ్.ఈ లోన్ లో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి చెల్లించింది, మరియు, అందువల్ల, ఫార్మాక్స్ కు బ్యాలెన్స్ మొత్తం మాత్రమే విడుదల చేసింది; ఈ నిధుల మళ్లింపు వల్ల ఫార్మాక్స్ కు 15.60 మిలియన్ అమెరికన్ డాలర్ల (యు.యస్.డి) నష్టం వాటిల్లింది; జీ.డీ.ఆర్ లు ఆ తర్వాత ఈ క్విటీ షేర్లు గా మార్చబడి భారతీయ స్టా క్ మార్కెట్లో విక్రయించబడ్డా యి; జీ.డీ.ఆర్స్ కోసం వెళ్లవల్సిందిగా అప్పీలు దారు సలహా ఇచ్చినందు వల్ల, జీ.డీ.ఆర్ మొత్తా నికి ఫార్మాక్స్ కు అర్హత లేదు; అందువల్ల ప్రస్తు త అప్పీలుదారు మరియు అతనికి చెందిన సంస్థ ప్రతి వాదనను సమన్వయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది; అప్పీలు దారు మొత్తం నాటకంలో ప్రధాన పాత్రధారి; అప్పీలుదారు తగిన అర్హతలు కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ మరియు జీ.డి.ఆర్ లకు సంబంధించిన స్టా క్ ఎక్స్ఛేంజ్ ఫైల్స్ లో పని చేసిన అనుభవం గల వ్యక్తి; అప్పీలుదారుని శ్రీనివాస్ రెడ్డికి అరుణ్ పంచారియా పరిచయం చేశాడు; మరియు అప్పీలుదారు ఇంకా ఇతరులు నగదు అక్రమ, చలామణి (మనీ లాండరింగ్) నేరానికి పాల్పడ్డా రు.
9. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకారం, మోసపూరిత జీ.డీ.ఆర్ సమస్యను తీసుకురావడానికి ఫార్మాక్స్ మరియు అరుణ్ పంచారియా కోసం మొత్తం మౌలిక సదుపాయాలను సృష్టించడానికి అప్పీలుదారు బాధ్యుడు మరియు బోర్డు తీర్మానాల కోసం అప్పీలుదారు విధి విధానాలను సమకూర్చాడని మరియు యురామ్ బ్యాంక్ లోని ఫార్మాక్స్ ఖాతా నుండి యుఎఇలోని ఫార్మాక్స్ అనుబంధ సంస్థ, అనగా, మెస్సర్స్ ఫార్మాక్స్ ఇంటర్నేషనల్ ఎఫ్.జెడ్ ఈకు నిధులను బదిలీ చేయడంలో కూడా సహాయ పడ్డా డు.
10. పైన తెలిపిన వాస్తవాల దృష్ట్యా విద్యావంతుడైన సీనియర్ న్యాయవాది శ్రీ.ఆర్. బసంత్ వాదనలను వినిపిస్తూ (i) ఈ నేరానికి సంబంధించి తనపై ఏ విధమైన అభియోగ పత్రం (చార్జ్ షీట్) దాఖలవ్వకుండానే అప్పీలుదారు 26-09-2022 నుంచి తొమ్మిదేళ్లు గా జైలులోనే మగ్గుతున్నాడు; (ii) ఈ నేరానికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి ప్రోద్భలంతో 2013 లో అభియోగ పత్ర o నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అతన్ని కూడా అరెస్ట్ చేసింది. అయితే అతని రిమాండు కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన దరఖాస్తు ను ఉన్నత న్యాయస్థా నం తిరస్కరించింది; (iii) అప్పీలుదారు వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంటు మరియు అతను వృత్తిపరమైన విధులను చట్టబద్ధంగా మాత్రమే నిర్వహించాడు; మరియు (iv) అప్పీలుదారు నేర పక్రియ కలిగి ఉన్నట్టు గా చూపించడానికి ప్రాసిక్యూషన్ “ ” ఫిర్యాదులో ఏమి లేదని విన్నవించారు.
11. అయితే విద్యావంతుడైన అదనపు సొలిసిటర్ జనరల్ శ్రీ ఎస్. వి. రాజు వాదనలను వినిపిస్తూ... (i) సమస్త లావాదేవీల వెనుక వ్యూహం పన్నిన కీలక వ్యక్తి అప్పీలుదారుడని; మరియు (ii) పి.ఏం.ఎల్.ఎ సెక్షన్ 45 లో నిర్దేశించిన రెండు షరతుల దృష్ట్యా బెయిలు పిటిషన్ కొట్టివేయడానికి అర్హమైనది.
12. ప్రత్యర్థి వాదనలను జాగ్రత్తగా పరిశీలించాము.
13. పి.ఏం.ఎల్.ఎ సెక్షన్ 45 విషయానికి సంబంధించిన అంశం తర్కబద్ధంగా ఉండడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో అప్పీలుదారుకు నిర్ణయించిన నిర్దిష్ట పాత్రను తప్పనిసరిగా చూడవలసిన అవసరమన్నది విద్యావంతుడైన అదనపు సొలిసిటర్ జనరల్ యొక్క ప్రధాన వాదన. ప్రాసిక్యూషన్ పిర్యాదులోని 8 వ పేరాలో సంబంధిత భాగం ఈ కింద విధంగా ఉంది: “పి.ఏం.ఎల్ఏ సెక్షన్ 3 ప్రకారం నగదు అక్రమ చలామణి (మనీలాండరింగ్) నేరంలో నిందితుల, సహనిందితుల నిర్దిష్ట పాత్ర: శ్రీ సంజయ్ అగర్వాల్ (ఎ-1) పాత్ర:- ఎ) సంజయ్ అగర్వాల్ హామీల ఆధారంగా మెస్సర్స్ ఫార్మాక్స్ ఇండియా లిమిటెడ్ జి.డి.ఆర్ లిస్టింగ్ కోసం ప్రణాళికలతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ సమయంలో మెసర్స్ ఫార్మాక్స్ ఇండియా లిమిటెడ్ 72.20 మిలియన్ జి.డి.ఆర్ కు అర్హత లేదు. సంజయ్ అగర్వాల్ మరియు మెస్సర్స్ లారిచెస్ నితీష్ బంగేరాతో కలిసి సమర్పణకు సమన్వయం చేస్తూ ప్రధాన పాత్ర పోషించారు. సంజయ్ అగర్వాల్ లీడ్ అరేంజర్ (ప్రాస్పెక్ట్ క్యాపిటల్) మరియు కంపెనీ లీగల్ అడ్వయిజర్ (ఫాక్స్ మండల్)తో సహ పాల్గోనే వారందరిని నిర్ణయించారు. ఫాక్స్ మండల్ ఫార్మాక్స్ కు న్యాయవాదిగా వ్యవహరించినప్పటికి, లక్సెంబర్గ్ ఎక్స్చేంజ్ లో దాఖలు చేయాల్సిన లిస్టింగ్ ప్రాస్పెక్టస్ (ప్రాస్పెక్టస్) మరియు యుక్త సావధాన నివేదికను తయారు చేయడానికి దాని పాత్ర పరిమితమయిందని ఈమెయిల్ కమ్యూనికేషన్లు సూచిస్తు న్నాయి. బి) సంజయ్ అగర్వాల్ వివిధ భాగస్వాములతో దాదాపు అన్ని కమ్యూనికేషన్లకు మధ్యవర్తిగా వ్యవహరించారు మరియు సమర్పణకు ముందు మరియు తర్వాత మెసర్స్ ఫార్మాక్స్ ఇండియా లిమిటెడ్ కు సూచనలను చేశారు. అయినప్పటికి ఫార్మాక్స్ కు సూచనలు చేసిన వారిలో అగర్వాల్ కీలక వ్యక్తి కాగా, మోర్తా లా శ్రీనివాస్ రెడ్డి యథోచితంగా దాన్ని అనుసరించారు. (ఎ-1) అర్హతలున్న చార్టెడ్ అకౌంటెంట్ కావడం, జి.డి.ఆర్ లకు సంబంధించిన స్టా క్ ఎక్స్చెంజ్ ఫైలింగ్స్ లో పని చేసిన అనుభవం ఉంది మరియు అరుణ్ పంచారియా ద్వారా ఫార్మాక్స్ లిమిటెడ్ ఎం.డి శ్రీ.ఏం. శ్రీనివాస్ రెడ్డికి పరిచయం చేయబడ్డా రు. డిపాజిటరీ, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ముందు (ఎ-1) అరుణ్ పంచారియా యొక్క సంస్థ ప్రాస్పెక్ట్ క్యాపిటల్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా మరియు యురామ్ బ్యాంక్ తో ఉన్న సంబంధం గురించి బాగా తెలిసి వుండడంతో జి.డి.ఆర్ ద్వారా వెళ్లే అన్ని కంపెనీలు ఆ ప్రత్యేక బ్యాంకు లో ఖాతా తెరవాలని పట్టు బట్టా రు, జి.డి.ఆర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవడానికి అరుణ్ పంచారియా మరియు కంపెనీ ప్రమోటర్ల మధ్య ఏర్పాటు గురించి (ఎ 1 కు) బాగా తెలియడంతో చందాదారుల జాబితాను అహ్మదాబాద్ స్టా క్ ఎక్స్చేంజ్ కి సమర్పించకుండా ఉద్ధేశపూర్వకంగా దాచి పెట్టడం ద్వారా సమర్పణ సమన్వయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు, అందువల్ల దాని కొనుగోలుతో సహా నేరం యొక్క ఆదాయంతో సంబంధమున్న ప్రక్రియ మరియు కార్యకలాపాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు మరియు అందువల్ల పి.ఏం.ఎల్.ఎ, 2002 సెక్షన్ 3 కింద నిర్వహించబడిన ప్రకారం సదరు నగదు అక్రమ చలామణి (మనీలాడరింగ్) నేరానికి పాల్పడ్డా రు మరియు పి.ఏం.ఎల్.ఎ 2002 సెక్షన్ 4 కింద శిక్షార్హులు."
14. అప్పీలుదారు పైన నిర్ణయించిన నిర్దిష్ట పాత్రను దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పుడు పైన అంగీకరించబడిన వాస్తవాలు మరియు వినిపించిన వాదనల వైపు మరలుదాం. మొదటగా, కింద విధంగా ఉన్న వాస్తవాలు గురించి ఎటువంటి వివాదము లేదు:- (i) ఈసిఐఆర్ నమోదు మరియు 2022 సంవత్సరంలో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు పరచడం ఈ నేరానికి సంబంధించి అభియోగ పత్రం (ఎఫ్ఐఆర్) నమోదుకూ కొనసాగింపు, గతంలో 2013 సంవత్సరంలో, ఫార్మాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదన పైన మరియు, ఇంకా, 2020 వ సంవత్సరంలో సెబీ వెలువరించిన ఉత్తర్వుకు కొనసాగింపుగా...; (ii) ఈ నేరానికి సంబంధించి గత తొమ్మిదేళ్లు గా అభియోగ పత్రం (ఎఫ్ ఐ ఆర్) లో తుది నివేదిక దాఖలు చేయలేదు; (iii) ఈ నేరానికి సంబంధించి అభియోగ పత్రం (ఎఫ్ఐఆర్)లో వాస్తవిక ఫిర్యాది ఎం.శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈ.సి.ఐ.ఆర్ కు సంబంధించి నిందితునిగా అరెస్టు చేయాలని కోరగా, రిమాండు కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ నివేదించిన దరఖాస్తు తిరస్కరించ బడింది; (iv) అప్పీలుదారు వృత్తిరీత్యా ఛార్టెడ్ అకౌంటెంట్ మరియు 26.09.2022 తేదీ నుండి అతను జైలులో ఉన్నారు; మరియు (v) ముందున్న పేరాలో పేర్కొనబడిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదు 8 వ పేరాలోని సంబంధిత భాగం, పి.యం.యల్ ఏ సెక్షన్ 45, సబ్- సెక్షన్ (1) క్లా జు (ii) లోని రెండవ నిబంధన చట్టబద్ధ వాదనకు అవకాశమిస్తుంది. అందువల్ల, అప్పీలుదారుని నిరంతర నిర్బంధం, మా అభిప్రాయం ప్రకారం, సమర్థనీయం కాదు.
15. అయితే, అప్పీలుదారు బెయిలుపై విడుదలైన పక్షంలో, అతను న్యాయానికి భయపడి తప్పించుకునే ఉద్దేశంలో (ఫ్లైట్-రిస్క్ ) దేశాన్ని విడిచి పారిపోయే ముప్పు ఉందన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ ఆందోళన విషయంలో సముచిత షరతుల విధింపుతో జాగ్రత్త పడవచ్చు.
16. పైన తెల్పిన కారణాల దృష్ట్యా, అప్పీలు అనుమతించడమైనది మరియు హై దరాబాద్ నాంపల్లి లోని పి ఏం ఎల్ ఏ పరిధిలోని మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జీ – సహితమైన - ప్రత్యేక కోర్టు విధించే నియమ నిబంధనలకు లోబడి 05-5-2022 తేదీ నాటి ఈ.సి.ఐ.ఆర్ నెంబరు హై జో/26/2022 లో అప్పీలు దారును బెయిలుపై విడుదల చేయవలసిందిగా తీర్పు చేయడమైనది. అయితే ప్రత్యేక న్యాయస్థా నం విధించబోయే షరతులు ఈ కింద అదనపు షరతులను కూడా కలిగి వుంటాయి: (i) అప్పీలుదారు తన ప్రయాణ పత్రం (పాస్ పోర్ట్ ) ను ప్రత్యేక న్యాయస్థా నం ముందు అప్పగించాలి; మరియు (ii) ఈడి దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును విచారణకు వచ్చినప్పుడల్లా (పోస్ట్ చేసినపుడల్లా ) అప్పీలుదారు క్రమం తప్పకుండా ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాలి. పైన పేర్కొన్న నిబంధనల ననుసరించి అప్పీలు అనుమతించడమైనది. ఖర్చులు లేవు.