Full Text
భారత దేశ సర్వోన్నత న్యాయస్థా నము
నేర విచారణ అప్పీలు అధికారపరిధి
క్రిమినల్ అప్పీల్ నంబర్ 1401/2023
డైరెక్ట్ రేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ ... అప్పీలుదారు(లు)
వర్సెస్
ఆదిత్య త్రిపాఠి ...ప్రతివాది(లు)
సహితంగా
క్రిమినల్ అప్పీల్ నంబర్ 1401/2023
తీర్పు
ఎం .ఆర్.షా, జె
JUDGMENT
1. క్రిమినల్పిటిషన్ నంబర్లు 1146/2021 మరియు 1147/2021 లో తెలంగాణ హై కోర్టు సంబంధిత 1 వ ప్రతివాది దాఖలు చేసిన బెయిలు దరఖాస్తు లను అనుమతిస్తూ నగదు అక్రమచలామణి వ్యతిరేక చట్టం, 2002 (ఇందులో ఇకమీదట పీ “.యం.యల్ యాక్ట్”, 2002'గా పేర్కొనబడుతుంది) కు సంబంధించి శిక్షార్హమైన నేరాలకు గాను మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి, హై దరాబాదు ద్వారా హై దరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ ఎఫ్.నంబర్/ఈ.సి.ఐ.ఆర్ /హై జో /36/2020 లో దర్యాప్తు చేసిన కేసులో సంబంధిత 1 వ ప్రతివాదిని బెయిలు పై విడుదల చేయాల్సిందిగా వెలువరించిన తీర్పు(లు), ఉత్తర్వు(లు) పట్ల బాధపడుతూ అసంతృప్తితో డైరెక్ట్ రేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ ప్రస్తు త అప్పీళ్లు దాఖలు చేశారు.
2. 20 మంది వ్యక్తు లను/కంపెనీలను భారతీయ శిక్షాస్మృతి(ఐపీసి) సెక్షన్లు 120-బి, 420,468 మరియు 471, సమాచార సాంకేతిక శాస్త్ర చట్టం, 2000 సెక్షన్ 66 మరియు అవినీతి నిరోధక చట్టం, 1988 సెక్షన్ 13(2) తో పాటు సెక్షన్ 7(సి) లకు సంబంధించిన నేరాలకు గాను నిందితులుగా పేర్కొంటూ ఆర్థిక నేరాల విభాగం, భోపాల్, 10.04.2019 తేదీన ప్రథమ సమాచారనివేదిక (ఎఫ్ ఐ ఆర్)నెం.12/2009 ను నమోదు చేసింది. అయితే, మధ్యప్రదేశ్ వాటర్ కార్పోరేషన్ కు చెందిన రూ 1769.00 కోట్ల విలువైన మొత్తం పనులకు సంబంధించి ఈ టెండర్ 91,93 మరియు 94 నంబర్లను మెసర్స్ జీ.వీ.పీ.ఆర్ ఇంజినీర్స్ లిమిటెడ్, మెసర్స్ ది ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ మరియు మెసర్స్ ఐ యం సీ (సిక్-స్పష్టత అవసరం) ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ లను కనిష్ఠ కౌలందార్లు గా చేయడానికి ఈ టెండర్ ను ట్యాంపర్ చేయబడినట్లు గా ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయబడిన తర్వాత, ఆర్థిక నేరాల విభాగం, భోపాల్ దర్యాప్తు జరిపి సంబంధిత కోర్టు లో 4.7.2019 తేదీన అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఆ అభియోగ పత్రాన్ని పరిశీలించగా, నిందితులు పీ.యం.యల్ యాక్టు 2002 కింద కూడా నేరాలకు పాల్పడినట్టు తేలింది, అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు గా, అనగా, భారతీయ శిక్షాస్మృతి (ఐ.పీ.సి) సెక్షన్లు 120-బి, 420, 468 మరియు 471 ఇంక పీ.సీ చట్టంలోని సెక్షన్ 13(2) తో పాటు సెక్షన్ 7 కూడా షెడ్యూల్డు నేరాలు కావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్, హై దరాబాద్ ఎఫ్ నంబర్ ఈ.సీ.ఐ.ఆర్ (హై జో) 36/ 2020 లో నగదు అక్రమ చలామణి దర్యాప్తు ను ప్రారంభించింది. సంబంధిత అప్పీళ్లలో సంబంధిత 1 వ ప్రతివాదిని 19.01.2021 తేదీన అరెస్టు చేశారు, అందువల్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ చేస్తు న్న పైన పేర్కొనబడిన దర్యాప్తు కు సంబంధించి తమను బెయిలు పైన విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వులివ్వాలని అభ్యర్థిస్తూ వాళ్ళు ప్రస్తు త బెయిలు దరఖాస్తు లను హై కోర్టు లో దాఖలు చేశారు. సవాలుచేయిబడిన ఉత్తర్వులలో, సంబంధిత అప్పీళ్లలో 1 వ ప్రతివాదిని బెయిలుపైన విడుదల చేయాలని హై కోర్టు ఆదేశించింది.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్, హై దరాబాద్ దర్యాప్తు చేస్తు న్న కేసులో బెయిలుపై ఆయాసంబంధిత అప్పీళ్లలో 1 వ ప్రతివాదిని బెయిలు పైన విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తూ జారీ చేసిన ఆదేశాలు ప్రస్తు త అప్పీళ్లలోని అంశాలు.
3. అప్పీలుదారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ తరపున విద్యావంతుడైన – అదనపు సొలిసిటర్ జనరల్ (ఎ యస్ జీ ) శ్రీ కె.ఎం. నటరాజ్ మరియు సంబంధిత 1 వ ప్రతివాది తరపున విద్యావంతులైన సీనియర్ న్యాయవాదులు శ్రీ రాకేష్ ఖన్నా మరియిఊ శ్రీ అమన్ లేఖీ హాజరయ్యారు. 3.[1] ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ తరపున విద్యావంతుడైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎ.యస్.జీ) శ్రీనటరాజ్ వాదనలను వినిపిస్తూ కేసులోని వాస్తవాలు మరియు పరిస్థితుల దృష్ట్యా సంబంధిత 1 వ ప్రతివాది-నిందితుడిని బెయిలుపై విడుదల చేయడంలో హై కోర్టు తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని నివేదించారు. సంబంధిత 1 వ ప్రతివాది- నిందితుడిని బెయిలుపై విడుదల చేసి సందర్భంలో హై కోర్టు పి యం యల్ చట్టం, 2002 సెక్షన్ 45 విషయంలో సముచిత రీతిలో అవగాహనకు రాలేకపోయిందని నివేదించారు. 3.[2] ఇంకా వాదనలు వినిపిస్తూ, పి.ఎం.యల్ యాక్ట్ 2002 కింద నేరాలు షెడ్యూల్డు నేరాలైనప్పటికీ హై కోర్టు సదరు నేరాలు తీవ్రతను సముచితంగా అంచనా వేయలేకపోయిందన్నారు. 3.[3] దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం దాఖలైందన్న కారణంగా హై కోర్టు 1 వ ప్రతివాదిని బెయిలుపై విడుదల చేసిందని పేర్కొన్నారు. అయితే, ఎన్ ఫోర్స్ మెంట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్న వాస్తవాన్ని గ్రహించడంలో హై కోర్టు పొరబడిందని, అందువల్ల దర్యాప్తు పూర్తయిందనే అవగాహనకు రావడం ఏ మాత్రం సమంజసం కాదని వెల్లడించారు.
4. ప్రస్తు త అప్పీళ్లను వ్యతిరేకిస్తూ, సంబంధిత 1 వ ప్రతివాది తరపు సీనియర్ న్యాయవాదులు బలమైన వాదనలను వినిపిస్తూ, ఈ కేసులోని వాస్తవాలు మరియు పరిస్థితుల దృష్ట్యా నిందితులను బెయిలుపై విడుదల చేయాలని ఆదేశించడంలో హై కోర్టు ఎలాంటి తప్పు చేయలేదని నివేదించారు. 4.[1] ప్రస్తు త కేసులో ఆక్షేపించబడిన ప్రథమ సమాచార నివేదికలో నిర్దేశించబడిన నేరాలకు సంబంధించి ఇతర నిందితులను దోషరహితులుగా విడుదల చేశారు/ నిరపరాధులుగా వదిలిపెట్టా రని నివేదించారు. 4.[2] దర్యాప్తు పూర్తయి అభియోగ పత్రం దాఖలు కావడంతో, హై కోర్టు నిందితులను సంబంధిత 1 వ ప్రతివాదిని సముచిత రీతిలో విడుదల చేసిందని పేర్కొన్నారు. పైగా నిందితులు 2021 మార్చి నుండి బెయిలులో ఉన్నందున, హై కోర్టు జారీ చేసిన ఆక్షేపిత ఉత్తర్వులలో ఈ దశలో జోక్యం చేసుకునే అవసరం ఉండకపోవచ్చని వేదించారు.
5. సంబంధిత ఇరు పక్షాలు తరపున విద్యావంతులైన న్యాయవాదుల సుదీర్ఘ వాదనలను విన్నాము.
6. ప్రారంభంలో, సంబంధిత 1 వ ప్రతివాది-నిండుతులు షెడ్యూల్డ్ నేరాలకు మరియు పీ యం యల్ యాక్ట్ సెక్షన్ 3 కింద మరియు సదరు యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం శిక్షర్హమైన నగదు అక్రమ చలామణి నేరాలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ ద్వారా దర్యాప్తు ను ఎదుర్కొంటున్నారన్నది గమనార్హం. ప్రథమ సమాచార నివేదిక నంబర్ 12/2019 లోని షెడ్యూల్డ్ నేరాలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ ద్వారా విచారణ/దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. పీ యం యల్ యాక్ట్, 2002 నేరాలకు సంబంధించి సంబంధిత 1 వ ప్రతివాది పై విచారణ/దర్యాప్తు కొనసాగుతుండగా పీ.యం.యల్ యాక్ట్, 2002 సెక్షన్ 45 తీవ్రతను పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పీ.యం.ఎల్ యాక్ట, 2002 సెక్షన్ 45 ఈ కింద విధంగా ఉంది:- “45. కేసు పెట్టదగిన మరియు జామీనివ్వ(రా)ని నేరాలు:- (1) [శిక్షాస్మృతి క్రిమినల్ ప్రొసీజరు కోడ్), 1973 (1974 లో 2 వది) లో ఏమి ఉన్నప్పటికీ (ఈ చట్టం కింద) నేరానికి పాల్పడిన ఏ వ్యక్తిని బెయిలు పై లేదా అతని స్వంతపూచీ పై విడుదల చేయరాదు కాకుంటే-] (I) అటువంటి విడుదల కోసం దరఖాస్తు ను వ్యతిరేకించే అవకాశం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఇవ్వబడింది; మరియు (II) పబ్లిక్ ప్రాసిక్యూటర్ దరఖాస్తు ను వ్యతిరేకించినపుడు, అతను అటువంటి నేరానికి పాల్పడలేదని మరియు బెయిలు పై ఉన్నపుడు అతను ఎలాంటి నేరం చేసే అవకాశం లేదని విశ్వసించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని కోర్టు సంతృప్తి చెందింది: అయితే, పదహరు సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి, లేదా ఒక మహిళ లేదా అనారోగ్యంతో లేక బలహీనంగా ఉన్న వ్యక్తి [తనను తానుగా లేదా ఇతర సహనిందితులతో కలిసి ఒక కోటి రూపాయల కంటే తక్కువగా నగదు అక్రమ చలామణి చేసినందుకు నిందితునిగా ఉన్నపుడు] ఒక వేళ ప్రత్యేక కోర్టు ఆ విధంగా నిర్దేశిస్తే బెయిలుపై విడుదల కావచ్చు. దీనిలో పాటు, వ్రాత పూర్వకంగా చేసిన ఫిర్యాదు పై తప్ప, సెక్షన్ 4 కింద శిక్షార్హమైన ఏ నేరాన్ని ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకోదు, వ్రాత పూర్వకంగా చేసిన ఫిర్యాదు పై తప్ప- (I) డైరెక్టర్; లేదా (II) ఈ విషయమై,కేంద్ర ప్రభుత్వం ద్వారా వ్రాత పూర్వకంగా సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా అధికార మివ్వబడిన కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వ ఏ అధికారి అయినా. [(1- ఏ)శిక్షాస్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) లో ఏది ఉన్నప్పటికి, 1973 (1974 లో 2 వది) లేదా ఏదైనా ఈ చట్టంలోని ఇతర నిబంధన ప్రకారం, ఏ పోలీసు అధికారి కూడా ఈ చట్టం కింద ఒక నేరం పై దర్యాప్తు చేయకూడదు, మరియు నిర్దేశించిన షరతులకు లోబడి, కేంద్ర ప్రభుత్వం ఒక సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ఇస్తే తప్ప.] (2) సబ్- సెక్షన్ (1) లో పేర్కొన్న విధంగా [***] బెయిలు మంజూరు చేయడం పై ఉన్న పరిమితి, శిక్షాస్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 (1974 లో 2 వది)లేదా బెయిలు మంజూరు చేసే సమయంలో అమలులోవున్న ఏదైనా ఇతర చట్టం కింద ఉన్న పరిమితులకు అదనంగా ఉంటుంది." ఆక్షేపించబడిన తీర్పు(లు) మరియు ఉత్తర్వు(లు) మరియు బెయిలు మంజూరు చేసే సందర్భంలో పి.యం.యల్యాక్ట్, 2002 సెక్షన్ 45 యొక్క తీవ్రతను హై కోర్టు పరిశీలించలేదు. 6.[1] ఇతరత్రా కూడా, నగదు అక్రమ చలామణి నేరారోపణలు మరియు పీ.యం.యల్ యాక్ట్, 2002 కింద నేరారోపణల స్వభావం మరియు తీవ్రతను హై కోర్టు అస్సలు పరిశీలించనేలేదు. నేరారోపణల స్వభావాన్ని బట్టి చూసినట్లయితే, అవి చాలా తీవ్రమైన నగదు అక్రమ చలామణికి సంబంధించినవిగా చెప్పవచ్చు. వీటిని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. 6.[2] సంబంధిత 1 వ ప్రతివాది తరపున వాదనలకు సంబంధించి, సంబంధిత 1 వ ప్రతివాది పేరును షెడ్యూల్డ్ నేరాలకు సంబంధించి ప్రథమ సమాచార నివేదికలో పేర్కొనలేదని,మరియు/లేదా ఇతర నిందితులందరు ఆరోపిత నేరాలకు సంబంధించినంతవరకు నిరపరాధులుగా వదిలి పెట్టబడ్డా రు/దోషరహితులుగా విడుదల చేయబడ్డా రు, కేవలం ఇతర నిందితులు దోష రహితులుగా విడుదల చేయబడినందున/నిరపరోధులుగా వదిలి పెట్టబడినందున, సంబంధిత 1 వ ప్రతివాది పైన దర్యాప్తు ను కొనసాగించకపోవడానికి ఇది కారణం కాజాలదు. షెడ్యూల్డ్ నేరాలకు సంబంధించి సంబంధిత 1 వ ప్రతివాది పై విచారణ/దర్యాప్తు కొనసాగుతుంది, అందువల్ల, షెడ్యూల్డ్ నేరాలకు విచారణ/దర్యాప్తు ఈ దశలో సరిపోతుంది. 6.[3] హై కోర్టు వెలువరించిన ఆక్షేపించబడిన తీర్పు(లు) ఉత్తర్వు(లు) లను బట్టి చూసినట్లయితే 1 వ ప్రతివాది-నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేయబడిందని, అందువల్ల దర్యాప్తు పూర్తయిందనే అంశంతో హై కోర్టు ప్రభావితం కాబడిందని స్పష్టమవుతుంది. అయితే, పీ యం యల్ యాక్ట్ 2002 కింద షెడ్యూల్డ్ నేరాలకు సంబంధించిన దర్యాప్తు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ ద్వారా ఇంకా కొనసాగుతోందన్న విషయాన్ని గమనించడంలోను మరియు అవగాహనకు రావడంలోను హై కోర్టు విఫలమైంది. కేవలం ఆరోపిత నేరాలకు గాను అభియోగ పత్రం దాఖలైనంత మాత్రాన, పీ.యం.యల్ యాక్ట్, 2002 కింద షెడ్యూల్డ్ నేరాలకు సంబంధించి నిందితులను విడుదల చేయడానికి అది ఒక కారణం కాజాలదు. ఆరోపిత నేరాలకు సంబంధించిన దర్యాప్తు మరియు పీ యం యల్ యాక్ట్ కింద సంబంధిత నేరాలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ చేసే దర్యాప్తు లు వేరుగాను, విభిన్నంగాను ఉంటాయి. అందువల్ల, హై కోర్టు అసంబద్ధ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది పీ.యం.యల్ యాక్ట్ 2002 కింద షెడ్యూల్డ్ నేరాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతుంది. 7.ఇందులో పైన చెప్పినట్లు గా, పీ.యం.యల్ యాక్ట్ 2002 లోని సెక్షన్ 45 యొక్క స్వభావాన్ని గాని, నిందితుని పైన ఆరోపించబడిన నేరారోపణల తీవ్రతనుగాని హై కోర్టు పరిశీలించలేదు మరియు పీ.యం.యల్ యాక్ట్ 2002 ననుసరించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట్ రేట్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతొందన్న వాస్తవాన్ని గాని హై కోర్టు పరిశీలించలేదు. అందువల్ల 1 వ ప్రతివాదిని బెయిలుపై విడుదల చేయాలన్న ఆక్షేపించబడిన హై కోర్టు ఉత్తర్వులు నిలువజాలని మరియు ఈ తీర్పులో పైన పేర్కొనబడిన పరిశీలనలను పరిగణనలోకి తీసుకుని సరికొత్త తీర్పు కోసం కేసులను హై కోర్టు కు త్రిప్పి పంపాల్సి ఉంటుంది.
8. ఈ దృష్టితో మరియు పైన పేర్కొన్న కారణాల దృష్ట్యా ఈ రెండు అప్పీళ్లు సఫలం కాబడ్డా యి. క్రిమినల్ పిటిషన్ నంబర్లు 1146/2021 మరియు 1147/2021 లోని సంబంధిత అప్పీళ్లలో సంబంధిత 1 వ ప్రతివాది-నిందితుడిని బెయిలుపై విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తూ హై కోర్టు వెలువరించిన సవాలు చేయబడిన ఉత్తర్వులను కొట్టి వేయడమైనది మరియు రద్దు పరచడమైనది. సంబంధిత 1 వ ప్రతివాది ఈ రోజు నుండి వారం రోజులలోగా (చట్టబద్ధమైన) అధికారం గల కోర్టు లో గాని లేదా సంబంధిత జైలు అధికారులు ముందుగాని లొంగిపోవాలి. ఈ తీర్పులో తెలిపిన వాస్తవాల దృష్ట్యా బెయిలు దరఖాస్తు లలో సరికొత్త తీర్పు కోసం మరియు సంబంధిత 1 వ ప్రతివాది;;పైన పేర్కొన్న విధంగా ఒక వారం రోజులలోగా లొంగిపోయిన పిమ్మట కేసులను హై కోర్టు కు త్రిప్పి పంపవలసింది. ప్రస్తు త అప్పీళ్లను పైన చేప్పబడినంత మేరకు అనుమతించడమైనది.