Full Text
భారత దేశ సర్వోన్నత న్యాయస్థా నము
సివిల్ అప్పీలు అధికార పరిధి
సివిల్ అప్పీలు నెంబరు .7121/2022
ఎమ్.సురేష్ కుమార్ రెడ్డి ..... అప్పీలుదారు
వర్సెస్
కెనరా బ్యాంక్ అండ్ అదర్స్ …. ప్రతివాదులు
తీర్పు
అభయ్ ఎస్.ఓకా, న్యాయమూర్తి
వాస్తవిక వివరాలు
JUDGMENT
1. ప్రతివాది బ్యాంకు దివాలా నిబంధనావళి –, 2016 (సంక్షిప్తంగా ఐ ’.బి.కోడ్’) సెక్షన్ 7 కింద తెలంగాణ హై దరాబాద్ లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో దరఖాస్తు దాఖలు చేసింది. సదరు దరఖాస్తు మెస్సర్స్ క్రాంతి ఎడిఫైస్ ప్రైవేట్ లిమిటెడ్, కార్పొరేట్ డేటార్ కు వ్యతిరేకంగా దాఖలైంది. ప్రస్తు త అప్పీలుదారు తాత్కాలికంగా తొలగింపబడిన కార్పోరేట్ డేటార్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (సంక్షిప్తంగా యన్ ‘.సి.ఎల్.టి.’) తేది.27-06-2022, ఉత్తర్వు ద్వారాప్రతివాది-బ్యాంకు దాఖలు చేసిన దరఖాస్తు ను స్వీకరించి ఐబి కోడ్ సెక్షన్ 14 లో సూచించిన ఉద్ధేశాల కనుగుణంగా అప్పు నిలుపుదల (మారటోరియం) ప్రకటించింది.దీనితో బాధ పడ్డ అప్పీలుదారు సదరు ఉత్తర్వును సవాలు చేస్తూ జాతీయ కంపెనీల చట్టం అప్పీల్లేట్ ట్రిబ్యునల్ (క్లు ప్తంగా యస్ ‘.సి.యస్.ఏటి’) లో అప్పీలు చేశారు. యస్.సి.యల్ ఏటి 05-08-2022 తేదీన అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
2. సిండికేట్ బ్యాంక్ విలీనం కాబడిన కెనరా బ్యాంక్, 1 వ ప్రతివాది ఐబి కోడ్ సెక్షన్ 7 కింద యన్.సి.యల్.టి కు దరఖాస్తు చేసింది. సిండికేట్ బ్యాంకు 1 వ ప్రతివాది- కెనరా బ్యాంకులో విలీనీకరణం చేయబడింది. 28-02-2017 సంవత్సరం వరకు ఒక సంవత్సరం పాటు చెల్లు బాటు అయ్యే విధంగా ఋణ సౌకర్యాలు కార్పోరేట్ డేటార్ కు మంజూరు చేస్తూ 02-04-2016 తేదీన సిండికేట్ బ్యాంకు ద్వారా మంజూరీ పత్రం జారీ చేయబడింది. రూ.110 కోట్ల బ్యాంకు గ్యారంటీ పరిమితిని మంజూరు చేయడంతోపాటుగా సిండికేట్ బ్యాంకు రూ.12 కోట్ల సురక్షిత ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని మంజూరు చేసింది. ఆవిధంగా ఫండ్- బేస్డ్ (ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ) మరియు నాన్-ఫండ్ బేస్డ్ – (బ్యాంక్ గ్యారంటీలు కార్పొరేట్ డేటారుకు సిండికేట్ బ్యాంకు మంజూరు చేసిన సదుపాయాలు.
3. ఐబి కోడ్, సెక్షన్ 7 కింద దాఖలు కాబడిన దరఖాస్తు లో, 30-11-2019 తేదీ నాటికి సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద కార్పోరేట్ డేటార్ రుణం రూ.74,52,87, 564.93 గా ఉంది. బకాయి ఉన్న బ్యాంక్ గ్యారంటీల పట్ల కార్పోరేట్ డేటార్ చెల్లించవలసినది రూ.19, 16, 20, 100 అని సిండికేట్ బ్యాంకు పేర్కొంది.
4. 21-10-2022 తేదీన ఈ కోర్టు నోటీసు జారీ చేసే సందర్భ o లో ఏకీకృత పరిష్కార పథకం (వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్) కింద పరిష్కార దిశగా ఒక ప్రతిపాదనను 1 వ ప్రతివాది- బ్యాంకుకు సమర్పించినట్టు గాను మరియు 1 వ ప్రతివాది- బ్యాంకులో రూ.[6] కోట్ల మొత్తా న్ని జమ చేసినట్లు గా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాంగ్మూలాన్ని నమోదు చేసింది. చివరకు, ఈ ప్రతి పాదనను 1 వ ప్రతివాది- బ్యాంకు నిరాకరించడంతో ప్రస్తు త అప్పీలును విచారణకు స్వీకరించడం జరిగింది. అభ్యర్ధనలు
5. అప్పీలుదారు తరపున విద్యావంతుడైన సీనియర్ న్యాయవాది వాదనలను వినిపిస్తూ 1 వ ప్రతివాది చెల్లించవలసిన బకాయిలను ఏకీకృతంగా (వన్ టైమ్) తీర్చడానికి పదే పదే ప్రయత్నాలు పరిష్కార దిశగా జరిగినా సదరు విజ్ఞప్తు లను అంగీకరించలేదని నివేదించారు. ఆయన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ వర్సెస్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ [2022 (8) యస్.సి. సి.352] కేసులో ఈ కోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తా విస్తూ, కార్పోరేట్ డేటార్ ఆర్ధిక రుణం మరియు బాకీ చెల్లించని పరిస్థితి నిరూపితమైనప్పటికి సెక్షన్ 7 కింద దరఖాస్తు ను అంగీకరించాల్సిన కర్తవ్యం యన్.సి.యల్.టికీ లేదని నివేదించారు. ఐబి కోడ్ లోని సెక్షన్ 7 కింద దరఖాస్తు ను యన్.సి.యల్.టీ సముచిత కారణాలతో అనుమతించకుండా నిరాకరించి ఉండాల్సింది. ఈ కోర్టు 22-09-2022 తేదీన విదర్భ ఇండస్ట్రీస్ (2022 (8) యన్.సి.సి.352) కేసులోని తీర్పును పున: పరిశీలించాలంటూ పునర్విచారణ పిటిషన్ లో వెలువరించిన తీర్పును స్పష్టంగా ప్రస్తా వించారు.
6. తెలంగాణ ప్రభుత్వానికి సిండికేట్ బ్యాంకుకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఆయన మా దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ డేటార్ కు ఇచ్చిన కాంట్రాక్టు లు ఉన్నాయి. బ్యాంకు సమకూర్చిన బ్యాంకు గ్యారంటీలను పొడిగించాలని కార్పొరేట్ డేటార్ అభ్యర్ధన మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 05-11-2018 తేదీన బ్యాంకుకు రాసిన లేఖను ఆయన మా దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా, 07-08-2019 తేదీ లేఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం సదరు లేఖలో స్పష్టీకరించిన విధంగా 29 బ్యాంకు గ్యారంటీలను పొడిగించాల్సిందిగా కోరింది. కార్పోరేట్ డేటార్ బ్యాంకు గ్యారంటీలను పోడించాల్సిందిగా అభ్యర్దిస్తూ బ్యాంకుకు రాసిన 09-01-2020 తేదీ లేఖను ఆయన ప్రత్యేకించి చూపారు. 08-01-2020 తేదీన తెలంగాణ ప్రభుత్వం 7 బ్యాంకు గ్యారంటీలను పొడిగించాల్సిందిగా పేర్కొంటూ లేఖరాసిందని కూడా ఆయన మా దృష్టికి తెచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తు లు చేసినప్పటికి, సిండికేట్ బ్యాంకు గ్యారంటీలను పొడిగించలేదని ఆయన నివేదించారు. ఆ ప్రకారంగా, ఒక విధంగా బ్యాంకు గ్యారంటీలను పొడిగించడంలో వైఫల్యం చెంది కార్పోరేట్ డేటార్ ను చెల్లింపులో ఉపేక్షించేలా చేసింది. ‘ఉపేక్ష మీటను నొక్కడానికి ’ బ్యాంకుదే పూచీ అంటూ వాదించారు. 24-04-2020 తేదీన తెలంగాణ హై కోర్టు ఏకసభ్య ధర్మాసనం 1 వ ప్రతివాది బ్యాంకు గ్యారంటీల లేఖల కనుగుణంగా – మరియు డిమాండ్ డ్రాఫ్ట్ లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయాలతో పాటు బలవంతపు చర్య లేవీ తీసుకోకుండా నిషేధిస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను విద్యావంతుడైన న్యాయవాది మా దృష్టికి తీసుకువచ్చారు. అయితే, ఆవిధమైన ఉత్తర్వులు ఉన్నప్పటికి కూడా, యన్.సి.యల్.టీ సెక్షన్ 7 కింద దాఖలైన దరఖాస్తు ను ఆమోదించి ఉండాల్సింది కాదని ఆయన అభ్యర్ధించారు.
7. 1 వ ప్రతివాది బ్యాంకు తరపు విద్యావంతుడైన న్యాయవాది వాదనలను – వినిపిస్తూ విదర్భ ఇండస్ట్రీస్ [2022 (8) యస్.సి.సి.352) కేసులో అనన్య సామాన్యమైన వాస్తవాల దృష్ట్యా, పునర్విచారణ పిటిషన్ ను పరిష్కరించే సందర్భంలో అదే ధర్మాసనం వెలువరించిన తీర్పును సూటిగా ప్రస్తా వించారు. ఇ.ఎస్. కృష్ణమూర్తి అండ్ అదర్స్ వర్సెస్ భారత్ హై టెక్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ [(2022) (3)యస్.సి.సి.161] కేసులో ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటికీ అమల్లో ఉందని నివేదించచారు. అందువల్ల ఆర్ధిక రుణం ఉందని బాకీ చెల్లించాకుండా ఉండడం జరిగిందని ఒకసారి గనక యన్. సి.యల్.టీ సంతృప్తి చెందిన పక్షంలో సెక్షన్ 7 కింద దరఖాస్తు ను అంగీకరించేందుకు అది కట్టు బడి ఉండాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు గ్యారంటీలను పొడిగించాల్సిందిగా కార్పొరేట్ డేటార్ చేసిన అభ్యర్ధనను నిర్ధిష్టంగా నిరాకరించినట్టు గా 1 వ ప్రతివాది 18-01-2021 తేదీ లేఖ ద్వారా కార్పోరేట్ డేటార్ కు తెలియజేశారని ఆయన నివేదించారు. అందువల్ల సెక్షన్ 7 కింద దరఖాస్తు ను ఆమోదించడంలో యన్.సి.యల్.టీ ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని ఆయన వెల్లడించారు. మా అభిప్రాయం
8. మేము అభ్యర్ధనలను జాగ్రత్తగా పరిశీలించాము ఈ కోర్టు ఇన్నోవెంటివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అనదర్ [(2018)1 యస్.సి.సి.407] కేసులో సెక్షన్ 7 పరిధిని వివరించింది. తీర్పులోని పేరా నెంబర్లు.28 నుంచి 30 వరకు ఈ కింది విధంగా ఉన్నాయి:- “28. ఈ ప్రక్రియను ప్రారంభించే ఆర్ధిక రుణదాత విషయానికి వస్తే, సెక్షన్ 7 సందర్భోచితమవుతుంది. సెక్షన్ 7 (1)కువివరణగా బాకీ చెల్లించక పోవడమన్నదికార్పోరేట్ డేటార్ కు సంబంధించిన ఏ ఆర్ధిక రుణదాతకైనా చెల్లించాల్సిన ఆర్ధిక రుణానికి సంబంధించినదై ఉంటుంది- అది దరఖాస్తు దారు ఆర్ధిక రుణదాతకు చెల్లించాల్సినరుణం కానవసరం లేదు. సెక్షన్ 7 (2)కింద, సబ్ సెక్షన్ – (1)లో పేర్కొన బడిన నిర్ధిష్ట రూపం మరియు శైలిలో దరఖాస్తు చేసుకోవాలి,అది మనల్ని దివాలా (న్యాయ నిర్ణేతల అధికార సంస్థ దరఖాస్తు ) నిబంధనలు, 2016 వద్దకు చేరుస్తుంది. రూల్ 4 ప్రకారం, ఫారం 1 లో అందుకు అవసరమైన పత్రాలు మరియు రికార్డు లతో దరఖాస్తు చేసుకోవాలి. ఫారం 1 V భాగాలతో కూడిన వివరణాత్మక ఫారం, పార్ట్ I లో దరఖాస్తు దారుని వివరాలు, పార్ట్ II లో కార్పోరేట్ డేటార్ వివరాలు, పార్ట్ III లో ప్రతిపాదిత మధ్యంతర పరిష్కార నిపుణుని వివరాలు, పార్ట్ IV లో ఆర్ధిక రుణానికి సంబంధించిన వివరాలు మరియు పార్ట్ V లో బాకీ చెల్లించని వారి పత్రాలు, రికార్డు లు, మరియు ఆధారాలు అవసరం. రూల్ 4 (3) ప్రకారం దరఖాస్తు దారు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా న్యాయ నిర్ణేతఅధికారికిసమర్పించిన దరఖాస్తు ను నిబంధనలప్రకారం నమోదైన కార్పోరేట్ డేటార్ కార్యాలయానికిపంపించాలి. న్యాయ నిర్ణేతల అధికార సంస్థ సమాచార వినియోగ రికార్డు ల నుండి లేదా ఆర్ధిక రుణదాత అందించిన వాంగ్మూలం ఆధారంగా బాకీ చెల్లించకపోవడమన్నవిషయాలను నిశ్చయంగా తెలుసుకోవడమే కాక అది వీలయినంత శీఘ్రంగా నిర్ధా రించడం చాలా ముఖ్యం. దరఖాస్తు అందిన 14 రోజుల లోపు ఈ పని చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 7(5) దశలోనే బాకీ చెల్లించకపోవడమన్నది జరిగిందని న్యాయ నిర్ణేతల అధికార సంస్థ సంతృప్తి చెందిన పక్షంలో కార్పోరేట్ డేటార్ వివాదాస్పద క్లెయిమ్ ను కూడా కలిగి ఉన్న రుణం చెల్లించబడలేదనే అర్ధంలో బాకీ చెల్లించక “ ” పోవడమన్నది జరగలేదని సూటిగా వివరించే హక్కును కలిగి ఉంటారు. చట్టంలో లేదా వాస్తవంలో చెల్లించకపోతే రుణం చెల్లించబడకపోవచ్చు.బాకీ చెల్లింపు జరగలేదని న్యాయ నిర్ణేతల అధికార సంస్థ సంతృప్తి చెందిన మరు క్షణం,అది సంపూర్తిగా ఉంటేనే దరఖాస్తు ను అనుమతించాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో న్యాయ నిర్ణేతల అధికారసంస్థ నుండి నోటీసు అందుకున్న 7 రోజులలో లోపాన్ని సరిదిద్దు కోవడానికి దరఖాస్తు దారునికినోటీసు జారీ చేయవచ్చు. సబ్- సెక్షన్(7) కింద, న్యాయ నిర్ణేతల అధికార సంస్థ అటువంటి దరఖాస్తు ను స్వీకరించిన లేదా తిరస్కరించిన విషయాన్ని, సందర్భానుసారంగా, 7 రోజుల్లోగా ఆర్ధిక రుణదాత మరియు కార్పోరేట్ డేటార్ కు ఉత్తర్వుల ద్వారాతెలియపర్చాలి.
29. సెక్షన్ 7 పథకం సెక్షన్ 8 పథకానికి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 8 లో నిర్వహణ రుణదాత బాకీ చెల్లించ నపుడు,నిబంధనావళిలోని సెక్షన్ 8 (1) లో పేర్కొన్న విధంగా చెల్లించని రుణం యొక్క డిమాండ్ నోటీసును ముందుగా నిర్వహణ రుణగ్రహీతకు అందించాలి. సెక్షన్ 8(2) ప్రకారం కార్పోరేట్ డేటార్,సబ్- సెక్షన్ (1)లో పేర్కొన్న డిమాండ్ నోటీసు లేదా ఇన్ వాయిస్ కాపీ అందుకున్న 10 రోజుల లోపల వివాదం ఉన్న సంగతిని లేదా దావా లేదా మధ్యవర్తిత్వ ప్రొసీడింగులు పెండింగులో ఉన్న రికార్డు ను నిర్వహణ రుణదాత దృష్టికి తీసుకురావచ్చు, పూర్వస్థితిలో ఉండగానే అనగా – అటువంటి నోటీసు లేదా ఇన్ వాయిస్ కార్పోరేట్ డేటారుకుఅందక మునుపే. అటువంటి వివాదం ఉన్న మరుక్షణమే నిర్వహణ రుణదాత నిబంధనావళి బారినుండి బయటడతాడు.
30. మరోవైపు, మనం గమనించినట్టు గా,కార్పోరేట్ డేటార్ ఆర్ధిక రుణ ఎగమేతకు పాల్పడిన సందర్భంలో బాకీ చెల్లించకపోవడం జరిగిందని తనను తాను సరి పుచ్చుకోవడానికి ఆర్ధిక రుణదాత ప్రదర్శించిన సమాచార వినియోగం యొక్కరికార్డు లను లేదా ఇతర వాంగ్మూలాల రికార్డు లను న్యాయ నిర్ణయాధికారి పరిశీలించాల్సి ఉంటుంది. రుణం చెల్లించవలసి ఉన్నంత కాలం రుణం వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, అనగా కొన్ని శాసనాల ద్వారా నిషేధించబడితే తప్ప లేదా ఇంకా చెల్లించబడనంత వరకు రుణం చెల్లించాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తు లో ఏదో ఒక రోజు చెల్లించవలసి ఉంటుందని అర్ధం. అయితే ఇది న్యాయనిర్ణేతల అధికార సంస్థ సంతృప్తి మేరకు నిరూపించబడినపుడే, న్యాయ నిర్ణేతల అధికార సంస్థ దరఖాస్తు ను నిరాకరించవచ్చు తప్ప అన్యాథా కాదు. ” (ప్రాముఖ్యత వివరణ చేర్చబడింది)
9. ఇన్నోవెంటివ్ ఇండస్ట్రీస్ [(2018)1 యస్.సి.సి.407] కేసులో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఈ కోర్టు ఇ.యస్.కృష్ణమూర్తి అండ్ అదర్స్ [(2022)3 యస్.సి.సి.161] కేసులో అనుసరించింది. తీర్పులోని పేరా నంబర్లు 32 నుండి 34 వరకు ఈ కింది విధంగా ఉన్నాయి:
32. ఇన్నోవెంటివ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ ఐ సి ఐ సి ఐ బ్యాంకు (2018)1 యస్.సి.సి.407, పేరాలు 28 మరియు 30: (2018)1 యస్.సి.సి.(సివిల్) 356), ఈ కోర్టు లోనిద్విసభ్య ధర్మాసనం సెక్షన్ 7 ఐ బి సి పరిధి గురించి వివరిస్తూ మరియు తీర్పు ఇస్తూ, న్యాయ నిర్ణేత అధికార సంస్థ బాకీ చెల్లింపు జరగలేదని అనగా అప్పు ‘ ’ (ఇప్పటికీ వివాదాస్పదమే) బాకాయి పడిందా మరియు చెల్లించబడ లేదాఅని మాత్రమే నిర్ధా రించాలి. ఒకవేళ న్యాయ నిర్ణేతల అధికార సంస్థ బకాయి చెల్లించబడలేదని అభిప్రాయపడితే అది దరఖాస్తు ను అంగీకరించాల్సి ఉంటుంది, అసంపూర్ణంగా లేకపోతే, రోహింటున్ ఎఫ్. నారీమన్,న్యాయమూర్తి., ద్వారా కోర్టు ఇలా చెప్పింది: (యస్.సి.సి పేజీలు 438-39, పేరాలు 28 మరియు 30) “28. ఈ ప్రక్రియను ప్రారంభించే ఆర్ధిక రుణదాత విషయానికి వస్తే, సెక్షన్ 7 సందర్భోచితమవుతుంది. సెక్షన్7(1)కు సంబంధించిన వివరణ ప్రకారం, ఆర్ధిక రుణదాతకు చెల్లించాల్సిన ఆర్ధికరుణానికి సంబంధించిన దానితో కార్పోరేట్ డేటార్ యొక్క ఆర్ధిక రుణదాత ఇది – దరఖాస్తు దారు ఆర్ధిక రుణదాతకు చెల్లించాల్సిన రుణం కానవసరం లేదు. సెక్షన్ 7(2) కింద, సబ్-సెక్షన్ (1)లో పేర్కొంబడిన నిర్ధిష్ట రూపం మరియు శైలిలో దరఖాస్తు చేసుకోవాలి, అది మనల్ని దివాలా (న్యాయ నిర్ణేతాధికారికి దరఖాస్తు ) నిబంధనలు, 2016 వద్దకు చేరుస్తుంది రూల్ 4 ప్రకారం, ఫారం 1 లో అందుకు అవసరమైన పత్రాలు మరియు రికార్డు లతో దరఖాస్తు చేసుకోవాలి. ఫారం 1 V భాగాలతో కూడిన వివరణాత్మక ఫారం, పార్ట్ I లో దరఖాస్తు దారుని వివరాలు, పార్ట్ II లో కార్పోరేట్ డేటర్ వివరాలు, పార్ట్ III లో ప్రతిపాదిత మధ్యంతర పరిష్కార నిపుణుని వివరాలు, పార్ట్ IV లో ఆర్ధిక రుణానికి సంబంధించిన వివరాలు మరియు పార్ట్ V లో బాకీ చెల్లించని వారి పత్రాలు, రికార్డు లు, మరియు ఆధారాలు అవసరం. రూల్ 4(3) ప్రకారం దరఖాస్తు దారు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా న్యాయ నిర్ణేతల అధికార సంస్థ సమర్పించిన దరఖాస్తు ను నిబంధనల ప్రకారం నమోదైన కార్పోరేట్ డేటార్ కార్యాలయానికి పంపించాలి. న్యాయ నిర్ణేతాధికారి సమాచార వినియోగ రికార్డు ల నుండి లేదా ఆర్ధిక రుణదాత అందించిన వాంగ్మూలంఆధారంగా బాకీ చెల్లించకపోవడమన్న విషయాలను నిశ్చయంగా తెలుసుకోవడమే కాక అది వీలయినంత శీఘ్రంగా నిర్ధా రించడం చాలా ముఖ్యం. దరఖాస్తు అందిన 14 రోజుల లోపు ఈ పని చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 7(5) దశలోనే బాకీ చెల్లించకపోవడమన్నది జరిగిందని న్యాయ నిర్ణేతాధికారి సంతృప్తి చెందిన పక్షంలో కార్పోరేట్ డేటార్ వివాదాస్పద క్లెయిమ్ ను కూడా కలిగి ఉన్న రుణం “ ” చెల్లించబడలేదనే అర్ధంలోబాకీ చెల్లించక పోవడమన్నది జరగలేదని వివరించే హక్కును కలిగి ఉంటారు. చట్టంలో లేదా వాస్తవంలో చెల్లించకపోతే రుణం చెల్లించబడకపోవచ్చు. బాకీ చెల్లింపు జరగలేదని న్యాయ నిర్ణేతాధికారి సంతృప్తి చెందిన మరుక్షణం, అది సంపూర్తిగా ఉంటేనే దరఖాస్తు ను అనుమతించాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో న్యాయ నిర్ణేతల అధికార సంస్థ నుండి నోటీసు అందుకున్న 7 రోజులలో లోపాన్ని సరిదిద్దు కోవడానికి దరఖాస్తు దారునికి నోటీసు జారీ చేయవచ్చు. సబ్ సెక్షన్ – (7) కింద న్యాయ నిర్ణేతల అధికార సంస్థ అటువంటి దరఖాస్తు ను స్వీకరించిన లేదా తిరస్కరించిన విషయాన్ని, సందర్భానుసారంగా, 7 రోజుల్లోగా ఆర్ధిక రుణదాత మరియు కార్పోరేట్ డేటారుకు ఉత్తర్వుల ద్వారా తెలియపర్చాలి. **** **** **** 30.మరోవైపు, మనం గమనించినట్టు గా, కార్పోరేట్ డేటార్ ఆర్ధిక రుణ ఎగవేతకు పాల్పడిన సందర్భంలో బాకీ చెల్లించకపోవడం జరిగిందని తనను తాను సరిపుచ్చుకోవడానికి ఆర్ధిక రుణదాత ప్రదర్శించిన సమాచార వినియోగం యొక్క రికార్డు లను లేదా ఇతర వాంగ్మూలాల రికార్డు లను న్యాయ నిర్ణయాధికారి పరిశీలించాల్సి ఉంటుంది. రుణం చెల్లించవలసి ఉన్నంత కాలం రుణం వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, అనగా కొన్ని శాసనాల ద్వారా నిషేధించబడితే తప్ప లేదా ఇంకా చెల్లించబడనంత వరకు రుణం చెల్లించాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తు లో ఏదో ఒక రోజు చెల్లించవలసి ఉంటుందని అర్ధం. అయితే ఇది న్యాయ నిర్ణేతల అధికార సంస్థ సంతృప్తి మేరకు నిరూపించ బడినప్పుడే, న్యాయ నిర్ణేతల అధికార సంస్థ దరఖాస్తు ను నిరాకరించవచ్చు తప్ప అన్యధా కాదు.”
33. ప్రస్తు త కేసులో కక్షిదారులు ఇతర విషయాలతో పాటుగా ఒక పరిష్కారానికి రావడానికి వీలుగా పిటిషన్ ను అనుమతించడానికి వివిధ తేదీలలో వాయిదా వేస్తూ లిస్టింగ్ చేయబడినట్టు గా న్యాయ నిర్ణేతల అధికార సంస్థ గుర్తించింది. అయితే ఈ ప్రక్రియను ప్రారంభించిన అసలు పిటిషనరు ఎవరు కూడా ఎటువంటి పరిష్కారానికి రాలేదన్నది సుస్పష్టం. 12-02- 2020 తేదీ ఉమ్మడి సమ్మతి షరతులు తమ ముందు దాఖలు చేయబడినట్టు గా న్యాయ నిర్ణేతల అధికార సంస్థ గమనించింది. అయితే ఈ సమ్మతి షరతులు న్యాయ నిర్ణేతల అధికార సంస్థ ముందున్న అసలు పిటిషనరు అందరికీ వర్తించకపోవడమన్నది ఒక సాధారణమైన కారణం. 140 మంది పెట్టు బడిదారుల క్లెయిమ్ లను ప్రతివాది పూర్తిగా పరిష్కరించినట్లు న్యాయ నిర్ణేతల అధికార సంస్థకు తెలియజేయడం జరిగింది. న్యాయ నిర్ణేతల అధికార సంస్థను ఆశ్రయించిన అసలు పిటిషనర్ల క్లెయిమ్ లలో కేవలం 13 మాత్రమే పరిష్కరించబడ్డా యని, “దాని ప్రకారం 40 పరిష్కార దశలో ఉన్నాయని మరియు 39 పరిష్కారాలు పెండింగులో ఉన్నాయని ప్రతివాది పేర్కొన్నారు ”. చివరకు, ఐ బిసి విధానం సంక్షిప్తమని, అది ప్రతి గృహ కొనుగోలుదారుల క్లెయిమ్ లను నిర్వహించడం గాని నిర్ణయించడం గానిచేయలేదని న్యాయ నిర్ణేతల అధికార సంస్థ పిటిషన్ ను స్వీకరించలేదు. పరిష్కార ప్రక్రియ సంపూర్ణ గంభీరతతో ముందుకు సాగుతున్నందున “ ” వ్యక్తిగత క్లెయిమ్ లన్నింటిని పరిశీలించే బదులు మిగిలిన క్లెయిమ్ లన్నింటినినిర్ధిష్ట కాలపరిమితిలో గంభీర స్వభావంతో “ ” పరిష్కరించాల్సిందిగాను ప్రతివాదిని ఆదేశించడం ద్వారా పిటిషన్ పరిష్కరింపబడుతుందని న్యాయ నిర్ణేతల అధికార సంస్థ తీర్పు నిచ్చింది. తదునుగుణంగా పిటిషను పరిష్కరించడమైనది. మిగిలిన క్లెయిమ్ లను మూడు నెలలకు మించకుండ పరిష్కరించాలని ప్రతివాదిని ఆదేశించడమైనది. మిగిలిన అసలు పిటిషనర్లు ఎవరైనా సెటిల్ మెంట్ ప్రక్రియ వల్ల బాధపడినట్లయితే, చట్టా నికి అనుగుణంగాన్యాయ నిర్ణేతల అధికార సంస్థను తిరిగి సంప్రదించే స్వేచ్చ వారికి ఉంటుందంటూ పిటిషన్ను పరిష్కరించడమైనది. న్యాయ నిర్ణేతల అధికార సంస్థ నిర్ణయాన్ని అప్పీల్లెట్ అథారిటీ సమర్ధిస్తూ తీర్పు చెప్పింది.
34. న్యాయ నిర్ణేతల అధికార సంస్థ సెక్షన్ 7(5) ఇబిసి కింద దానికున్న నిబంధనల అధికార పరిధినిదాటి వ్యవహరించింది.బాకీ చెల్లించకపోవడమన్నది జరిగిందా లేదా అన్న విషయాన్ని న్యాయ నిర్ణేతల అధికార సంస్థ పరిశీలించడానికి మాత్రమే అధికారాన్ని కలిగి ఉంది. తన నిర్ణయం ఆధారంగా, న్యాయ నిర్ణేతల అధికార సంస్థ ఆ దరఖాస్తు ను స్వీకరించడం గాని తిరస్కరించడం గాని యథాక్రమంగా చేయాలి. ఈ రెండు సందర్భానుసార చర్యలు మాత్రమే సెక్షన్7(5) ప్రకారం న్యాయ నిర్ణేతల అధికార సంస్థకు అందుబాటులో ఉంటాయి. అంతే గాని న్యాయ నిర్ణేతల అధికార సంస్థ తన ముందున్న ప్రొసీడింగులలోని కక్షిదారులను వివాదాన్ని పరిష్కరించుకోమని బలవంతం చేయడానికి లేదు.” (ప్రాముఖ్యత వివరణ చేర్చబడినది)
10. ఆ ప్రకారంగా బాకీ చెల్లించకపోవడం (డీఫాల్ట్) జరిగిందని యన్.సి.యల్.టి. గనక ఒకసారి సంతృప్తి చెందినట్లయితే సెక్షన్ 7 కింద దరఖాస్తు ను తిరస్కరించడానికి యన్.సి.యల్.టీకి విచక్షణాధికారం అరుదుగా ఉంటుంది. బాకీ చెల్లించకపోవడం (ఢీఫాల్ట్) అనేది ఐ బి కోడ్ సెక్షన్ 3, సబ్-సెక్షన్ 12 కింద నిర్వహించబడింది. అది ఈ విధంగా ఉంది: “3. నిర్వచనాలు:- ఈ నియమావళి (కోడ్) లో అన్యథా సందర్బం అవసరమైతే తప్ప,_____ … … … …. …. …. (12)“ఢీఫాల్ట్ అనగా చెల్లించవలసిన బాకీ తీర్చలేక ” పోవడం మరియు రుణ గ్రహీత గాని లేదా కార్పొరేట్ డేటార్ గాని సందర్భానుసారంగా తీర్చలేని రుణ చెల్లింపు.” ఆవిధంగా చెల్లించాల్సిన రుణంలో కొంత భాగాన్ని చెల్లించకపోవడం వల్ల కార్పోరేట్ డేటార్ ను రుణగ్రస్త గానే భావించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో, ఐ బి కోడ్ సెక్షన్ 7 ప్రకారం అనుమతికి సంబంధించిన ఉత్తర్వును తప్పనిసరిగా అనుసరించాలి. ఒకవేళ రుణం ఉందని యన్.సి.యల్.టీ గుర్తించినా, అది గనక బకాయిపడలేదని మరియు చెల్లించాల్సిన అవసరం లేదని తేలితే సెక్షన్ 7 ప్రకారం దరఖాస్తు ను నిరాకరించవచ్చు, కాకపోతే, నిరాకరించడానికి ఎటువంటి ఆధారం లేనట్లే.
11. విదర్భ ఇండస్ట్రీస్ [2022 (8)యస్.సి.సి.352] కేసులో ఈ కోర్టు ఇచ్చిన తీర్పును, మరీ ముఖ్యంగా అందులోని పేరాలు 86 నుండి 89 లో ఉన్నవాటి విషయమై ప్రస్తా వించారు, అది ఈ కింది విధంగా ఉంది:- “86. సెక్షన్ 7 (5) ఐ బిసి న్యాయ నిర్ణేతల అధికార సంస్థకు విచక్షణాధికారాన్ని ఇచ్చిన ప్పటికీ, అటువంటి విచక్షణాధికారాన్ని ఏక పక్షంగా లేదా ఇష్ట పూర్వకంగా ఉపయోగించ డానికి లేదు. ఒకవేళ వాస్తవాలు మరియు పరిస్థితులు విచక్షణాధికారాన్ని ఒక నిర్ధిష్ట పద్ధతిలో సమర్ధించినట్లయితే, ఆ పద్ధతిలోనే అధికారాన్ని వినియోగించాల్సింది. 87.సాధారణంగా,న్యాయ నిర్ణేతల అధికార సంస్థ (యన్.సియల్.టీ) సెక్షన్ 7 ఐ బిసి కింద ఒక దరఖాస్తు ను ఆమోదించడానికి దాని విచక్షణను ఉపయోగించాలి మరియు ఆర్ధిక రుణం ఉండడం,మరియు కార్పోరేట్ డేటార్ రుణం చెల్లించకుండా ఉండడం పట్ల తృప్తి చెందినదటువంటిదై సి.ఐ.ఆర్.పి.ను మొదలు పెట్టా ల్సి ఉంటుంది, పిటిషన్ ను అంగీకరించక పోవడానికి సరైన కారణాలుంటే తప్ప.
88. న్యాయ నిర్ణేతల అధికార సంస్థ (యన్.సి.యల్.టీ) కార్పోరేట్ డేటార్ తన స్వంత యోగ్యతలను (మెరిట్స్) పేర్కొంటూ అడ్మిషన్ కు వ్యతిరేకంగా పేర్కొన్న కారణాలను పరిశీలించాలి. ఉదాహరణకు, కార్పోరేట్ డేటార్ కు అనుకూలంగా ఒక మధ్యవర్తిత్వ తీర్పు (అవార్డు ) లేదా డిక్రీ ఉన్న కారణంగా అడ్మిషన్ ను వ్యతిరేకించినపుడు, మరియు తీర్పు (అవార్డు ) చేయబడిన/డిక్రీటల్ మొత్తం రుణ మొత్తా న్ని మించిపోయినపుడు, సెక్షన్ 7, (5) (ఎ) ఐ బిసి కింద న్యాయ నిర్ణేతల అధికార సంస్థ దాని విచక్షణను వినియోగించాల్సి ఉంటుంది, ఆర్ధిక రుణదాత దరఖాస్తు అడ్మిషన్ను నిలిపి వేయడానికి, అలా చేయకపోవడానికి సరైన కారణం ఉంటే తప్ప. న్యాయ నిర్ణేతల అధికార సంస్థ, ఉదాహరణకు, ఏ తీర్పు (అవార్డు ) తోను లేదా డిక్రీతోను సంబంధం లేకుండా, ఆర్ధిక రుణదాత దరఖాస్తు ను స్వీకరించవచ్చు, ఒకవేళ తీర్పు (అవార్డు )/ డిక్రీటల్ మొత్తం పరిష్కరించడంలో అశక్తు లైతే. అయితే ఈ ఉదాహరణ కేవలం ఊహాత్మమైనదే (ఇల్ల స్ట్రేటివ్).
89. ఈ సందర్భంలో, అప్పీలుదారుకు అనుకూలంగా ఏపీ.టీ.ఈ.యల్ వెలువరించిన ఉత్తర్వు ప్రకారం తనకు (అప్పీలుదారుడు) రూ.1730 కోట్లు సిద్ధిస్తా యన్నా అప్పీలుదారు వాదనను న్యాయ నిర్ణేతల అధికార సంస్థ నేరుగా తోసిపుచ్చింది, అప్పీలుదారుకు మరియు విద్యుత్ గ్రహీతకు మధ్య లేదా అప్పీలుదారుకు మరియు విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ కు మధ్య విభేధాలు ఏమైనా తలెత్తితే అవి స్వల్పమే అన్న పై పై పరిశీలనతో. (ప్రాముఖ్యత వివరణ చేర్చబడినది)
12. ఈ.ఎస్.కృష్ణమూర్తి [(2022)3 యస్.సి.సి.(6)] కేసులోని తీర్పును కోర్టు దృష్టికి తీసుకురాలేదన్న కారణంగా విదర్భ ఇండస్ట్రీస్ (2022 (8) యస్.సి.సి.352) కేసులోని తీర్పును పున: సమీక్షించాలని కోరుతూ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ సమీక్ష అర్జీ (రివ్యూ పిటిషన్) దాఖలు చేసింది. ఈ సమీక్ష అర్జీ (రివ్యూ పిటిషన్) పరిష్కరిస్తూ ఈ కోర్టు 22-09-2022 తేదీన ఈ విధంగా పేర్కొంది: “90 వ పేరా ఇంకా ఇతర పేరాలలో చేసిన విశదీకరణ ప్రస్తు త కేసు నేపథ్యంలో చేయబడింది. తీర్పులు మరియు వాటిల్లోని పరిశీలనలను శాసన నిబంధనలుగా అన్వయిo చుకుంటూ చదవరాదన్నది సుస్పష్టం. న్యాయబద్ధ వచనాలు మరియు/లేదా తీర్పులు ఒక నిర్ధిష్ట కేసులోని వాస్తవాల నేపథ్యంలో ఉంటాయి. ఒక చట్టంలోని పదాలను, మరియు నిబంధనలను వివరించడానికి న్యాయమూర్తు లకు సుధీర్ఘ చర్చలు ప్రారంభించడం అవసరం కావచ్చు. చట్టా లను వ్యాఖ్యానించే న్యాయమూర్తు లపదాలను చట్టా లుగా భావించకూడదు.”
13. అందువల్ల విదర్భ ఇండస్ట్రీస్ [2022(8)యస్.సి.సి.352] కేసులోని తీర్పు ఆ కేసు నేపథ్యంలో ఇవ్వబడింది. అందువల్ల విదర్భ ఇండస్ట్రీస్ (2022(8) యస్.సి.సి.352) కేసులోని తీర్పును ఇన్నోవెంటివ్ ఇండస్ట్రీస్ [(2018)1 యస్.సి.సి.407] మరియు ఈ.యస్.కృష్ణమూర్తి [(2022)3 యస్.సి.సి.161] కేసుల్లో తీసుకున్న అభిప్రాయానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని తీసుకున్నట్లు గా చదవడం మరియు అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు. ఇన్నోవెంటివ్ ఇండస్ట్రీస్ [(2018)1 యస్.సి.సి.407] కేసులో తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ సముచితమే.
14. ప్రస్తు త కేసులో, కార్పోరేట్ డేటార్ చెల్లించాల్సిన మొత్తంలో సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ల ఫండ్ ఆధారిత క్రెడిట్ సదుపాయం కింద తిరిగి చెల్లించాల్సిన మొత్తం కూడా ఉందని మనం గమనించాలి. కార్పోరేట్ డేటార్ కు మంజూరు చేయబడ్డ సదుపాయం బ్యాంకు గ్యారంటీలకు మాత్రమే పరిమితం కాలేదు.
15. ఇంతే కాకుండా సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎంఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 సెక్షన్ 13(2) కింద 29-08-2018 తేదీన 1 వ ప్రతివాది డిమాండ్ నోటీసు నొక దానిని జారీ చేశారు. కార్పోరేట్ డేటార్ ఈ నోటీసును ఆదరించకపోవడంతో, వసూలు కోసం 1 వ ప్రతివాది హై దరాబాద్ లోని డేట్ రికవరీ ట్రిబ్యునల్ ముందు అసలు దరఖాస్తు ను దాఖలు చేశారు. ఇంతే కాకుండా, కార్పోరేట్ డేటార్ 05-05-2019 తేదీన రూ.63,36,61,897.26 మేర రుణాన్ని స్వీకరించినట్లు గా అంగీకరించారు. ఇది గాక, 31-03-2019 నాటికి కార్పోరేట్ డేటార్ యొక్క బ్యాలెన్స్ షీట్ కార్పోరేట్ డేటార్ సదరు బాధ్యతను ప్రతిబింభిస్తుంది.
16. బ్యాంకు గ్యారంటీలకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గ్యారంటీలను తిరిగి చెల్లు బాటు చేయాల్సిందిగా కోరుతూ బ్యాంకుకు లేఖలు రాశారు అందులో పేర్కొన్న ఏడు బ్యాంకు గ్యారంటీలను పొడిగించాలని 08- 01-2020 తేదీన ప్రభుత్వం సిండికేటు బ్యాంకుకు లేఖ రాసింది. బ్యాంకు గ్యారంటీల చెల్లు బాటు లేదా పొడిగింపు చర్యలు గనక తీసుకోకపోతే బ్యాంకు గ్యారంటీలు వసూలు చేయబడతాయని, ఆ మొత్తా న్ని డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. దాంతో, బ్యాంకు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. సదరు లేఖను దృష్టిలో ఉంచుకుని, 09-01-2020 తేదీన కార్పోరేట్ డేటార్, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రెండు కాంట్రాక్టు లను ముందస్తు గా మూసివేయడానికి సంబంధించిన సమస్య రాష్ట్ర ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని పేర్కొంటూ సిండికేట్ బ్యాంకుకు లేఖ రాశారు. బ్యాంకు గ్యారంటీలను పొడిగించకపోతే, వాటిని ప్రభుత్వం నగదుగా మార్చుకునే అవకాశం ఉందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల, బ్యాంకు గ్యారంటీలను తిరిగి చెల్లు బాటు అయ్యేలా చూడాలని కార్పోరేట్ డేటార్ బ్యాంకుకు విజ్ఞప్తి చేశారు. అయితే, 1 వ ప్రతివాది బ్యాంకు గ్యారంటీలు, మరియు సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలను పొడిగించడం కోసం కార్పోరేట్ డేటార్ ప్రతిపాదనను సంబంధిత అధికార యంత్రాంగం పరిగణనలోకి తీసుకోలేదని కార్పోరేట్ డేటార్ కు 18-01-2021 లేఖ ద్వారా ప్రత్యేకంగా తెలియజేశారు. అదే లేఖలో, 1 వ ప్రతివాది కార్పోరేట్ డేటార్ ను బకాయి పడిన మొత్తా న్ని వెంటనే చెల్లించాల్సిందిగా కోరారు. ఆవిధంగా, కార్పోరేట్ డేటార్ ఐ బి కోడ్ సెక్షన్ 3(12) నిబంధననుసరించిబ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తా లను చెల్లించనందున డిఫాల్ట్ కు పాల్పడినారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
17. బ్యాంకులు జారీ చేసిన గ్యారంటీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. తెలంగాణ హై కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు బ్యాంకు గ్యారంటీలన్నింటికీ సంబంధించినవి కావు. ఇంతే కాకుండ, కార్పోరేట్ డేటార్ కు బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో ఎక్కడా నమోదు చేయబడలేదు. మధ్యంతర ఉత్తర్వు కార్పోరేట్ డేటార్ పై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకుండా మాత్రమే నిరోధిస్తుంది.
18. సెక్షన్ 7 కింద దరఖాస్తు ను తిరస్కరించే అధికారం యన్.సి.యల్.టికి ఉందని భావించినా, ఒకవేళ అందుకు తగిన సముచిత కారణలున్నా, కేసు వాస్తవాల నేపథ్యంలో, యన్.సి.యల్.టి సెక్షన్7 కింద దరఖాస్తు ను నిరాకరించి ఉండవచ్చును.
19. కాబట్టి, అప్పీలులో ఎటువంటి యోగ్యత మాకు కనిపించలేదు, తదనుసారం అప్పీలు కొట్టివేయబడినది. ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు లేవు.