Full Text
భారత సర్వోన్నత న్యాయస్థా నం
సివిల్ అప్పీలు అధికారపరిధి
సివిల్ అప్పీల్ నంబర్(లు) /2023
[స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) నంబరు 6614/2023 నుంచి ఉత్పన్నం]
భీమ్ రావ్ బస్వంత్ రావ్ పాటిల్ ...అప్పీలుదారు(లు)
వర్సెస్
కె. మదన్ మోహన్ రావు మరియు ఇతరులు ...ప్రతివాదు(లు)
తీర్పు
ఎస్. రవీంద్ర భట్, జె.
JUDGMENT
1. అనుమతి మంజూరు చేయబడింది. ప్రతివాది ఎన్నికల పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతూ దాఖలైన కేసును కొట్టేస్తూ తెలంగాణ ఉన్నత న్యాయస్థా నం (ఎన్నికల పిటిషన్ నంబరు 34/2019 లో నిరాకరించబడిన ఐ.ఏ. నంబరు.01/2020) వెలువరించిన తీర్పు మరియు ఉత్తర్వులను స్పెషల్ లీవ్ ద్వారా సవాల్ చేస్తూ ప్రస్తు త అప్పీలు దాఖలైంది. ఎన్నికల పిటిషను (ఇకమీదట "పిటిషన్ ను") దావా చర్యను వెల్లడించలేదని మరియు శాసనపరంగా కాలపరిమితి దాటిపోయిందని మరియు నిరాకరించదగినదని అప్పీలుదారు పేర్కొన్నారు.
2. 11.04.2019 న జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి నిర్వహించిన ఎన్నికల్లో అప్పీలుదారు గెలుపొందిన అభ్యర్ధి. ఆయన 622 ఓట్ల తేడాతో ప్రతివాదిని (ఇకమీదట "ఎన్నికల పిటిషనర్"ను) ఓడించడంతో ఆయన ఎన్నికైనట్లు గా 23.05.2019 న ప్రకటించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (ఇకమీదట "చట్టం") లోని సెక్షన్లు 100(1)(డి) (i)(ii)(iii) మరియు (iv) కింద ప్రతివాది ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఇతర విషయాలతో పాటుగా ఎన్నికల పిటిషన్ లో వెల్లడించిన అంశాలు, అప్పీలుదారు తప్పుడు వివరాలతో ఫారం 26 (ఎన్నికల అఫిడవిట్టు ) దాఖలు చేశారని; రిటర్నింగ్ అధికారి 10.10.2018 న ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్టబద్ధమైన నిబంధనలను అనుసరించలేదని, జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించిన సి-4 నివేదికలో తప్పుడు సమాచారం సమర్పించారని; మరియు అప్పీలుదారుపై పెండింగులో వున్న కేసులకు, పడిన శిక్షలకు సంబంధించిన కేసుల విషయంలో గతంలో ఎటువంటి పత్రాలను ప్రచురించలేదు. ఇతర ఆరోపణలలో ప్రచురణ ఫారంలో పేర్కొన్న ఫాంట్ పరిమాణం వంటి అదనపు అవసరాలను అనుసరించడంలో వైఫల్యం; ప్రత్యేక వరుసలలో కేసుల జాబితా; విస్తృతంగా ప్రసారం చేయబడిన వార్తా పత్రిక/వార్తా చానెళ్లలో పెండింగులో వున్న కేసులను బహిర్గతం చేయడంలో వైఫల్యం; మరియు అప్పీలుదారు దోషిగా నిర్ధా రించబడిన కేసులకు సంబంధించి సమాచారాన్ని బహిర్గతం చేయడం మరియు చివరగా వార్తా పత్రిక ప్రచురణలో అతని పేరుని పెడదారిపట్టించేరీతిలో చూపించడం వంటివి ఉన్నాయి.
3. ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, అప్పీలుదారు దానిని నిరాకరించడం కోసం వ్యవహార స్మృతి (సివిల్ ప్రొసీజర్ కోడ్) (ఇకపై సీపీసీ) లోని ఆర్డర్ VII రూల్ 11 కింద దరఖాస్తు చేశారు. చట్టంలోని సెక్షన్లు 81 మరియు మరియు 81(3) ప్రకారం కర్తవ్యాదేశ అవసరాలను పాటించలేదని, ఇతర విషయాలతో పాటుగా వాదించారు. నామినేషన్ పత్రాన్ని తగనివిధంగా ఎలా ఆమోదించారు అన్నదానికి ఎటువంటి అభ్యర్ధన లేదని కూడా వాదించారు; అప్పీలుదారుకు ఒక సంవత్సరం కంటే ఎక్కువ జైలు శిక్ష విధించనందున చట్టంలోని సెక్షన్ 7 మరియు సెక్షన్ 33 ఎ పరిధిలోకి రాకపోవడంవల్ల సదరు క్రిమినల్ కేసులను బహిర్గతం చేయాల్సిన అవసరంలేదు; ఫలితంగా, వేతనాల చెల్లింపు చట్టం, 1936 మరియు కనీస వేతనాల చట్టం, 1948 కింద నేరారోపణను బహిరంగపరచాల్సిన అవసరం లేదు. ఇది అప్పీలుదారుపై మరింతగా ఆపాదించిన నేరాలు నేరపూరితమైనవి కావని, మరియు ప్రచురణ మరియు ఫాంట్ పరిమాణం మొదలైన వాటికి సంబంధించి ఇతర ఆరోపణలు వాస్తవం కావని, మరియు, మరోవైపు శాసనం మరియు చట్టబద్ధమైన నిబంధనలకు గణనీయమైన అంగీకారం ఉందని ఎన్నికల పిటిషనర్/ప్రతివాది దరఖాస్తు ను ప్రతిఘటించారు. దాని తర్వాత అప్పీలుదారు ప్రత్యుత్తరం (రీజాయిండర్) దాఖలు చేశారు.
4. విచారణ సమయంలో 15.11.2021 న ఒక మెమో (యు.యస్.ఆర్ 69931/2021 గా నమోదు చేయబడింది) ను దాఖలు చేశారు. అందులో చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్, గర్వా కోర్టు లోని సంబంధిత క్రిమినల్ కేసు నుండి సీఎఫ్ 97/2013 లో ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి 28.06.2013 నాటి ఉత్తరవు జాబితా (ఆర్డర్ షీట్) యొక్క సర్టిఫైడ్ కాపీలను తాను పొందినట్లు గా పేర్కొన్నారు. వాటి ఆంగ్ల అనువాదాలు అందుబాటులో ఉంచబడ్డా యి. ఎన్నికల పిటిషనర్ వాదనతో విభేదించడానికి ఈ పత్రాలను ఎన్నికల ప్రొసీడింగులలో దాఖలు చేశారు. ఎన్నికల పిటిషన్ తో పాటు వాస్తవిక కాపీలుగా సమర్పించిన పత్రాలు మరియు చేసిన వాదనలు అబద్ధమని ఆరోపిస్తూ, ప్రతివాదిపై తగువిధమైన క్రిమినల్ చర్యలను చేపట్టా లని విజ్ఞప్తి చేస్తూ, అప్పీలుదారు శిక్షాస్మృతి (సీఆర్పీసీ) సెక్షన్ 195 తో పాటు శిక్షాస్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) (ఇకపై సీఆర్పీసీ) సెక్షన్ 340 రెడ్ విత్ సెక్షన్ 195 సీఆర్పీసీ కింద దరఖాస్తు కూడా చేశారు.
5. ఉన్నత న్యాయస్థా నం (హై కోర్టు ) ఇంతకుమునుపు దరఖాస్తు ను (ఈ.పీ.నంబరు 34/2019 లో ఐ.ఎ.నంబరు 1/2020) విచారించింది మరియు 23.12.2021 తేదీన ఉత్తర్వులను వాయిదా వేసింది. 15.06.2022 తేదీన ప్రతివాది యొక్క ఎన్నికల పిటిషన్ ను నిరాకరిస్తూ అప్పీలుదారు దరఖాస్తు ను అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ఈ కోర్టు 12.09.2022 న ఎస్.ఎల్.పీ (సి) 17247/2022) ఆ ఉత్తర్వును పక్కనపెట్టింది. కోర్టు ఉత్తర్వులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను పరిష్కరించిన తేదీన కూడా, అనగా 26.09.2022 న తిరస్కరణ దరఖాస్తు ను అనుమతించడానికి గల కారణాలను న్యాయమూర్తి ఇవ్వలేదు.
6. ప్రస్తు త కేసులో, పార్టీల వివాదాలు, లిఖిత పూర్వక కథనాలు (ప్లీడింగ్స్) కూడా ఉన్నత న్యాయస్థా నం (హై కోర్టు ) గమనించింది మరియు ఆర్డర్ VII రూల్ 11 వ్యవహారస్మృతి (సీపీసీ) నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, విచారణ సమయంలో పిటిషన్ లోని ధృఢవచనాలు మరియు వాటితో పాటు వున్న పత్రాలను మాత్రమే పరిశీలించవచ్చునని అంతేకానీ రికార్డు లో ప్రవేశపెట్టిన మరేతర విషయాలను పరిశీలించరాదని కోర్టు కూడా అభిప్రాయపడింది. అయితే రికార్డు లో అందుబాటులోనున్న సమస్త విషయాలను స్థూలంగా పరిశీలించడం అన్నది ఎన్నికల పిటిషన్ ను తిరస్కరించడానికి బలవంతపు కారణం కాబోదని కోర్టు అభిప్రాయపడింది. ఫలితంగా, విచారణ సమయంలో వాదనలను వినిపించడానికి అవకాశం కల్పిస్తూ అప్పీలుదారు దరఖాస్తు కొట్టివేయబడింది.
7. అప్పీలుదారు ప్రధాన వాదన ఏమిటంటే, తప్పనిసరి అవసరాలుగా పేర్కొన్నవాటిని అమలుపరచడంలేదని ఎన్నికల పిటిషనర్ అన్నందుకు అప్పీలుదారు తన వివరణకు సంబంధించి అనేక ప్రాధమికాంశాలు విశదపరచినప్పటికీ సెక్షన్ 81(3) అమలు పరచలేదని కూడా నిరూపించబడినది. అయితే, విచారణ సమయంలో, అప్పీలుదారు తరపున సీనియర్ న్యాయవాది శ్రీ సి.యస్.సుందరం చేసిన వాదనలు క్రిమినల్ కేసులను బహిర్గతం చేయకపోవడానికి సంబంధించిన అంశానికి మాత్రమే పరిమితమయ్యాయి. మొదటిది, సీజేయం, గర్వా ముందు పెండింగులో వున్న క్రిమినల్ కేసు, సీఆర్ 96 పి కి సంబంధించినది; కేసు నంబరు సిఎఫ్ 97/3 తేదీ 20.03.2013 ఫారం 26 లో అనగా ఎన్నికల అఫిడవిట్లు, రెండో కేసు ఫారం 26 లో దోషనిర్ధా రణ బహిర్గతం చేయకపోవడానికి సంబంధించినది. ఎన్నికల పిటిషన్ లో పేర్కొనబడిన కేసులు, అనగా లేబర్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ వర్సెస్ మెస్సర్స్ పాటిల్ కన్ స్ట్రక్షన్, ప్రాతినిధ్యం వహించినవారు (1) మిస్టర్ బి.బి. పాటిల్ (పార్ట్ నర్) మరియు (2) మిస్టర్ ఎం.బి.పాటిల్ (పార్ట్ నర్) (కేసు నంబరు 20/12), ఈ కేసు వేతనాల చెల్లింపు చట్టం, 1936 మరియు వేతనాల చెల్లింపు (గనులు) నియమాలు, 1956 ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకపోవడానికి సంబంధించినది. అప్పీలుదారు 30.07.2013 న దోషిగా నిర్ధా రించబడ్డా డు; రెండో కేసు స్టేట్ త్రూ లేబర్ ఎన్ ఫోర్స్ మెంట్ అఫీసర్ వర్సెస్ మెస్సర్స్ పాటిల్ కన్ స్ట్రక్షన్, ప్రాతినిధ్యం వహించినవరు బి.బి. పాటిల్ మరియు ఎం.బి. పాటిల్ కు సంబంధించినది. ఈ కేసు కార్మికుల/యజమానుల రికార్డు లను నిర్వహించినందుకు కనీస వేతనాల చట్టం, 1948 లోని సెక్షన్ 22 ఎ కింద సబ్ డివిజనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు లో నమోదు చేయబడింది. అప్పీలుదారు 05.09.2017 న దోషిగా నిర్ధా రించబడ్డా డు.
8. ఎన్నికల పిటిషన్ తో పాటు దాఖలు చేసిన పత్రాలలో సీజేయం గర్వాల్ జిల్లా ముందు పెండింగులో వున్న కేసును సూచించడం ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుంది మరియు మధ్యలో చేర్చబడినట్లు గా స్పష్టమవుతోదని శ్రీ సుందరం వాదించారు. 27 వ పేరాలోని ప్రధాన తీర్పు ద్వారా ఈ అంశాన్ని గుర్తించామని, ఆమేరకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని పరిశీలించిన తర్వాత, మధ్యలో విషయానికి కొంత చేర్చబడినట్లు కోర్టు గమనించింది. విద్యావంతులైన న్యాయవాది నివేదనలను పునరుద్ఘాటించడంతో పాటు రికార్డు లో ఉంచిన సర్టిఫైడ్ కాపీలను సూచించారు. ప్రస్తు త విచారణ సమయలో ఈ కోర్టు ఆజ్ఞాపించి తెప్పించిన వాస్తవిక ఫిర్యాదును కూడా ఆయన ప్రస్తా వించారు. వేతనాల చెల్లింపు చట్టం మరియు కనీస వేతనాలను విషయంలో రెండు కేసులను బహిర్గతం చేయకపోవడానికి సంబంధించి మరియు విచారణ సమయంలో అవి పరిష్కరించబడతాయని హై కోర్టు వెలిబుచ్చిన ముగింపు పొరపాటు అని కూడా పేర్కొన్నారు. విద్యావంతులైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టంలోని సెక్షన్ 33 ఎ లో సూచించినవిధంగా శిక్షపైన కూడా కనీస పరిమితికి సంబంధించి సంతృప్తి చెందలేదు, ఎందుకంటే ఏవిధంగా చూసినా, గరిష్ట మంజూరు జరిమానా మాత్రమే.
9. ఎన్నికల పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది డా. ఏ.ఎం.సింఘ్వీ వివాదాస్పద ఉత్తరవు ఆర్డర్ VII రుల్ల్ 11 కి సంబంధించిన చట్టా న్ని సబబుగా అంచనావేస్తూ అప్పీలుదారు దరఖాస్తు ను కొట్టివేసిందని విన్నవించారు. క్రిమినల్ కేసులకు సంబంధించి సత్యాన్ని దాచిపెట్టడం, అనగా, పిటిషనర్ దోషిగా తేలిన కేసులను బహిర్గతం చేయకపోవడం మరియు పెండింగులో వున్న కేసులకు సంబంధించి ఫారం-26 అఫిడవిట్ లో ఈ కిందివాటికి సంబంధించినవి ఉన్నాయని న్యాయవాది పునరుద్ఘాటించారు: ఎ) పెండింగులో వున్నకేసులు; అటవీశాఖ కేసులకు సంబంధించి చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్, గర్వా ముందు పెండింగ్ లో వున్న క్రిమినల్ కేసును అప్పీలుదారు వెల్లడించలేదు. బి)అప్పీలుదారు దోషిగా నిర్ధా రించబడిన కేసులకు సంబంధించి (ఫారం-26 లోని సెక్షన్ 6) నిజాన్ని దాచిపెట్టడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగింది; అప్పీలుదారు దోషిగా నిర్ధా రించబడిన కేసులు రెండు ఉన్నప్పుడు "వర్తించదు" అని వ్రాశారు: మొదటగా వేతనాలు మరియు కనీస వేతనాల చెల్లింపు చట్టా నికి సంబంధించిన కార్మిక కేసు, మరియు రెండోది, కేసు నంబరు 1/2013, వేతనాల చెల్లింపు మరియు కనీస వేతనాల చెల్లింపు చట్టా నికి సంబంధించిన మరో కేసు.
10. వాస్తవానికి ఆ కేసులు ఉన్నాయా, ఉంటే అవి చట్టనిబంధనలకు సంబంధించినవేనా అనే విషయాల యోగ్యతలోకి వెళ్లడమనేది ఒక చిన్నపాటి విచారణకు సమానమని, ఇది పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తు ను పరిశీలించేటప్పుడు స్పష్టంగా అనుమతించబడకపోవడమన్నది సుస్పష్టమని వెల్లడించారు. ఈ విషయంపై శాసనం సువ్యవస్థితమేనని తెలిపారు. సలీంభాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2002 (5) సప్లిమెంట్ యస్ సీఅర్ 491) మరియు మాయర్ (హెచ్.కె.) లిమిటెడ్ వర్సెస్ ఓనర్స్ అండ్ పార్టీస్, వెజెల్ యం.వి.ఫార్చూన్ ఎక్స్ ప్రెస్ (2006 (1) యస్.సి.ఆర్ 860) వంటి ఈ కోర్టు తీర్పులు అనిశ్చితపరంగా, ఆర్డర్ VII రూల్ 11 వ్యవహారస్మృతి (సీపీసీ) కింద ఒక దరఖాస్తు ను పరిశీలిస్తు న్నప్పుడు, లిఖిత కథనాలలోని ధృడ వచనాలు (అనగా దావా లేదా పిటిషన్ లో) ఇంకా దానితో పాటు వున్న పత్రాలను మాత్రమే పరిశీలించవచ్చని నిర్ధా రించబడింది. అందువల్ల, పిటిషన్ లో భాగం కానటువంటి, రెస్పాండెంటు/ప్రతివాది అభ్యర్ధనలో భాగంగా సమర్పించిన ఏదైన పత్రాన్ని సూచించడం మరియు దానిపై ఆధారపడటం పరిశీలనకు స్వీకరించబడదు.
11. ప్రజామోదమైన నిర్ణయాలను గౌరవించడం నిస్సందేహంగా ముఖ్యమని, అయితే కోర్టు లు వాటిని భంగపరిచేక్రమంలో నిదానంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రక్రియ స్వఛ్చతను పాటించడం కూడా అంతే ముఖ్యమని తరువాత విజ్ఞప్తి చేశారు. అందువల్ల, తమ విధానంలో మితిమీరిన సాంకేతిక అభ్యంతరాలతో వ్యవహరించకుండా మరియు గ్రౌండ్ రియాలిటీలను విస్మరించకుండా చట్టపరిధిలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని పరిశీలించడం కోర్టు ల విద్యుక్తధర్మం. విశ్లేషణ మరియు నిర్ధా రణలు:
12. ప్రతి అభ్యర్ధి నేపధ్యం గురించి పూర్తిగా బహిర్గతం చేయాల్సిన ఆవశ్యకతను సూచించే చట్టంలోని సెక్షన్ 33 ఎ ఈ కిందివిధంగా ఉంది: “33 ఎ. సమాచారమునకు హక్కు: (1) అభ్యర్ధి, ఈ చట్టం లేదా దాని కింద రూపొందించిన నిబంధల ప్రకారం, సెక్షన్ 33 లోని సబ్ సెక్షన్ (1) కింద పొందుపర్చబడిన తన నామినేషన్ పత్రంలో సమర్పించాల్సిన ప్రత్యేక సమాచారంతో పాటు, ఈ కింది సమాచారాన్ని కూడా సమర్పించాలి, - (i) సమర్ధ అధికారపరిధిగల కోర్టు పెండింగులో వున్న ఏదైన నిందారోపణమీద రెండు సంవత్సరాలు గాని అంతకంటే ఎక్కువ కాలం కానీ జైలు శిక్ష విధించదగిన ఏదైనా నేరంలో అతడు నిందితుడైతే; (ii) అతను [సబ్-సెక్షన్ (1) లేదా సబ్-సెక్షన్ (2) లో పేర్కొన్న ఏ నేరము కాకుండా, లేదా సెక్షన్ 8 లోని సబ్-సెక్షన్ (3) లో ప్రస్తా వించబడిన నేరం నిర్ధా రించబడి], ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడితే. (2) అభ్యర్ధి లేదా అతని ప్రతిపాదకుడు, సందర్భానుసారంగా, సెక్షన్ 33 లోని సబ్-సెక్షన్ (1) కింద నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి (రిటర్నింగ్ ఆఫీసరు)కి అందజేసే సమయంలో, సబ్-సెక్షన్ (1)లో పేర్కొన్న సమాచారాన్ని ధృవీకరిస్తూ నిర్ణీత ఫారంలో అభ్యర్ధి ప్రమాణం చేసిన అఫిడవిట్టు ను కూడా ఆ అధికారికి అందజేయాలి. (3) ఎన్నికల అధికారి (రిటర్నింగ్ ఆఫీసరు) సెక్షన్ (1) కింద తనకు సమాచారం సమకూర్చిన వెంటనే, నామినేషన్ పత్రం అందజేయబడిన నియోజకవర్గానికి సంబంధించిన నియామకుల సమాచారం కోసం అతని కార్యాలయంలో సబ్-సెక్షన్ (2) కింద అందించబడిన అఫిడవిట్ కాపీని తన కార్యాలయం వద్ద ఒక ప్రముఖ స్థలంలో తగిలించడం ద్వారా పైన పేర్కొన్న సమాచారాన్ని ప్రదర్శించాలి." దోషనిర్ధా రణ తర్వాత ఎన్నికైన అభ్యర్ధు లను అనర్హులుగా ప్రకటించడానికి సెక్షన్ 8 నిబంధన చేయబడింది. అయితే, 2002 లో చట్టసవరణతో ప్రవేశపెట్టిన సెక్షన్ 33 ఎ, తమ అభ్యర్ధిత్వాన్ని నిలబెట్టు కున్నవారు తమ నేరపరమైన గతాన్ని బహిర్గతం చేయాల్సిందిగా నిర్దేశిస్తుంది. ఈ నిబంధన వెనుక వున్న ఆలోచన ఏమిటంటే, పారదర్శకతను నిర్ధా రించడం మరియు ఓటు వేసేటప్పుడు ఓటర్లు నిశ్చిత ఎంపిక చేసుకునేలా చేయడం. అభ్యర్ధు ల ద్వారా విస్పష్ట ప్రకటన చేయాల్సిన ఆవశ్యకతను ఈ కోర్టు పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ మరియు ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (యు.ఓ.ఐ.) మరియు ఇతరులు (2018 (10) యస్.సి.ఆర్.141) కేసులో ధృఢంగా చెప్పింది, దీనికి ఎన్నికల చిహ్నాల (ప్రత్యేకింపు మరియు కేటాయింపు) ఉత్తరువు, 1968 కి తగిన విధంగా సవరణ చేయబడాలి. కోర్టు ఈ విధంగా పేర్కొంది: "ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశించిన విధంగా, అందుబాటులో వున్న సర్వోత్తమ వ్యక్తు లకు నేరపరమైన గతం ఉండకూడదు మరియు వారి నేపధ్యం, ఆస్తు లు ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకొనే హక్కు ఓటర్లకు ఉండాలి. ఆ విధంగా చెప్పడానికి మేము మా సమ్మతిని తెలియజేస్తు న్నాము, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యములో, రాజకీయాలను నేరపూరితం చేయడమనే తీవ్ర విపత్కర మరియు విచారకరమైన పరిస్థితి కారణంగా ప్రజాస్వామ్యములో అవినీతిపట్ల పౌరులు చెవిటి మరియు మౌన ప్రేక్షకులుగా నిస్సహాయ వైఖరి అవలంభించేలా బలవంతమొనరించలేరు. ఓటర్లను తమ ప్రారబ్దా నికి విడిచిపెట్టడానికి అనుమతించలేము. అభ్యర్ధి ఇచ్చిన సమాచారం చట్ట ప్రకారం ఎన్నికల సంఘం అధికారికంగా అనుమతి ఇచ్చిన విషయాలను సమర్ధించేటట్టు గా ఉండాలి. గతాన్ని బహిర్గతం చేయడం వల్ల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడాంతో పాటు ఓటర్లు ఓటు వేసే హక్కును వినియోగించుకోవడంవల్ల నియోజకవర్గం కూడా పవిత్రమవుతుంది. ప్రజాస్వామ్యానికి అటువంటి హక్కు శ్రేష్టమైనదని గుర్తుంచుకోవాలి. అభ్యర్ధిని తెలివిగా ఎంపిక చేసుకొనే హక్కు ఓటరుకు ఉంటుంది. సరియైన సమాచారాన్ని పొందే అతని హక్కును గనుక హరించి ఉన్నట్లయితే, అంతిమంగా అది ప్రజాస్వామ్య వినాశనానికి దారితీయొచ్చు. ఎందుకంటే అభ్యర్ధు ల నేరచరిత్ర గురించి అతనికి తెలియపరచకపోకపోతే అతను జాగృత ఓటరుగా పరిగణించబడడు. ప్రస్తు త సహజ దృష్యవివరణలో అభ్యర్ధు లు వెల్లడించిన సమాచారం నియోజకవర్గంలో పెద్దగా తెలియదు మరియు ఓటర్లు చాలామంది అభ్యర్ధు ల గతాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు. సమాచారం తెలుసుకోవాలన్న వారి హక్కు దెబ్బతింటుంది. 116.పైన పేర్కొన్నవాటిని దృష్టిలో ఉంచుకొని, ఈ కోర్టు నిర్ణయాలకు అనుగుణంగా ఈ కింది ఆదేశాలను జారీచేయడం సముచితమని మేము భావిస్తు న్నము: (i) పోటీ చేసే ప్రతి అభ్యర్ధి ఎన్నికల సంఘం ఇచ్చి ఫారంను పూరించాలి మరియు ఫారంలో నిర్దేశించబడిన వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలి. (ii) అభ్యర్ధిపై వున్న క్రిమినల్ కేసులను మందమైన అక్షరాలలో అది తెలియపరచాలి. (iii) అభ్యర్ధి ఒక నిర్దిష్ట పార్టీ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేస్తు న్నట్లయితే, అతను/ఆమె అతనిపై/ఆమెపై వున్న క్రిమినల్ కేసుల గురించి పార్టీకి తెలియజేయాలి. (iv) నేరపరమైన గతం వున్న అభ్యర్ధు లకు సంబంధించి పైన పేర్కొన్న సమాచారాన్ని సంబంధిత రాజకీయపార్టీ తన వెబ్ సైట్ లో ఉంచడం తప్పనిసరి. (v) అభ్యర్ధి, అలాగే సంబంధిత రాజకీయ పార్టీ అభ్యర్ధి గతాన్ని స్థా నికంగా వెలువడే వార్తా పత్రికలలో ప్రకటనను జారీచేయాలి మరియు విద్యుత్కరణ మాధ్యమాలలో (ఎలక్ట్రా నిక్ మీడియా) లో కూడా విస్తా రంగా ప్రచారం చేయాలి. విస్తా రమైన ప్రచారమని చెప్పినప్పుడు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత కనీసం మూడుసార్లు అలాగే చేయాలని మా భావన.”
13. ప్రజాప్రాతినిధ్య (మూడవ సవరణ) చట్టం, 2002 ద్వారా చేర్చబడిన సెక్షన్ 33-బి, ఇతర విషయాలతో పాటు "...ఏ అభ్యర్ధి కూడా తన ఎన్నికకు సంబంధించి, ఈ చట్టం లేదా దానికింద రూపొందినబడిన నిబంధనల ప్రకారం అటువంటి సమాచారాన్ని బహిరంగ పర్చడానికి లేదా సమకూర్చడానికి లేఅటువంటి సమాచారాన్ని బహిర్గత చేయడానికి లేదా సమకూర్చడానికి జవాబుదారీగా ఉండరు." ఈ కోర్టు, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబిర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా [(2003) 4 యస్.సి.సి. 399)] కేసులో ఆ నిబంధన చెల్లదని, రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. సెక్షన్ 33-బి "తక్షణావసరం మరియు భవిష్యత్తు అవసరాలు మరియు ఉపయోగాలతో సంబంధం లేకుండా చట్టంలో నిర్దేశించిన నిషేధం మరియు ప్రచారం కాకుండా ఇతర సమాచారాన్ని వ్యాపింప చేయడంపై నిషేధం విధించింది మరియు తర్వాత ఇప్పుడు అందించిన సమాచారాన్ని బహిర్గతం చేయడంలో సముచితత్వం మరియు లోపం వున్నప్పటికీ నైషేధం కొనసాగుతుంది." అని కోర్టు పేర్కొంది చైతన్యవంతమైన ప్రజాస్వామ్య నిర్వహణకు ఇది చాలా ముఖ్యమని అంతిమంగా నిర్ణయించబడింది.
14. ఈ కోర్టు నిర్ణయం మరియు ఆదేశాలకు అనుగుణంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీజేసింది మరియు పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులను మరియు అభ్యర్ధి(లు) దోషులుగా నిర్ధా రించబడిన వాటిని బహిర్గతం చేయడంలొ పరస్పర ప్రకటనలు అవసరమయ్యే మార్గదర్శకాలలో భాగమైన ఫారంలను కూడా రూపొందించింది. 10.10.2018 తేదీన ఎన్నికల సంఘం ఇతర విషయాలతోపాటు మొదట జారీచేసిన మార్గదర్శకాల సంబంధిత సారాంశం ఈ కింది విధంగా ఉంది: "2. పైన పేర్కొన్న తీర్పులోని అదేశాలను అనుగుణంగా, సంఘం (కమీషన్) తగిన పరిశీలన తర్వాత, తమపైన క్రిమినల్ కేసులు, పెండింగులో ఉన్నవి గాని లేదా గతంలో దోషనిర్ధా రణ చేయబడినవి గాని ఉన్న పార్లమెంటు మరియు రాష్ట్రా ల శాసనసభల ఎన్నికల అభ్యర్ధు లు ఈ కింది ఆదేశాలను అనుసరించాల్సిందిగా సూచించడమైనది. (ఎ) పార్లమెంటులోని దిగువసభ, రాజ్యసభ, శాసనసభ లేదా శాసనమండలి ఎన్నికలలో తమపై క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్ధు లు తమ క్రిమినల్ కేసుల గురించి తమ నియోజకవర్గ ప్రాంతంలోని విస్తృతంగా సర్క్యులేషన్ ఉండే వార్తా పత్రికలలో విస్తృత ప్రచారమయ్యే ప్రకటన విడుదల చేయాలి. ఈ ప్రకటన ఇందులో జతచేయబడిన ఫార్మాట్ సి-1 లో అభ్యర్తిత్వాలను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ తర్వాతి రోజునుండి కనీసం మూడు రోజులలో ఇంకా ఎన్నికల తేదీకి రెండురోజుల ముందు వరకు ప్రచురించబడాలి. xxxxxx xxxxxx xxxxxx
3. క్రిమినల్ కేసులు, పెండింగులో వున్న లేదా గతంలో దోషనిర్ధా రణ చేయబడివున్న అభ్యర్ధు లను ఎంపికచేసిన గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలు మరియు గుర్తింపులేని నమోదిత పార్టీలు, విస్తృత ప్రచారం కోసం తమ వెబ్ సైట్ లోనూ మరియు టీవీలోనూ అలాగే సంబంధిత రాష్ట్రంలో విస్తృతంగా సర్క్యులేషన్ ఉన్న వార్తా పత్రికలోనూ దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేయాలి. దీనికి సంబంధించి ప్రకటన, ఇందులో జతపరచబడిన ఫార్మాట్ సి-2 లో పొందుపరచబడింది, మరియు రాష్ట్రా ల వారీగా ప్రతి రాష్ట్రా నికి/కేంద్ర పాలిత ప్రాంతానికి వేర్వేరు ప్రకటనలు సమకూర్చాలి. పైన పేరా 2(ఎ)లో పేర్కొన్న గరిష్ట వ్యవధిలో కనీసం మూడు వేర్వేరు తేదీలలో వార్తా పత్రికలు మరియు టీవీ చానెళ్లలో ప్రకటనను విడుదల చేయాలి. పైన పేర్కొన్నట్లు గా, వార్తా పత్రికలలో ప్రకటన కనీసం 12 ఫాంట్ పరిమాణంలో కనిపించాలి మరియు విస్తృత ప్రచారంకోసం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించేలా ఉండాలి. టీవీ చానెళ్లలో ప్రకటనను ప్రసారం చేసే సందర్భంలో ఎన్నికల ముగియడానికి నిర్ణయించిన సమయం ముగిసే 48 గంటల వ్యవధి ముందే పూర్తి చేయాలి. అటువంటి రాజకీయ పార్టీలన్నీ తాము ఈ అదేశాలయొక్క అవసరాలను నెరవేర్చినట్లు నిర్ధా రిస్తూ సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతపు ప్రధాన ఎన్నికల అధికారికి నివేదికను సమర్పించాలి మరియు దానికి సంబంధించి పార్టీ ప్రచురించిన ప్రకటనలు కలిగివున్న పేపర్ కటింగులను దానితో పాటు జతచేయాలి. ఎన్నికలు ముగిసిన 30 రోజులలో ఇది పూర్తిచేయాలి. ఈ ఆదేశాలను పాటించడంలో వైఫల్యం, ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ మరియు కేటాయింపు) ఉత్తరువు 1968 లోని పేరా 16-ఎ ప్రయోజనాల నిమిత్తం సంఘం (కమిషన్) యొక్క చట్టబద్ధమైన ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యంగానూ/నిరాకరణగాను పరిగణించబడుతుందని గమనించాలి.
4. అభ్యర్ధు లకు కేటాయించబడిన ప్రభుత్వ గృహవసతికి వ్యతిరేకంగా బకాయిల విషయంలో అదనపు అఫిడవిట్టు కు సంబంధించిన నిబంధనలు ఏవైనా ఉంటే అభ్యర్ధు లకు కేటాయించబడిన వసతి, ప్రభుత్వ ఆర్ధిక సంస్థలు మరియు ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యతల విషయంలో అంశం (8) కింద ఇప్పుడు ఫారం-26 లోనే చేర్చబడినట్టు గా కూడా గమనించవచ్చు. ఎందువల్ల, అభ్యర్ధు లు ఫారం-26 లోని అంశం (8) లో దీనికి సంబంధించి అవసరమైన ప్రకటన/వివరాలను ఇవ్వాలి. దీనిప్రకారం, అభ్యర్ధు లు ఇప్పుడు కమీషనర్ ఉత్తర్వు నంబరు 509/11/2004-జెయస్-1 తేదీ 03.02.2016 ప్రకారం నిర్దేశించిన అదనపు అఫిడవిట్టు ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ నిబంధనలు ఫారం-26 లోనే భాగం కావు.
5. ఈ ఆదేశాలు మీ పార్టీ క్రమంలోని వారందరికీ పంపిణీ (సర్క్యులేట్) చేయవచ్చు మరియు భవిష్యత్ ఎన్నికలలో మార్గదర్శకత్వం కోసం ఇంకా ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించేందుకు పార్టీ అభ్యర్ధు ల దృష్టికి కూడా తీసుకురావచ్చు.”
15. ఇతర అవసరాలలో జిల్లా ఎన్నికల అధికారికి క్రిమినల్ కేసులకు సంబంధించిన ప్రకటనలను అందించిన వార్తా పత్రికల కాపీలను సమర్పించడం, కనీసం మూడు వేర్వేరు తేదీలలో టీవీ చానెళ్లలో ప్రకటనలను ప్రసారం చేయడం, అయితే ఇవి 48 గంటలలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసిన సంవత్సరం లోపు రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్ధు ల విషయంలో, గుర్తింపు పొందిన పార్టీలు లేదా నమోదు కాబడిన గుర్తింపు లేని పార్టీలు అయినా సరే, అటువంటి అభ్యర్ధు లు తమపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి తమ రాజకీయ పార్టీకి తెలియజేసినట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారి ముందు ప్రకటించాల్సి ఉంటుంది. ఫారం-26 లో కొత్తగా చేర్చబడిన అంశం 6(ఎ)లో అటువంటి ప్రకటన కోసం నిబంధన ఏర్పాటు చేయబడినది మరియు ఇతర నిబంధనలు కూడా రూపొందించబడ్డా యి. వార్తా పత్రికలలో ప్రచురణకు సంబంధించిన ఫారం సి-1; "క్రిమినల్ కేసులకు సంబంధించిన ప్రకటన ప్రచురణ గురించి" అభ్యర్ధి ఇచ్చిన నివేదిక ఫారం సి-4 మరియు రూల్ 4 ఎ ప్రకారం ఫారం-26 లో అభ్యర్ధి ఆదాయ వివరాలను ఎన్నికల అఫిడవిట్టు లో వెల్లడిస్తుంది. ఫారం-26 లోని క్లా జ్ 5 లో పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులను మరియు ఏదైనా నేరానికి అభ్యర్ధి దోషిగా నిర్ధా రించబడినవాటిని బహిర్గతం చేయడానికి కాలం కలిగి ఉంది. ప్రస్తు త సందర్భంలో, ఫారం-26 యొక్క ప్రకటన (క్లా జ్ 6 ఎ)తో పాటు అప్పీలుదారు దాఖలు చేసిన సంబంధిత ఫారం ఈ కిందివిధంగా ఉంది: "ఫారం 26 (రూల్ 4 ఎ చూడుము) 05-జహీరబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం (నియోజకవర్గం పేరు) నుండి ప్రజాసభ (లోక్ సభ) (సభ పేరు) ఎన్నికల అధికారి ముందు నామనిర్దేశ పత్రం (నామినేషన్ పేపర్)తో పాటు అభ్యర్ధి దాఖలు చేయవలసిన అఫిడవిట్టు. పార్ట్-ఎ దివంగత బస్వంత్ రావ్ పాటిల్ కుమారుడినైన భీంరావ్ బస్వంత్ రావ్ పాటిల్ అనే నేను, వయస్సు 63 సంవత్సరాలు, నివాసం ఇంటినంబరు 1-9-, కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండలం, తెలంగాణ - 503309 లోని షిర్పూరు గ్రామంలో నివసించే నేను పైన పేర్కొనబడిన ఎన్నికలలో అభ్యర్ధిని, సత్యనిష్ఠా పూర్వకంగా మరియు ప్రమాణపూర్వకంగా వాగ్దా నం చేస్తు న్నాను. xxxxx xxxxx xxxxx (5) పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులు (i) నాపై ఎటువంటి క్రిమినల్ కేసు పెండింగులో లేదని నేను ప్రకటిస్తు న్నాను. (అభ్యర్ధిపై క్రిమినల్ కేసు పెండింగులో లేకపోతే ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి మరియు ప్రత్యామ్నాయానికి ఎదురుగా వర్తించదు అని వ్రాయండి. (ii) దిగువ) లేదా (ii) నాపై ఈ క్రింది క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి: (అభ్యర్ధిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉనంట్లయితే, ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకొని, పైన ఉన్న ప్రత్యామ్నాయం (ఇ)ని కొట్టివేయండి మరియు పెండింగులో ఉన్న అన్ని కేసుల వివరాలను పట్టికలో పేర్కొనండి. (ఎ) సంబంధిత రక్షకభటనిలయం జాబితా జతచేయబడిన జాబితా జతచేయబడిన జాబితా జతచేయబడిన పేరు మరియు చిరునామాతో కూడిన ప్రధమ సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) నంబరు ది అనుసంధానం -I ది అనుసంధానం -I ది అనుసంధానం -I (బి) కోర్టు పేరుతో సహా కేసు నంబరు జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I (సి) చేర్చబడిన సంబంధిత చట్టా లు/సంకేతనా మాల సెక్షన్(లు) (సెక్షన్ సంఖ్యను పేర్కొనండి, ఉ.:భారతీయ శిక్షాస్మృతి (ఐ.పీ.సీ.)వగైరా. జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I (డి) నేరవివరణ క్లు ప్తంగా జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I (ఇ) అభియోగాలు మోపబడినవా (అవును లేదా లేదు లలో తెలపండి ) జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I (ఎఫ్ ) పైన (ఇ) కి సమాధానం 'అవును' అయితే అభియోగాలు మోపబడిన తేదీని పేర్కొనండి జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I జాబితా జతచేయబడిన ది అనుసంధానం -I (జి) ప్రొసీడింగులకు వ్యతిరేకంగా ఏదైనా అప్పీలు/పునరీక్షణ దరఖాస్తు జాబితా జత చేయబడినది అనుసంధానం -I జాబితా జత చేయబడినది అనుసంధానం -I జాబితా జత చేయబడినది అనుసంధానం -I దాఖలైందా (అవును లేదా లేదు)
6. నేరారోపణ కేసులు (కేసెస్ ఆఫ్ కన్విక్షన్) (i) ఎలాంటి క్రిమినల్ నేరంలోనూ దోషిగా గుర్తించబడలేదు. (అభ్యర్ధి దోషిగా గుర్తించబడకపోతే జరగకపోతే ఈ ప్రత్యమ్నాయాన్ని టిక్ చేసి, 'లేదు ' అని వ్రాయండి లేదా (ii) కింద పేర్కొన్న అపరాధాలకు నేను దోషిగా నిర్ధా రించబడ్డా ను: వర్తించదు (అభ్యర్ధి దోషిగా గుర్తించబడితే, ఈ ప్రత్యమ్నాయాన్ని టిక్ చేసి, పైన ఉన్న (i)వ ప్రత్యామ్నాయాన్ని కొట్టివేయండి మరియు దిగువ పట్టికలో వివరాలను పేర్కొనండి): పట్టిక (ఎ) కేసు నంబరు వర్తించదు వర్తించదు వర్తించదు (బి) కోర్టు పేరు వర్తించదు వర్తించదు వర్తించదు (సి) చేర్చబడిన చట్టా లు/సంకేతనామాల సెక్షన్లు (సెక్షన్ సంఖ్యను వర్తించదు వర్తించదు వర్తించదు పేర్కొనండి, ఉదా.: భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)వగైరా.) (డి) దోషిగా నిర్ధా రించబడిన నేర వివరణ (ఇ) దోష నిర్ధా రణ ఉత్తర్వుల తేదీలు (ఎఫ్) విధించబడిన శిక్ష వర్తించదు వర్తించదు వర్తించదు (జి) దోషనిర్ధా రణకు సంబంధించి అప్పీలు ఏదైన దాఖలైందా (అవును లేక లేదుగా పేర్కొనండి) (హెచ్) పైన పేర్కొనబడిన (జి)కి సమాధానం అవును అన్నట్లయితే వివరాలు మరియు అప్పీలు ప్రస్తు త స్థా యిని పేర్కొనండి (6 ఎ) నాపై పెండింగులో ఉన్న అన్ని క్రిమినల్ కేసుల గురించి మరియు (5) మరియు (6)వ పేరాలలో పేర్కొనబడిన అన్ని దోషస్థా పన కేసుల గురించి నేను నా రాజకీయ పార్టీకి పూర్తి మరియు ఈ రోజువరకు ఉన్న సమాచారాన్ని అందించాను: అవును.”
16. కనీస వేతనాల చట్టం, 1948 మరియు వేతనాల చెల్లింపు చట్టం, 1936 ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో అప్పీలుదారు గతంలో దోషిగా నిర్ధా రించబడినందున ఈ కేసులోని ప్రకటన అవాస్తవమని ఎన్నికల పిటిషనర్/ప్రతివాది వాదించారు. ఇందుకు ప్రతిగా అప్పీలుదారు ప్రతివాదం చేస్తూ, అటువంటి సమాచారం అందించడం తప్పనిసరి కాదు, ఎందుకంటే తన దరఖాస్తు లో సెక్షన్ 33 ఎ ప్రకారం పెండింగులో ఉన్న కేసులో సమర్ధ అధికార పరిధగల కోర్టు మోపిన అభియోగంవల్ల రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలిశిక్ష విధించదగిన ఏదైనా నేరానికి పాల్పడిన అభ్యర్ధి సదరు నేరానికి సంబంధించిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుందన్న వాస్తవ కారణం చేత [సెక్షన్ 33 ఎ (1) (ఇ)] అంటూ వాదనలు వినిపించారు. దోషస్థా పన చేసిన సందర్భాలలో, ఆమె లేదా అతను నేరం చేసినట్లు నిర్ధా రించబడినప్పుడు మరియు సెక్షన్ 8(1) లేదా (2) లేదా (3)లో స్పష్టంగా ప్రస్తా వించబడిన అన్యమైన నేరాలు కాకుండా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడినప్పుడు మాత్రమే సెక్షన్ 33 (ఈ) కారణంగా బహిర్గతం చేయవలసి ఉంటుందని కూడా వాదించారు. వాస్తవానికి, ఆ రకమైన నేరాలకు సంబంధించి మాత్రమే సమాచారాన్ని బహిర్గతం చేయాలని నిబంధనలు పేర్కొనడంవల్ల పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి, నిందితుడైన అభ్యర్ధి రెండు సంవత్సరాల కంటే తక్కువ శిక్షను ఎదుర్కోవచ్చు, లేదా దోషిగా నిర్ధా రించబడకపోవచ్చు. మరియు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష విధించబడని క్రిమినల్ కేసులకు సంబంధించి సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడం అవసరం లేదని వెల్లడించారు.
17. కనీస వేతనాల చట్టం మరియు వేతనాల చెల్లింపు చట్టం కింద నేరాలకు సంబంధించిన వివరాలు - ముందు పేర్కొన్నట్లు గా - ముఖ్యమైన సమాచారాన్ని అయినంతవరకు నిలువరించడానికి సంబంధించి ఎన్నికల పిటిషనర్ ఎన్నికల తన పిటిషన్ లో ఆరోపించారు. అభ్యర్ధి దోషిగా ఎక్కడ నిర్ధా రించబడ్డడు, అలాగే భారతీయ అటవీచట్టం కింద అతను ఎక్కడ క్రిమినల్ విచారణను ఎదుర్కుంటున్నాడు అన్న విషయాలను వెల్లడించలేదు. ఈ ఆరోపణకు మద్దతుగా, ఎన్నికల పిటిషనర్ ఫిర్యాదు కాపీలను మరియు కొన్ని ప్రొసీడింగులను గర్వాలోని మేజిస్ట్రేట్ ముంది చేర్చారు. అదేవిధంగా, వేతనాల చెల్లింపు చట్టం మరియు కనీస వేతనాల చట్టం కింద గతంలో దోషనిర్ధా రణకు సంబంధించిన కేసులలో సంబంధిత కోర్టు లో వున్న ప్రొసీడింగులను ప్రస్తా వించారు. అప్పీలుదారు యొక్క ప్రధాన వాదన ఏమిటంటే, ఎన్నికల పిటిషనర్ యొక్క వాదనలు అసత్యం, ఎందుకంటే అవి ఒక పత్రంపై ఆధారపడినవి, అనగా, గర్వాలోని కోర్టు లో అటవీచట్టం కింద నేరాలకు సంబంధించి పెండిగులో వున్న క్రిమినల్ కేసులో కొన్ని ఆర్డర్ షీట్ల కాపీలు మరియు కనీస వేతనాల చట్టం మరియు వేతనాల చెల్లింపు చట్టం కింద గత నేరారోపణలకు సంబంధించినంతవరకు ఏమాత్రం అవసరం లేనివి.
18. అస్పష్టతను తొలగించడానికి ఈ కోర్టు గర్వా కోర్టు లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించిన ఫైలుని తెప్పించింది. ఆ రికార్డు లు ఈ కిందివారిని నిందితులుగా చూపిస్తు న్నాయి:
1. శ్రీ ఎం.బి. పాటిల్, డైరెక్టర్, మెస్సర్స్ పాటిల్ కన్ స్ట్రక్షన్, సన్ ఆఫ్ తెలియదు, సార్గెట్, పూణె, మహారాష్ట్ర
2. శ్రీ రామాయణ్ సింగ్, సన్ ఆఫ్ లేట్ రాం ఛబిల సింగ్, శాస్త్రి నగర్, పీ.యస్. గర్వా, జిల్లా -గర్వా, [ఏ.జి.యం., పాటిల్ కన్ స్ట్రక్షన్, కచేరీ రోడ్, పీ.యస్.-గర్వా, జిల్లా -గర్వా]
3. సంతోష్ సిన్హా, సన్ ఆఫ్ రధా ప్రసాద్ సిన్హా, బిజ్లి కాలనీ, పీ.యస్. గర్వా, జిల్లా గర్వా [వర్కర్, పాటిల్ కన్ స్ట్రక్షన్]
4. ధర్మపాల్, సన్ ఆఫ్ తెలియదు, పాటిల్ కన్ స్ట్రక్షన్, సార్గెట్, పూణె, మహారాష్ట్ర
5. శ్రీరంజన్ దాస్ సన్ ఆఫ్ చక్రధర్ దాస్, 1917 పోఖన్ పుట్, బి.బి.యస్.ఆర్. అటవీశాఖ యొక్క 19.03.2013 తేదీ ఫిర్యాదు/సమాచారంలో స్వాధీనానికి మరియు నేర విచారణకు సంబంధించి మెస్సర్స్ ఎం.బి.పాటిల్, బి.బి. పాటిల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ మరియు మరో నలుగురు (రామాయణ్ సింగ్, సంతోష్ సిన్హా, ధరంపాల్ మరియు రంజన్ దాస్ లను పేర్కొన్నారు) వ్యక్తు ల పేర్లకు (ప్రస్తు త అప్పీలుదారు కాకుండా) 02.04.2013 తేదీనాటి ఆర్డర్ షీట్ పేర్కొంది. మరియు నిందితుడికి వ్యతిరేకంగా అధిపత్రాలు (వారెంట్లు ) జారీ చేయవలసిన అవసరం లేదని పేర్కొంది. అటవీప్రాంతంలోపల మూడింట ఒక వంతు భాగం కంపెనీ నిర్మాణాలు చేపట్టి రాళ్లను పగులగొట్టి స్టొన్ చిప్స్ గా మార్చినట్లు ఆరోపణలున్నాయి. అటవీశాఖ నివేదిక ప్రకారం 5000 క్యూబిక్ ఫీట్ (ఘనపరిమాణం)లో 20.03.2013 తేదీన చిన్న మరియు పెద్ద బండరాళ్లను స్వాధీనం చేసుకున్నారు. మిస్టర్ సంతోష్ సిన్హా, రామాయణ్ సింగ్, ధరంపాల్ మరియు ఎం.బి.పాటిల్ మాత్రమే ఈ నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డా యని 28.06.2013 తేదీ ఆర్డర్ షీట్ సూచిస్తోంది. భరతీయ అటవీ చట్టం కింద ఫిర్యాదులో ఆరోపించిన నేరాలకు అప్పీలుదారులపై అభియోగాలు మోపబడలేదని ఇది స్పష్టంగా సూచిస్తుంది.
19. గత దోషనిర్ధా రణలకు సంబంధించినంత వరకు, అప్పీలుదారు అరోపణలనే కేవలంగా పరిశీలించి (పర్ సె) నిరాకరించలేదు, కానీ పిటిషన్ ను తిరస్కరించడానికి దాఖలు చేసిన దరఖాస్తు లో వారు చెప్పిన చట్టంలోని సెక్షన్ 33 ఎ లో పేర్కొనబడిన నేరాల స్వభావం చెప్పనందున ఈ విధంగా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని హేతుబద్ధంగా వాదించారు.
20. నేరారోపణలు మరియు ఉల్లంఘనల ప్రకారం, కనీస వేతనాల చట్టం, 1948 లోని నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 22 లో శిక్ష పేర్కొనబడింది. అది గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష లేదా రూ.500/- వరకు జరిమానాను నిర్దేశిస్తుంది. ఇతర నేరాలకు సెక్షన్ 22 ఎ రూ.500/- వరకు జరిమానా విధించే శిక్షను నిర్దేశిస్తుంది. వేతనాల చెల్లింపు చట్టం, 1936 కి సంబంధించి, సెక్షన్ 20 లోని జరిమానా గరిష్టంగా రూ. 7500/- గా నిర్దేశిస్తుంది. అదే నిబంధన ప్రకారం తదుపరి దోష నిర్ధా రణ కఠినమైన శిక్షను కోరుతుంది: ఒక నెల రోజుల జైలు శిక్ష, ఆరునెలల వరకు పొడిగించబడగలదు.
21. ఇంతకుముందు గమనించినట్లు గా, వివాదాస్పద ఉత్తరవు, ఎన్నికల కార్యవ్యవహారాలలో ప్రతివాదిగా ఉన్న గెలుపొందిన అభ్యర్ధి రికార్డు లో ప్రవేశపెట్టిన ఏదైనా విషయాన్ని, పిటిషన్ ను పూర్తిగా తిరస్కరించడానికి ఆరోపణ చేయబడిన ఉత్తరువు సూచించబడినట్లు గా (ఇప్సో ఫ్యాక్టో) ఆర్డర్ VII రూల్ 11 వ్యవహారస్మృతి (సీపీసీ) చట్టంలో ఇమిడినట్లు గా పరిగణించలేమనే తర్కంపైన ఆధారపడింది. అయితే, ఈ కోర్టు అభిప్రాయంలో సదరు అవగాహన సరైనదే. అదే సమయంలో రికార్డు లో అంశాలున్నప్పుడు, పరిస్థితులనుబట్టి ఆర్డర్ VII రూల్ 11 వ్యవహారస్మృతి (సీపీసీ) ద్వారా వీటిని పరిశీలించడానికి స్వీకరించకపోవచ్చు. కానీ ఆర్డర్ XII రూల్ 6 వ్యవహారస్మృతి (సీపీసీ) (అడ్మిషన్ పై డిక్రీ) అధికార పరిధిలోకి రావచ్చు. అది ఈ కింది విధంగా ఉంది: "అడ్మిషన్లపై తీర్పు -(1) అభ్యర్ధనలో లేదా ఇతరత్రా, మౌఖికంగా గానీ లేదా లిఖితపూర్వకంగా గానీ యదార్ధతను అంగీకరించినట్లైతే, కోర్టు దావాలోని ఏ దశలోనైనా, ఏదైనా పక్షం యొక్క దరఖాస్తు పైన లేదా దాని స్వంత ప్రతిపాదనపైన అయినా, పార్టీల మధ్య ఏవైనా ఇతర ప్రశ్నల నిర్ధా రణ కోసం వేచి చూడకుండా అటువంటి అడ్మిషన్లకు సంబంధించి, అటువంటి ఉత్తరవును వెలువరించవచ్చును లేదా సబబుగా భావించే తీర్పును ఇవ్వవచ్చును. (2) సబ్-రూల్ (1) కింద తీర్పు వెలువడినప్పుడల్లా, తీర్పుకు అనుగుణంగా ఒక డిక్రీని రూపొందించాలి మరియు ఆ డిక్రీ తీర్పు వెలువడిన తేదీని కలిగి ఉండాలి.”
22. వ్యవహారస్మృతి (సీపీసీ) ఆర్డర్ XII రూల్ 6, సబ్-రూల్ 1 లో పేర్కొన్న "అన్యధా" అనే వ్యక్తీకరణ కేవలం అభ్యర్ధనలకు మాత్రమే పరిమితం కాదని, ఫిర్యాదు లేదా ప్రధాన అభ్యర్ధన లేదా ఇతర అంశాలతో పాటు తదనంతరం దాఖలు చేసిన పత్రాలను, అవతలిపక్షం అంగీకరించినవి కూడా కలిగిఉంటుందని ఈ కోర్టు నిర్ధా రించింది. మరోమాటలో చెప్పాలంటే, నిరాకరించబడని మరియు కోర్టు డిక్రీని వెలువరించడానికి దారితీసే వాస్తవాలను కలిగిఉన్న రికార్డు లోని విషయం, కోర్టు ఆ విధంగా చర్యను చేయడానికి సరిపడుతుంది మరియు కోర్టు తీర్పు ద్వారా డిక్రీకి (ఈ సందర్భంలో, పిటిషన్) పూర్తిగా లేదా పాక్షికంగా ఆదేశించవచ్చు.
23. అటవీచట్టం నేరాలకు సంబంధించిన కేసులో ఉపయోగించిన ఒక పత్రం (అనగా, కోర్టు సంబంధిత పత్రాలు మరియు ఉత్తరువుల ఛాయాముద్రితం) నిజపత్రాలు కావని, పైగా అప్పీలుదారు పేరు (అనగా, బి.బి.పాటిల్) చేర్చినట్టు గా మార్పులు చేర్పులతో కూడి ఉన్నాయని అప్పీలుదారు వాదన. శిక్షాస్మృతి (సీఆర్పీసీ) సెక్షన్ 340 రెడ్ విత్ సెక్షన్ 195 కింద హై కోర్టు లో చర్యలు ప్రారంభించాలని అప్పీలుదారు కోరారు. అటువంటి ఛాయాచిత్రాన్ని జతపర్చడం నేరం కిందికి వస్తుందా అన్న విషయం గురించి ఈ కోర్టు ఎలాంటి అభిప్రయాన్ని వ్యక్తం చేయడానికి ఇష్టపడదు. అప్పీలుదారు ఆరోపించిన "మార్పు చేర్పు" (సవాలుచేయబడ్డ తీర్పులోని పేరా 27 లో) ఈ కోర్టు పరిశీలించే అవకాశం కలిగిన ప్రారంభిక ట్రయల్ కోర్టు రికార్డు, అప్పీలుదారుని వాదనను ధృవీకరిస్తుంది. అందువల్ల, ఆ మేరకు, ఆర్డర్ XII రూల్ 6 వ్యవహారస్మృతి (సీపీసీ) (అనగా, అడ్మిషన్లపై తీర్పు "లేదా అన్యధా") నిరాకరించవీలులేని విధంగా రూపొందించబడింది; ఆ విధంగా అప్పీలుదారు, బి.బి. పాటిల్ పైన, వ్యక్తిగతంగా దోషారోపణ చేయబడలేదు; భాగస్వామ్య డైరెక్టరుగా ఉన్న కంపెనీ పైన అభియోగం మోపబడింది. కంపెనీకి సంబంధించి మరియు దాని తరపున, దాని ప్రతినిధిగా, శ్రీ ఎం.బి. పాటిల్ పైన అభియోగాలు మోపబడ్డా యి. నిరాకరించలేని ఈ వాస్తవాలను ట్రయల్ కోర్టు నిర్ధా రించింది. అయినప్పటికీ, అనేక ఇతర ఆరోపణలకు సంబంధించిన విచారణ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని అటువంటి అడ్మిషన్ యొక్క పర్యవసానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
24. ఆర్డర్ VII రూల్ 11 వ్యవహారస్మృతి (సీపీసీ) ప్రకారం అధికారాన్ని వినియోగించుకోవడంలో దావాపత్రం (ప్లెయింట్) (లేదా ప్రస్తు త సందర్భంలో పిటిషను) పాక్షిక తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండదనేది చట్టంలో ఓ మేలైన అంశం. సెజల్ గ్లా స్ లిమిటెడ్ వర్సెస్ నవిలాన్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (2017 (7) యస్.సి.ఆర్
557) కేసులో ఈ కోర్టు ఈ సూత్రాన్ని ఈ కింది విధంగా పేర్కొంది: "ఇది దానంతట అదే ఉన్నతమైన శాసనిక నియమంగా మార్చుకోదు, ఒకసారి గనక దావాపత్రం (ప్లెయింటు)లోని ఒక భాగం కొనసాగలేకపోతే ఇతర భాగం కూడా ముందుకు సాగదు మరియు ఆర్డర్ VII రూల్ 11 కింద దావాపత్రం (ప్లెయింటు) మొత్తంగా తిరస్కరించబడాలి. అటువంటి సందర్భాలన్నింటిలో, కొంతమంది నిర్దిష్ట ప్రతివాదులు మరియు/లేదా ఆస్తు లపై ఉనికిలో ఉండినట్లైతే, ఆర్డర్ VII రూల్ 11 అన్వయించడానికే ఉండదు మరియు దావా మొత్తంగా కొనసాగాల్సిందే. డి. రామచంద్రన్ వర్సెస్ ఆర్.వి. జానకిరామన్ (1999 (3) యస్.సి.ఆర్. 983) కేసులో స్పష్టంగా పేర్కొనబడిన ఈ సూత్రం ఎన్నికల పిటిషన్ కు సంబంధించి, ఈ కింది విధంగా వివరించబడింది: "ఎన్నికల పిటిషను దానంతట అదే వ్యాజ్య కారణాన్ని వెల్లడిస్తుంది, దానిని గనక ఖండించని పక్షంలో ఎన్నికలను ప్రభావిత మొనరించ గలదు మరియు ఆర్డర్ VII రూల్ 11 (ఎ) వ్యవహారస్మృతి (సీపీసీ)ని అందువల్ల ఈ కేసులో ఉపయోగించడం సాధ్యం కాదు. కొన్ని ఆరోపణలు ముఖ్యాంశాలు లేని కారణంగా మరియు ఆ ప్రకారం వ్యాజ్య కారణాన్ని వెల్లడించలేదని పేర్కొనడంలో ఎలాంటి యోగ్యత లేదు. వ్యవహారస్మృతి (సీపీసీ) కింద కోర్టు అభ్యర్ధనను అనేక భాగాలుగా విభజించి వాటిలో ప్రతి ఒక్కటి వ్యాజ్య కారణం వెల్లడిస్తుందా అనేది పరిశీలించడం కేవలం మౌలికమైనది. రూలు ప్రకారం, దావా పత్రం (ప్లెయింటు) లేదా పిటిషన్ కు పాక్షిక తిరస్కరణ అంటూ ఉండదు.”
25. ఈ ప్రతిపాదనకు కొంత అధికారం ఉంది, ఆర్డర్ XII రూల్ 6 వ్యవహారస్మృతి (సీపీసీ) ప్రకారం కోర్టు అధికారం విచక్షణతో కూడుకున్నది మాత్రమే కాదు, జాగ్రత్త వహించాల్సినది కూడా మరియు అడ్మిషన్ నిస్సందేహంగా ఉంటే తప్ప, కోర్టు డిక్రీని రూపొందించడానికి వీలు కల్పించే అధికారం చేయరాదు. ఈ విధంగా హిమాని అలాయ్స్ లిమిటెడ్ వర్సెస్ టాటా స్టీల్ లిమిటెడ్ (2011 (7) యస్.సి.ఆర్ 60) కేసులో ఈ కోర్టు ఈ కింది విధంగా పేర్కొంది: "సమావేశ వివరాలలో ఉన్న "అడ్మిషన్ పై తీర్పు ఇవ్వవచ్చు అనేది వాస్తవం. కానీ, అడ్మిషన్ వివరణాత్మకంగా ఉండాలి. దీనిని ప్రతిపాదించే పార్టీ యొక్క చర్య జాగరూకతతోనూ మరియు ఉద్దేశ్యక పూర్వకంగానూ ఉండాలి, దానికి కట్టు బడి ఉండాలన్న ఉద్దేశ్యం కనపరచాలి. ఆర్డర్ XII రూల్ 6 సామర్ధ్య కారక నిబంధన కావడంతో అదితప్పనిసరి కాదు అనుల్లంఘనీయమైనది కాదు కానీ వివేచనాత్మకమైనది. వాస్తవాలు మరియు పరిస్థితులను పరిశీలించిన తర్వాత అడ్మిషన్ పై తీర్పు అనేది విచారణ లేని తీర్పు, ప్రతివాదికి అప్పీలు యోగ్యతపై అది ఏవిధమైనటువంటి పరిష్కారాన్ని కూడా శాశ్వతంగా తిరస్కరిస్తుందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు తన న్యాయిక వివేచానుసారం వ్యవహరించాలి. అందువల్ల అడ్మిషన్ స్పష్టంగా, నిస్సందేహంగా, మరియు బేషరతుగా ఉంటే తప్ప, క్లెయిముకు వ్యతిరేకించే ప్రతివాది యొక్క విలువైన హక్కును నిరాకరించడానికి కోర్టు విచక్షణను ఉపయోగించరాదు. క్లు ప్తంగా చెప్పాలంటే, విచక్షణను అడ్మిషన్ స్పష్టంగా ఉన్నప్పుడే వినియోగించడంతో పాటు దానిననుసరించి కూడా వ్యవహరించవచ్చు (ఉత్తం సింగ్ దుగ్గల్ అండ్ కంపనీ వర్సెస్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 (సప్లిమెంట్ 2) యస్ సి ఆర్ 187; కరం కపాహి వర్సెస్ లాల్ చంద్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ 2010 (4) యస్ సి ఆర్ 422 మరియు జీవిన్ డీజిల్స్ అండ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వర్సెస్ జస్బీర్ సింగ్ ఛద్దా (2010 (6) యస్ సి సి 526 కూడా చూడుము).
26. ఎన్నికల పిటిషన్ ను స్పష్టంగా పరిశీలించినట్లయితే, అప్పీలుదారుపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులను బహిర్గతం చేయకపోవడానికి లేదా అతను దోషిగా నిర్ధా రించబడిన కేసులను మినహాయించి, సమాచార వ్యాప్తి మరియు వార్తా పత్రికలలో ప్రచురణ ద్వారా వ్యాప్తి చేసేవిధానం, ఫాంట్ పరిమాణం, సంబంధిత వార్తా పత్రికలు జనబాహుళ్యంలోకి చేరుకోవడం మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలు పాటించకపోవడం గురించి ఇతర అభ్యంతరాలు మరియు ఆరోపణలు చేయబడ్డా యని తెలుస్తుంది. చట్టబద్ధమైన, ఎన్నికల కమీషన్ ఆదేశాధీన నిబంధనలను పాటించకఫోవడం, వాటి న్యాయబద్ధత ప్రభావాన్ని, ఆర్డర్ XII రూల్ 11, వ్యవహారస్మృతి (సీపీసీ) లేదా ఆర్డర్ XII రూల్ 6, వ్యవహారస్మృతి (సీపీసీ) కింద ఆవశ్యకమైన సంక్షిప్త విచారణలలో కూడా పరిశీలించడం సాధ్యం కాదు. అప్పీలుదారుని నిందితునిగా పేర్కొన్న కేసులను బహిర్గతం చేయకపోవడానికి సంబంధించిన ఆరోపణలు చివరికి నిజమైనప్పటికీ, అటువంటి ఆరోపణల ప్రభావం (చట్ట నిబంధనలననుసరించి మరియు ఎన్నికల చిహ్నాల ఆదేశాల ద్వారా తప్పనిసరి చేయబడిన) ఇతర వివరాలన్నీ బహిర్గత చేయని సందర్భంలో పూర్తి విచారణ తర్వాత పరిగణనలోకి తీసుకోవాలి. కోర్టు పిటిషన్ ను పూర్తిగా తిరస్కరించడానికి ఎన్నికల పిటిషనర్ కొన్ని వాస్తవాలను (అన్నీ కాదు) అంగీకరించడం సరిపోదు. న్యాయపరమైన రికార్డు నిరాకరించవీలులేని స్వాభావానికి సంబంధించి కూడా, దాని విషయం యొక్క ప్రభావం, పాక్షికంగా డిక్రీని రూపొందించడానికి పూర్తిగా అసమగ్రమే. ఇది వీరేంద్రనాథ్ గౌతం వర్సెస్ సత్పాల్ సింగ్ మరియు ఇతరులు (2006 సప్లిమెంట్ యస్ సి ఆర్ 413) కేసులో పూర్తిస్థా యి విచారణలో నిజం లేదా మరేతర విషయం సాధారణంగా సాక్ష్యానికి సంబంధించిన విషయమని ఈ కోర్టు తీర్పునిచ్చింది. "52. హై కోర్టు, మా అభిప్రాయం ప్రకారం, ఎన్నికల పిటిషన్ విచారణ దశలో మాత్రమే అనుమతించబడే కేసు యొక్క యోగ్యతలోకి ప్రవేశించడం ద్వారా ఆరోణలు మరియు సాక్ష్యాలను సరిదిద్దడానికి నిషేధించబడిన ప్రాంతంలోకి ప్రవేశించింది మరియు ఎన్నికల పిటిషన్ నిర్వహించదగినదా అనే పరిశీలన దశలో కాదు మరియు పిటిషన్ ను కొట్టివేసింది. అందువల్ల, సదరు చర్యను సమర్ధించలేము మరియు ఉత్తరవు పక్కకుబెట్టడానికి అర్హమైనది."
27. చివరగా, సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వినియోగించుకునే ఓటుహక్కు ప్రజాస్వామ్యం యొక్క సారం. స్వరాజ్యం కోసం జరిపిన సుదీర్ఘ స్వాతంత్రపోరాటం తర్వాత, ఈ విలువైన హక్కు లభించింది. పౌరుడు/పౌరురాలు ఈ విడదీయలేని హక్కును వినియోగించుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 దాన్ని స్పష్టీకరిస్తుంది. "భారతీయ పౌరుడైన ప్రతి వ్యక్తి నిర్ణయించబడిన తేదీకి ఇరవైఒక్క సంవత్సరాలు కంటే తక్కువ వయసు లేని మరియు, నివాసం లేకపోవడం, మానసిక రుగ్మత, నేరం లేదా అవినీతి లేదా న్యాయవిరుద్ధ ఆచరణ ఆధారంగా తగువిధంగా శాసనమండలి రూపొందించిన ఏదైనా శాసనం ప్రకారం అనర్హుడు కాని ప్రతి వ్యక్తికి అటువంటి ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత ఉంటుంది." ఆర్టికల్ 325 వివక్షతలేని సూత్రాన్ని పొందుపరచింది: "325. ప్రత్యేక ఓటర్ల జాబితాలో చేర్చడానికి లేదా చేర్చాలని క్లెయిము చేయడానికి మతం, జాతి, కులం లేదా లింగ ప్రాతిపదికన అనర్హులు కాకూడదు. పార్లమెంటు యొక్క ఏ సభకైనా లేదా రాష్ట్ర శాసనమండలి యొక్క ఏ సభకైనా ఎన్నికల కోసం ప్రతిపాదేశిక నియోజకవర్గానికి ఒక సాధారణ ఓటర్ల జాబితా ఉంటుంది మరియు మతం, జాతి, కులం, లింగం లేదా వాటిలో ఏ ప్రాతిపదికనైనా అటువంటి ఏదైనా నియోజకవర్గానికి సంబంధించిన ఏదైన ప్రత్యేక ఓటర్ల జాబితాలో చేర్చడానికి లేదా క్లైయిము చేయడానికి ఏ వ్యక్తి అనర్హుడు కాకూడదు.” ప్రజాస్వామ్యము రాజ్యాంగములో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించ బడుతుంది. అయినప్పటికీ, కొంతమేరకు విరుద్ధంగా ఓటు హక్కు ఇంకా ప్రాధమిక హక్కుగా గుర్తించబడలేదు; అది "కేవలం" చట్టభద్ధమైన హక్కుగా మాత్రమే పేర్కొనబడింది. అయితే, జ్యోతిబసు వర్సెస్ దేబీ ఘోసల్ [1982 (3) అస్ సి ఆర్ 318] కేసులో ఈ కోర్టు మళ్లీ ఈ విధంగా సూటిగా సూచించింది: "ఎన్నుకొనే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాధమికమైనప్పటికీ అది, విచిత్రంగా, ప్రాధమిక హక్కు లేదా సాధారణ చట్ట హక్కు కాదు. ఇది స్వఛ్చమైన మరియు సరళమైన చట్టబద్ధ హక్కు. ప్రముఖ న్యాయమూర్తు లపట్ల గొప్ప గౌరవంతో, ఓటుహక్కు, ప్రాధమిక హక్కు కాకపోయినా ఖచ్చితంగా రాజ్యాంగ హక్కు అని నేను సుస్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ హక్కు రాజ్యాంగం నుండి ఉద్భవించింది మరియు ఆర్టికల్ 326 లో ఉన్న రాజ్యాంగ ఆదేశానికి అనుగుణంగా, అనగా ఆర్.పీ.చట్టం. నా అవగాహన ప్రకారం, లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో ఓటుహక్కు యొక్క స్వభావానికి సంబంధించి సరైన చట్టపరమైన స్థా నం. దీనిని స్వఛ్చమైన మరియు సరళమైన చట్టబద్ధమైన హక్కుగా వర్గించడం ఏమత్రం సరైనది కాదు. ఈ వివరణలో కూడా, ఓటుహక్కు అనేది ప్రాధమిక హక్కు కాదని, ఆ హక్కును అర్ధవంతంగా వినియోగించుకోవడానికి వీలు కల్పించడానికి ఏ ప్రాధమిక హక్కులోనూ అంతర్భాగంగా పరిగణించలేమని సొలిసిటర్ జనరల్ వాదన స్పష్టంగా ఉండిపోయింది." అదేవిధంగా, తీర్పులోని 123 వ పేరాలో, ఓ. చిన్నపరెడ్డి, జె కింది విధంగా పేర్కొన్నారు: "(2) లోక్ సభ లేదా శాసనసభకు జరిగే ఎన్నికలలో ఓటువేసే హక్కు రాజ్యాంగపరమైన హక్కు, కానీ కేవలం చట్టబద్ధమైన హక్కు కాదు; ఓటుహక్కుకు భిన్నంగా, ఓటువేసే స్వేఛ్చ అనేది ఆర్టికల్ 19(1) (ఎ) లో పొందుపరచబడిన ప్రాధమిక హక్కులలో ఒక అంశం. ఒక అభ్యర్ధి లేదా మరొకరికి అనుకూలంగా ఓటు వేయడం ఓటరు భావప్రకటనస్వేఛ్చను సాధించడాన్ని సూచిస్తుంది"
28. నియోజకుడు లేదా ఓటరు, కోర్టు నిర్ణయాల ద్వారా వెలికివచ్చిన అభ్యర్ధి యొక్క పూర్తి నేపధ్యాన్ని తెలుసుకోవడమనేది మన రాజ్యాంగ గొప్ప యవనికకు అదనపు కోణం. దీనిని దృష్టిలో ఉంచుకొని, అప్పీలుదారు వాదన ఆమోదించబడితే గనక వాదనలో ప్రధానాంశాలను అణచివేయబడలేదని అంగీకరించే ఆధారంగా పూర్తిస్థా యి విచారణ నిరాకరణకు గురవుతుందని ఈ కోర్టు అభిప్రాయం. అభియోగం లేనిచోట బహుశా జైలు శిక్ష విధించబడిన క్రిమినల్ కేసు ఉనికిలో ఉందా లేదా జైలులో స్వల్పకాలిక శిక్షకు సంబంధించి మరియు జరిమానా విధించబడిన కేసులో నేరారోపణలు ముఖ్యాంశాలు కావా అనేదానిపై వివాదం ఉంది. ఈ కోర్టు ఆ సమస్యను ముందుగానే నిర్ణయిస్తుంది. ఎందుకంటే అటువంటి సమాచారాన్ని నిలిపివేయడం వల్ల కలిగే ప్రభావం చాలా స్వల్ఫమని భావించినట్లైతే, అది వాస్తవాలను నిలిపివేయడం మరియు చట్టబద్ధమైన నిబంధనలను పాటించకపోవడం (ఇది విచారణలో నిరూపితమైంది) యొక్క సంచిత ప్రభావంపై ఆధారపడి ముగింపు తిరస్కరించబడింది (ఆర్గ్యూఎండో). ఈ కారణాలవలన, సవాలు చేయబడిన తీర్పుని తప్పుపట్టలేమని ఈ కోర్టు అభిప్రాయపడుతుంది.
29. పైన పేర్కొన్న సమాలోచనం దృష్ట్యా అప్పీలులో ఎటువంటి యోగ్యత లేదు; అప్పీలు తదనుసారం ఖర్చులతో కొట్టివేయబడింది. …….................... న్యాయమూర్తి (ఎస్. రవీంద్ర భట్).. …….................... న్యాయమూర్తి (అరవింద్ కుమార్) న్యూ ఢిల్లీ